ఇక ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఫైనాన్స్‌ మరింత సులభతరం.. వాళ్లే మీ దగ్గరకు వస్తారు!

ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కి ఫైనాన్సింగ్‌ అందించే రెవ్‌ఫిన్‌ (RevFin) సంస్థ సన్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రూ.100 కోట్ల విలువైన 15,000 వాహనాలను కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించింది. రూ.100 కోట్ల మైలురాయితో భారతదేశంలోనే ఈ ప్రముఖ ఈవీ ఫైనాన్సింగ్ కంపెనీ భారీ ముందడుగు వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్‌ని ప్రోత్సహించడానికి అలాగే దేశవ్యాప్తంగా వివిధ కార్యకలాపాల ద్వారా ఎలక్ట్రిక్‌ విభాగంలో విప్లవాత్మకంగా మార్పుల కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

తాజాగా బెంగళూరులో ఈ కంపెనీ 'జాగృతి యాత్ర అభియాన్-రెవ్అప్' అనే ప్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌ని బెంగళూరు అంతటా విస్తరిస్తోంది. దీని ద్వారా బెంగళూరు పట్టణంలోని ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, ఇతర ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకునేలా కార్యక్రమాలు చేపట్టనుంది. దీంతో పాటు కర్ణాటకలోని ఈవీ విధానానికి మార్పులు తీసుకువచ్చేందుకు బెంగళూరులోని కాన్రాడ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్విహించింది. ఈ కార్యక్రమంలో కంపెనీ థీమ్‌ని ఇతర సర్వీసులను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Revfin with SUN Mobility

బెంగళూరులో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వినియోగంపై, నగరాల్లో వాణిజ్య అవసరాలకు ఇలాంటి చర్యలు ఉపక్రమిస్తాయని భావిస్తోంది. ఈ చర్య ఉద్గారాలను తగ్గించడానికి, మెరుగైన గాలి నాణ్యతకు ఇతర వ్యాపారాలలో మెరుగైన నిర్వహణ సామర్థ్యానికి దోహదం చేస్తుందని వెల్లడించింది. బెంగళూరులో ఈవీ రంగంతో పాటు, రవాణా మార్కెట్‌ని పూర్తిగా మార్పు చేయండంలో రెవ్‌ఫిన్‌ కీలక పాత్ర పోషించనుంది.

రెవ్‌ఫిన్ ఇప్పటికే తన పోర్ట్‌పోలియో కింద షాడోఫాక్స్, లాగ్ 9, ఎవెరా, షాఫ్ర్ (Shadowfax, Log9, Evera, and Shoffr) వంటి ప్రస్తుత ఫ్లీట్ పార్టనర్స్‌తో మంచి మార్కెట్‌ని సంపాదించింది. పాన్-ఇండియా మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కంపెనీ త్వరలో తన వ్యాపారాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తోంది. గత ఆరు నెలల్లో రెవ్‌ఫిన్‌ 65,000 వాహనాలకు రూ .900 కోట్ల ఫైనాన్స్ చేసింది.

Revfin with SUN Mobility

సన్ మొబిలిటీలో ఇంధన పరిష్కారాల ద్వారా స్థిరమైన మొబిలిటీని ప్రారంభించడానికి మేము కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది. రెవ్‌ఫిన్‌తో మా భాగస్వామ్యం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మార్పు వేగవంతం చేస్తుందని సన్‌మొబిలిటీ పేర్కొంది. రెవ్‌ఫిన్‌ ఫైనాన్సింగ్ సామర్థ్యాలతో మా పోర్ట్‌పోలియోను మరింత విస్తృతం చేయనన్నట్లు వెల్లడించింది. ఈ చర్య భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణలో గణనీయమైన వృద్ధిని ప్రేరేపిస్తుందని పేర్కొంది.

ఈ ఒప్పందం రెవ్‌ఫిన్‌ పూర్తిస్థాయి కార్యాచరణలను విస్తరించడమే కాకుండా దాని మొబిలిటీ వ్యాపార వర్టికల్స్‌ని విస్తరించడానికి దాని నిబద్ధతను బలపరుస్తుంది. భారతదేశం అంతటా ఫ్లీట్ ఆపరేటర్లలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను నడిపించడంపై వ్యూహాత్మక ఇది దృష్టి సారిస్తుంది. వాహనాల కొనుగోలు సమయంలో ఈ చర్య ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి, దేశవ్యాప్తంగా ఇతర ఫ్లీట్ కార్యకలాపాలను మార్చడానికి వారి అంకితభావాన్ని హైలైట్ చేయనుంది.

రెవ్‌ఫిన్ మరియు సన్ మొబిలిటీ మధ్య సహకారం భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి తమ భాగస్వామ్య దూర దృష్టిని సూచిస్తుంది. ఈ భాగస్వామ్యం వినూత్న ఫైనాన్సింగ్, ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా EV స్వీకరణలో గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇది దోహద పడనుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 6, 2024, 19:35 [IST]
English summary
Revfin expands ev operations with sun mobility takeover check details in telugu
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+