కొత్త కారు కొనేవారికి ఇది కదా శుభవార్త!.. Renault కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్

భారతీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన రెనాల్ట్ ఇండియా (Renault) ఈ నెలలో కొన్ని ఎంపిక చేసిన తన ఉత్పత్తుల మీద మంచి డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ జాబితాలో కిగర్, ట్రైబర్ మరియు క్విడ్ ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రెనాల్ట్ కిగర్ (Renault Kiger)

రెనాల్ట్ కంపెనీ యొక్క పాపులర్ మోడల్ కిగర్ కొనుగోలుపైన కస్టమర్ ఇప్పుడు ఏకంగా రూ. 40000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో రూ. 15000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10000 లాయల్టీ బోనస్ మరియు ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 15000 పొందవచ్చు. ఇలా మొత్తం నలభై వేల రూపాయలు కిగర్ కొనుగోలుపై ఆదా చేయవచ్చు. ఈ అవకాశం కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Renault Kiger

దేశీయ విఫణిలో ఎక్కువమందికి ఇష్టమైన రెనో బ్రాండ్ కారు కిగర్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 11.23 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కలిగిన ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ / 5 స్పీడ్ ఆటోమాటిక్ మరియు సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber)

ఈ నెలలో రెనాల్ట్ ట్రైబర్ కారు కొనుగోలుపైన కస్టమర్ రూ. 35000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో రూ. 10000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10000 లాయల్టీ బోనస్ మరియు రూ. 15000 ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. ట్రైబర్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 8.97 లక్షల వరకు ఉంటుంది. ఇది పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది.

Renault Triber

మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ట్రైబర్ 18.2 నుంచి 20 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారు 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి మరిన్ని ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా.. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)

ఇక చివరగా క్విడ్. రెనాల్ట్ క్విడ్ కొనుగోలుపైన కంపెనీ రూ. 35000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 10000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10000 లాయల్టీ బోనస్ మరియు రూ. 15000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తాయి. దేశీయ విఫణిలో తక్కువ ధర వద్ద లభిస్తున్న సరసమైన కార్ల జాబితాలో క్విడ్ ఒకటి. దీని ధర రూ. రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.45 లక్షల మధ్య ఉంది.

Renault Kwid

మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన రెనాల్ట్ క్విడ్ సేఫ్టీ పరంగా కూడా చాలా ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉండటమే కాకుండా తక్కువ ధర వద్ద లభించడం వల్ల ఈ కారును ఎక్కువంది కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు.

రెనాల్ట్ కంపెనీ అందించే ఆఫర్ కేవలం 2024 మార్చి చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఈ ఆఫర్ అందుబాటులో ఉండకపోవచ్చు. అంతే కాకుండా డిస్కౌంట్ అనేది ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతుంటారు. అంతే కాకుండా కస్టమర్ ఎందుకునే కలర్ ఆప్షన్ కారణంగా కూడా ధరల్లో మార్పులు ఉండవచ్చు. కాబట్టి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి కస్టమర్ కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 13, 2024, 14:38 [IST]
English summary
Renault india march 2024 discounts kiger to kwid
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+