Renault Cars Updated: హై ఎండ్ ఫీచర్లతో రెనాల్ట్ కార్లు అప్‌డేట్.. ఒక్కో కారు ధర రూ. 6 లక్షల లోపే.!!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా ఓ సరికొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్, ట్రైబర్, కిగర్ కార్లను అప్‌డేట్ చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ కార్లు ఇప్పుడు కొత్త ఫీచర్లతో, సరికొత్త వేరియంట్లతో రానున్నాయి. అంతే కాకుండా కొత్త కలర్ స్కీమ్‌లతో కూడా సంస్థ ప్రవేశపెడుతోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత మార్కెట్లో ప్రముఖ కార్ల కంపెనీల నుంచి ఫేస్‌లిఫ్టెడ్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్త డిజైన్లు, ఫీచర్లు, భద్రతా లక్షణాలతో మార్కెట్‌లోకి ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో రెనాల్డ్ ఇండియా(Renault India) ఈ కొత్త సంవత్సరంలో మూడు కార్లను అప్‌డేట్ చేసింది.

2024 రెనాల్ట్ క్విడ్: కొత్త రెనాల్ట్ క్విడ్(Renault Kwid) క్లైంబర్ వెర్షన్ మూడు కొత్త డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ బాడీ షేడ్స్‌తో సంస్థ ప్రవేశపెట్టింది. RXL(O) వేరియంట్‌లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అందిస్తోంది. రెనాల్ట్ క్విడ్ ఈజీ RXL(O) వేరియంట్.. R-AMT తో జతచేయబడి ఉంటుంది.
భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో లభించే హ్యాచ్‌బ్యాక్(Renault Cars Updated)గా రెనాల్ట్ క్విడ్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ప్రధానంగా 14 సేఫ్టీ ఫీచర్లను సంస్థ అందిస్తోంది. కొత్త అప్‌డేటెడ్ రెనాల్ట్ క్విడ్ ధర రూ. 4.69 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

2024 రెనాల్ట్ ట్రైబర్: రెనాల్ట్ ట్రైబర్(Renault Triber)ను సరికొత్త అప్‌డేట్లతో ఆకర్షణీయంగా రూపొందించారు. ఇందులో డ్రైవర్ సీట్ ఆర్మ్‌రెస్ట్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్‌సైటడ్ రియర్ వ్యూ మిర్రర్స్, 7 అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జర్‌ను చూడవచ్చు. ఇందులోని RXT వేరియంట్‌లో రియర్ వ్యూ కెమెరా, రియర్ వైపర్‌ను చూడవచ్చు.
కాగా RXL వేరియంట్‌లో రియర్ ఏసీ వెంట్స్‌ను పొందుతుంది. ఇంకా ఎల్‌ఈడీ క్యాబిన్ లైట్లు, PM 2.5 ఎయిర్ ఫిల్టర్‌ను అందించారు. కొత్త రెనాల్ట్ ట్రైబర్‌లోని అన్ని వేరియంట్లలో 15 సేఫ్టీ ఫీచర్లు, రియర్ సీట్‌బెల్ట్ రిమైండర్‌ను స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఈ కారు కొత్త స్టీల్త్ బ్లాక్ బాడీ కలర్ ఆప్షన్‌లోనూ ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు(ఎక్స్ షోరూమ్).

2024 రెనాల్ట్ కిగర్: కొత్త అప్‌డేటెడ్ రెనాల్ట్ కిగర్(Renault Kiger 2024)లో ఆకర్షణీయమైన అప్‌డేట్లు ఉన్నాయి. ఇందులో సెమీ- లెథెరెట్ సీట్లు, లెథెరెట్ స్టీరింగ్, ఆటో ఫోల్డ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్(ORVM)ను జోడించారు. ఇంకా IRVM ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ను కలిగి ఉంటుంది. ఇందులోని టర్బో ఇంజిన్ ఇప్పుడు రెడ్ బ్రేక్ కాలిపర్‌ను కలిగి ఉంది.
రెనాల్ట్ కిగర్ RXT(O) వేరియంట్‌లో ఆటో ఏసీ, పవర్ ఫోల్డ్ ORVM ఉండగా, RXZ ఎనర్జీ వేరియంట్‌లో క్రూయిజ్ కంట్రోల్‌ను చూడవచ్చు. రెనాల్ట్ కిగర్ అన్ని వేరియంట్లలో ఎల్‌ఈడీ క్యాబిన్ ల్యాంప్స్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా ఇందులో 15 భద్రతా ఫీచర్లతో పాటు సీట్ బెల్ట్ రిమైండర్లు ఉన్నాయి.

రెనాల్ట్ కిగర్ లైనప్ కొత్త RXL వేరియంట్.. ఎనర్జీ మాన్యువల్ EASY-R AMT పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. RXT(O) వేరియంట్ టర్బో మాన్యువల్ ఇంకా X-Tronic CVT పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. భారత మార్కెట్లో కొత్త అప్‌డేటెడ్ 2024 రెనాల్ట్ కిగర్ ధర రూ. 6 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications








