ఇంత తక్కువ ధరలో 7-సీటర్ కారు లభించడం అసాధ్యం.. పెద్ద ఫ్యామీలీలకు ఇదే బెస్ట్ ఆప్షన్!
భారత మార్కెట్‌లో ఎంపీవీలకు డిమాండ్ పెరుగుతుంది. ఎవరైనా కార్లు కొనాలి భావిస్తే ముందుగా ఫ్యామిలీ మొత్తం హాయిగా వెళ్లగలరా లేదా అనే ప్రశ్న మదిలో మెదులుతుంది. అందువల్ల చాలా మంది ఫ్యామీలీలకు సరిపోయే విధంగా ఎంపీవీలను మాత్రమే ఎంచుకుంటున్నారు. దీంతో వినియోగదారుల నుంచి ఈ విభాగానికి మంచి స్పందన లభిస్తుంది. ఎందుకంటే వీటిలో ఎక్కువ మంది ప్రయాణించడమే కాకుండా విశాలమైన స్పేస్‌ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం దేశంలో ఎంపీవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా, రెనాల్ట్ ట్రైబర్ భారతీయ వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందాయి. మారుతి ఎర్టిగా ప్రస్తుతం బడ్జెట్ 7-సీటర్ కార్ల విభాగంలో బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. మారుతి ఎర్టిగా కంటే తక్కువ ధరలో ఈ కారు ఉండటంతో జనాలు వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) మారుతి ఎర్టిగాకు గట్టి పోటీని ఇస్తుంది. ఇటీవల కాలంలో ఎర్టిగాకు దీని నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆగస్టు 2024 నెలలో రెనాల్ట్ ట్రైబర్ సేల్స్ రిపోర్ట్ వెల్లడి అయ్యింది. 2024 ఆగస్టులో మొత్తం రెనాల్ట్ 1,514 ట్రైబర్ యూనిట్లను విక్రయించింది. 2023 ఆగస్టుతో పోలిస్తే 1,821 యూనిట్ల ట్రైబర్లను విక్రయించింది. గత సంవత్సరం అమ్మకాలతో పోలిస్తే ఇది 17 శాతం తక్కువగా ఉంది.

ఈ ట్రైబర్ RXE, RXL, RXT RXZ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెనాల్ట్ ట్రైబర్ బేస్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ .6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇందులోనే టాప్-స్పెక్ AMT వేరియంట్ ధర రూ .8.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. వీటిన్నంటిలో రెనాల్ట్ ట్రైబర్ RXT బెస్ట్ వేరియంట్‌గా ఉంటుంది.
ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs వంటి అన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ 1-లీటర్ న్యాచ్‌రల్ ఆస్పిరేటెడ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 72 ps పవర్‌ని, 96 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMTతో జతచేయబడి ఉంటుంది.

ఇక మైలేజీ పరంగా ఇది మాన్యువల్‌లో లీటరుకు 17.65 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 14.83 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. సేఫ్టీ పరంగా రెనాల్ట్ ట్రైబర్‌లో నాలుగు ఎయిర్‌బ్యాగ్స్, ABS విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), రేర్ పార్కింగ్ సెన్సార్స్, రేర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.
మీకు తక్కువ బడ్జెట్లో 7 సీట్ల కారు అవసరమైతే, రెనాల్ట్ ట్రైబర్ ఖచ్చితంగా పరిగణించదగిన మోడల్. ఈ కారు ఇతర 5 సీట్ల హ్యాచ్‌బ్యాక్స్ కంటే ఎక్కువ బూట్ స్పేస్‌ని అందిస్తుంది. అయితే పూర్తి లోడింగ్ వల్ల కొండ ప్రాంతాల్లో కారు ఇంజిన్‌పై ప్రభావం పడుతుంది. ఎందుకంటే పనితీరు ఆశించిన స్థాయిలో ఉండదు. ఈ విషయంలో మీరు తగ్గితే ఈ విభాగంలో ఇదే బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








