పొట్టి కార్లలో గట్టిది.. చిన్న ఫ్యామిలీలకు బెస్ట్, 5 మంది హాయిగా వెళ్లవచ్చు.. ధర రూ. 5 లక్షల లోపే!
దేశంలో రెనాల్ట్ క్విడ్‌కి మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరలో చిన్న కారుని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ రెనాల్ట్ క్విడ్ ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన కార్లలో ఒకటి అని చెప్పవచ్చు. మారుతి ఆల్టో, సెలెరియో, వ్యాగన్‌ఆర్ పోటీని ఇది ఎదుర్కొని నిలదొక్కుకుంది. అందువలల్ ఈ కారు టాప్‌లో కొనసాగుతుంది. దీనిని ఎక్కువగా జనాలు కొనడానికి కారణం దీని ఎస్‌యూవీ డిజైన్. ఇది చిన్న కుటుంబాలకు కంఫర్ట్‌గా ఉంటుంది. సిటీ డ్రైవింగ్‌తో పాటు హైవేలోనూ ఈ కారు మంచి ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది. మెరుగైన ఇంజిన్ పనితీరు రగ్డ్ లుక్‌తో ఉన్న చిన్న హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు ఫర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న ధర, ఫీచర్లు, మరెన్నో ఇతర స్పెసిఫికేషన్స్‌పై ఓ లుక్కేయండి.
ధర: ఈ కారు ధర రూ .4.70 లక్షల నుంచి రూ .6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇక దీనిలోని AMT వేరియంట్ల ధరలు రూ.5.45 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఈ క్విడ్ కారు ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎల్(ఓ), ఆర్ఎక్స్‌టీ, క్లైంబర్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. కస్టమర్లు తమకు నచ్చిన వేరియంట్‌ని ఎంచుకోవచ్చు.

ఫీచర్లు: ఇక ఇందులోని 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంలు, ఫోర్-వే పవర్ విండోస్, మాన్యువల్ ఏసీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ రెనాల్ట్ క్విడ్1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 68 ps శక్తిని, 91 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తుంది.
బెస్ట్ వేరియంట్: క్విడ్ స్పెక్ ఆర్‌ఎక్స్‌టీ వేరియంట్ నాలుగు వేరియంట్లలో బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు వెచ్చించే డబ్బుకి ఇది సరిపోతుంది. ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ఓఆర్‌వీఎంలు (ఎక్ట్సీరియర్ రియర్ వ్యూ మిర్రర్స్), నాలుగు పవర్ విండోస్, ఐఆర్‌వీఎం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు దీనికి అదనపు ఆకర్షణను అందిస్తాయి.

అంతే కాకుండా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ) మాత్రమే కాకుండా రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఇందులో ఉంది. ఈ క్విడ్ ఆర్‌ఎక్స్‌టీ వేరియంట్ ధర రూ .5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. మిగతా వేరియంట్స్ కూడా మీ డబ్బుకి తగినంత వ్యాల్యూని అందిస్తాయి.
ఈ క్విడ్ ఐదు మోనోటోన్, ఐదు డ్యూయల్ టోన్ రంగుల్లో లభిస్తుంది. ఐస్ కూల్ వైట్, ఫియరీ రెడ్, అవుట్బ్యాక్ బ్రాంజ్, మూన్లైట్ సిల్వర్, జాన్స్కర్ బ్లూ అనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయల్-టోన్ కలర్స్ అవుట్‌బాక్స్ బ్రాంజ్ మినహా బ్లాక్ పైకప్పుతో వస్తాయి. డ్యూయల్ టోన్ షేడ్‌లో మెటల్ లుక్ ఆకట్టుకుంటుంది.

రెనో క్విడ్‌కి పోటీగా ఇతర ప్రత్యామ్నాయ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో మారుతి ఆల్టో కె 10, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోలను బెస్ట్‌గా పరిగణించవచ్చు. మీకు రెనాల్ట్ నచ్చకపోతే వీటిని ఎంచుకోవచ్చు. అయితే ఇందులోని క్లైంబర్ వేరియంట్ టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ మైక్రో ఎస్‌యూవీలలో బేస్-స్పెక్ వేరియంట్లకు పోటీని ఇస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








