22.3 కి.మీల మైలేజ్ కారు ధర కేవలం రూ. 4.69 లక్షలే.. రెనాల్ట్ బంపర్ ఆఫర్.. వెంటనే షోరూమ్‌కు పరుగెత్తండి..

డిసెంబర్ నెలతో పాత ఏడాది ముగుస్తున్న తరుణంలో ఇయర్ ఎండ్ సేల్‌ను ఇప్పటికే చాలా ఆటోమొబైల్ తయారీదారులు ప్రకటిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు నెల నెల ఆఫర్లను అందిస్తుంటాయి. వీటి ద్వారా వినియోగదారులను ఆకట్టుకుని సేల్స్‌ను పెంచుకోవాలని చూస్తాయి. ఈ నేపథ్యంలో దేశీయ వాహన తయారీ కంపెనీ రెనాల్ట్ ఇండియా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి ప్రతినెలా ఎంపిక చేసిన మోడళ్లపై తగ్గింపు ఆఫర్లను అందిస్తుంది. ఇదే క్రమంలో కంపెనీ మరోసారి డిసెంబర్ నెలలో ప్రత్యేక తగ్గింపు ప్రకిటించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదే నెలతో 2024 ఏడాది ముగియనుంది. అంటే కొత్త ఏడాది ప్రారంభానికి ముందు అందిస్తున్న ఆఫర్ ఇది. దీనిలో భాగంగా రెనాల్ట్ ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై డిసెంబర్‌లో డిస్కౌంట్‌ను ప్రకటించింది.

కంపెనీ అందిస్తున్న తగ్గింపు ప్రధానంగా క్విడ్ (KWID), కిగర్ (Kiger), ట్రైబర్ (Triber) కార్లపై అందిస్తుంది. ఒక్కో కారుకు ఒక్కో విధంగా తగ్గింపు ఇస్తుంది. ఇప్పటికే ఫెస్టివల్ సమయంలో మంచి సేల్స్‌ను సాధించిన కంపెనీ ఇప్పుడు ఈ డిసెంబర్‌లో ఇస్తున్న ఆఫర్ ద్వారా కొత్త ఏడాదికి ముందు తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. మోడళ్ల వారీగా తగ్గింపులను క్రింది కథనంలో చూద్దాం..

renault offers Kiger

రెనాల్ట్ కిగర్ (Kiger) గురించి మాట్లాడుకుంటే, కంపెనీ ఈ డిసెంబర్ నెలలో ఎస్‌యూవీపై వినియోగదారుల కోసం భారీ మొత్తంలో రూ.75,000 వరకు తగ్గింపును అందిస్తుంది. దీనిలో ప్రధానంగా రూ.40,000 క్యాష్ తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.20,000 లాయల్టి క్యాష్ తగ్గింపులు ఉన్నాయి. దేశీయ మార్కెట్లో ఈ మోడల్ ప్రస్తుత ధర రూ.రూ.5.99 లక్షల నుండి రూ.9.29 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

తక్కువ ధరలో కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇది 1-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీ లీటర్‌కు దాదాపు 18.24 నుంచి 20.5 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. కిగర్ డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. చిన్న కుటుంబం గల వారు ఈ కారులో సులభంగా ప్రయాణించవచ్చు. మొత్తం 5 మంది కూర్చోవచ్చు.

renault offer Kwid in december

హ్యాచ్‌బ్యాక్‌ మోడల్ అయినటువంటి రెనాల్ట్ క్విడ్ (KWID) ఇండియాలో బాగా డిమాండ్ కారు. ఈ నెలలో కంపెనీ రూ.45,000 వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ మొత్తంలో రూ. 20,000 క్యాష్ తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.10,000 లాయల్టీ క్యాష్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్‌ ఇండియా మార్కెట్లో రూ. 4.69 లక్షల నుంచి గరిష్టంగా రూ. 6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

రెనాల్ట్ క్విడ్ 5 మంది ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 21.46 నుంచి 22.3 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. క్విడ్ ప్రధానంగా 5-స్పీడ్ మాన్యువల్, -స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది అధునాతన ఫీచర్లతో నిండి ఉంటుంది.

renault discount in december

రెనాల్ట్ ట్రైబర్ కారుపై డిసెంబర్ నెలలో ప్రత్యేకంగా రూ.60,000 తగ్గింపు ఉంది. ఈ మొత్తంలో రూ.25,000 క్యాష్ తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్,రూ.20,000 లాయల్టీ క్యాష్ తగ్గింపు ఉంటాయి. ఈ కారు ధర దేశీయంగా రూ.5.99 లక్షల నుంచి రూ.8.12 లక్షలు(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మిగతా వాటితో పోలిస్తే ఇది పెద్దది. ఈ కారులో 7 మంది ప్రయాణించవచ్చు. ఇది లీటర్ పెట్రెల్‌కు 20 కి.మీల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 5, 2024, 9:30 [IST]
English summary
Renault offers upto rs 75000 discount on kiger kwid and triber cars in december
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+