రెనాల్ట్‌ నైట్‌ & డే ఎడిషన్‌ కార్లు విడుదల.. ఈ కార్లు వెరీ స్పెషల్‌, ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి!

రెనాల్ట్ ఇండియా తన కంపెనీ లైనప్స్‌ లోని కిగర్, ట్రైబర్, క్విడ్ మోడళ్లను సరికొత్త నైట్ అండ్ డే ఎడిషన్లలో విడుదల చేసింది. ఈ సరికొత్త స్పెషల్‌ ఎడిషన్‌ కార్లు కొత్త ఎక్స్టీరియర్ మార్పులతో పాటు అధునాతన ఫీచర్లతో కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ అప్‌గ్రేడ్స్‌ యంగ్‌ కస్టమర్లను అమితంగా ఆకట్టుకోనున్నాయి. పండుగ సీజన్‌లో ఈ నైట్ అండ్ డే స్పెషల్‌ ఎడిషన్ మోడళ్లు కంపెనీ అమ్మకాలకు దోహద పడనుంది. ఈ కొత్త ఎడిషన్లు అన్ని మోడళ్లలో కేవలం 1600 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఎడిషన్లు సరికొత్త అవతారంలో కస్టమర్లను కచ్చితంగా ఆకర్షించనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ముందుగా ఇందులో రెనో క్విడ్ నైట్ అండ్ డే ఎడిషన్ ధర రూ .4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది క్విడ్ ఆర్ఎక్స్ఎల్ (ఓ) మాన్యువల్ వెర్షన్ ధరతో అందుబాటులో ఉంటుంది. ఇక నైట్ అండ్ డే కిగర్ ఎడిషన్ మాన్యువల్ వెర్షన్ ధర రూ .6.75 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)కంటే రూ. 15 వేలు అధికంగా ఉంటుంది.

Renault Kwid Night and Day Special Edition

దీని ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ 7.25 లక్షలుగా ఉంది. ఇది కూడా RXL కంటే రూ. 15,000 ఎక్కువ ఖరీదైనదిగా ఉంది. రెనాల్ట్ ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్ RXL ధర రూ.7 లక్షల ధరతో ఆర్ఎక్స్ఎల్ వెర్షన్ కంటే రూ. 20,000 ఎక్కువ ఖరీదైనదిగా ఉంది.

ఈ కార్లన్నీ డ్యూయల్ టోన్‌, మిస్టరీ బ్లాక్ రూఫ్‌తో ప్రత్యేకమైన పెర్ల్ వైట్ బాడీ కలర్‌లో లభిస్తాయి. ఇతర కాస్మెటిక్ మార్పులలో పియానో బ్లాక్ గ్రిల్, వీల్ కవర్లు, నేమ్ ప్లేట్స్‌, ORVMలు ఉన్నాయి. కిగర్‌లో టెయిల్ గేట్ అలంకరణ కూడా పియానో బ్లాక్‌లో తీసుకువచ్చారు. మొత్తం మీద ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు ఆకర్షణీయమైన డిజైన్‌ని కలిగి ఉన్నాయి.

Renault Kiger Special Edition

కిగర్, ట్రైబర్ లోని ఫీచర్ల విషయానికి వస్తే వీటిలో తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ రెప్లికేషన్, రియర్ వ్యూ కెమెరా ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్‌ ఎడిషన్ వెనుక భాగంలో పవర్ విండోలను కలిగి ఉంది. ఈ రెనాల్ట్ కిగర్, ట్రైబర్ క్విడ్ నైట్ & డే ఎడిషన్ల బుకింగ్స్‌ సెప్టెంబర్ 17 న (రేపు) భారతదేశంలోని అన్ని అధీకృత డీలర్షిప్లలో ప్రారంభమవుతాయి.

ఇవి పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నందున ఆసక్తిగల కొనుగోలుదారులు తమ వాహనాన్ని రేపే బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మళ్లీ ఈ ఎడిషన్‌లను విడుదల చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఈ లిమిటెడ్ ఎడిషన్ కావాల్సిన వారు దగ్గర్లోని షోరూమ్‌ని లేదా డీలర్‌షిప్‌ని సంప్రదించి మరిన్నీ ఆఫర్లపై వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకోవచ్చు.

Renault Triber Night and Day Editon

ఇది కొత్త తరం కస్టమర్లకు మాత్రమే కాకుండా సంస్థ డిస్ట్రిబ్యూటర్లకు, ఉద్యోగులకు ఉత్తేజమైన ప్రకటన అని రెనాల్ట్ ఇండియా సీఈవో మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ తెలిపారు. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్ల ద్వారా రెనాల్ట్ కుటుంబానికి మరింత మంది కస్టమర్లను ఆహ్వానించబోతున్నామని అన్నారు. ఇది కంపెనీ సేల్స్‌కి సహాయపడుతుందని ఆయన చెప్పారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 16, 2024, 21:13 [IST]
English summary
Renault india launches night day limited editions check prices and models details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+