ఫస్ట్ మేడ్ ఇన్ నేపాల్ హ్యుందాయ్ కారు ఇదే.. చూసారా!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai) నేపాల్ దేశంలో ఉత్పత్తి ప్రారంభించడానికి అక్కడ ప్లాంట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్లాంట్‌లో నిర్మించబడిన తన మొదటి కారును కంపెనీ ఎట్టకేలకు అధికారికంగా ఆవిష్కరించారు.
హ్యుందాయ్ కంపెనీ ఆవిష్కరించిన మొదటి కారు 'వెన్యూ' (Venue). దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. ఇందులో మేడ్ ఇన్ నేపాల్ ఫస్ట్ వెహికల్ అని ఉండటం చూడవచ్చు. దీనిని 2024 మే 10వ తేదీనన నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి టే-యంగ్ పార్క్ ప్రారంభించారు.

నేపాల్ హ్యుందాయ్ కంపెనీ ప్లాంట్ 5000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే నేపాల్ ప్లాంట్ సంవత్సరానికి 5000 కార్లను తయారు చేయడానికి అనుకూలంగా ఉంది. ఈ ఫస్ట్ కారును ప్రారంభించిన సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండీ మరియు సీఈఓ ఉన్సూ కిమ్ మాట్లాడుతూ.. మేము నేపాల్ దేశ ప్రధాని పుష్ప కమల్ దహల్ మరియు ప్రభుత్వం మద్దతుతో ఉత్పప్తి ప్రారంభించాము.
స్థానికంగా అసెంబుల్ చేయడానికి అనుకూలమైన వాతావరణం అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి మరింత సహకారం మరియు ప్రోత్సాహకాలు లభిస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. సంస్థ ఉత్తమ వాహనాలను తయారు చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన అన్నారు. నేపాల్‌లో లక్ష్మీ గ్రూప్.. హ్యుందాయ్ కార్లను ఉత్పత్తి చేసి విక్రయాలు జరుపుతుందని పేర్కొన్నారు. కంపెనీకి హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి కావలసిన సహాకారం కూడా అందుతుందని ఆయన అన్నారు.

నిజానికి హ్యుందాయ్ కంపెనీకి భారత్ అతి పెద్ద ఎగుమతిదారు. అంటే భారతదేశంలో కంపెనీ హ్యుందాయ్ కార్లను తాయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసి విక్రయిస్తుంది. నేపాల్ కూడా కంపెనీకి ప్రధాన మార్కెట్‌గా ఉంది. మొత్తం మీద నేపాల్‌లో పరిశ్రమ యొక్క మొదటి వెహికల్ అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటైంది. మొదటి వాహనం కూడా వచ్చేసింది. దీని వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి, తద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతారు.
నేపాల్ ప్లాంట్ నుంచి కంపెనీ వెన్యూ కారును మొదటి ఉత్పత్తిగా విడుదల చేశారు. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని మోడల్స్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అయితే ఈ కంపెనీ నుంచి తయారయ్యే హ్యుందాయ్ కార్లు ఇతర దేశాలకు కూడా ఎగుమతయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే హ్యుందాయ్ కంపెనీకి నేపాల్ కూడా ప్రధాన మార్కెట్ అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది.
నేపాల్ ప్లాంట్ నుంచి విడుదలైన హ్యుందాయ్ వెన్యూ విషయానికి వస్తే.. ప్రపంచ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మరియు పొందిన కంపెనీ కార్లలో వెన్యూ చెప్పుకోదగ్గ మోడల్. భారతదేశంలో కూడా ఎక్కువ అమ్మకాలు పొందిన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ కారు మరింత గొప్ప అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








