రూ.5.99 లక్షల ధరకే 7-సీటర్ MPV.. ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసా?
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVలతో పాటు 7 సీటర్ MPVలకు కూడా భారీ డిమాండ్ ఉంటుంది. కుటుంబ సభ్యులు అంతా ఒకే వాహనంలో వెళ్లేలా ఉండేందుకు ఇటీవల చాలా మంది MPVల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగా కార్ల తయారీ సంస్థలు కూడా ఈ తరహా 7 సీటర్ వాహనాలను విడుదల చేస్తున్నాయి.
ప్రస్తుతం 7 సీటర్ వాహనాల్లో మారుతి ఎర్టిగా మంచి ఆదరణ పొందింది. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకికి పోటీనిచ్చేందుకు రెనాల్ట్ సంస్థ సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా 7 సీటర్ వెర్షన్‌ను (Renault Triber 2024 MPV) ఇటీవల విడుదల చేసింది. ఈ MPV ప్రారంభ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. పాత మోడల్ కంటే రూ.34,000 తక్కువకే అందుబాటులో ఉంది.

రెనాల్ట్ ట్రైబర్ 2024 ఫీచర్లు రెనాల్ట్ ట్రైబర్ 2024 MPV 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ను సపోర్టు చేస్తుంది. డిజిటల్ ఇన్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, మొబైల్ ఫోన్ కనెక్టివీటీ, రెండు, మూడో వరుస ప్రయాణికుల కోసం AC వెంట్‌లు, సెంటర్ కన్సోల్, స్టార్ట్/స్టాప్ పుష్ బటన్ ఉన్నాయి.
రెనాల్ట్ ట్రైబర్ 2024 సేఫ్టీ ఫీచర్లు : భద్రతా పరంగా రెనాల్ట్ ట్రైబర్ 4-స్టార్ రేటింగ్‌తో వస్తుంది. 4-ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రియల్ వ్యూ మిర్రర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెనాల్ట్ ట్రైబర్ 2024 వేరియంట్లు : ట్రైబర్ 2024 MPV.. RXE, RXL, RXT, RXZ వంటి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. కొత్త MPV రన్నింగ్ ORVMలతో వస్తుంది. స్టాండర్డ్ కలర్ ఆప్షన్‌లు కాకుండా స్టెల్త్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ రంగులోనూ అందుబాటులో ఉంటుంది. రెనాల్ట్ ఎంపీవీ హైఎండ్ వేరియంట్‌లో స్మార్ట్ కీ యాక్సెస్‌ను కలిగి ఉంటుంది.
రెనాల్ట్ ట్రైబర్ 2024 MPV 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 72bhp శక్తి, 96Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ కారులో 84 లీటర్ బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. మూడో వరుస సీట్లను మడతపెట్టడం వద్ద అదనంగా 625 లీటర్ల స్పేస్ లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








