Rolls Royce Spectre EV 530 కి.మీ రేంజ్‌తో రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ విడుదల.. ధర ఎంతంటే.??
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్(Rolls Royce) భారత్‌లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ లగ్జరీ కారు 'స్పెక్టర్'(Spectre Electric Car)ను ఈ రోజు విడుదల చేసింది. అక్టోబర్ 2022లో గ్లోబల్ మార్కెట్లో ఈ కారును సంస్థ ఆవిష్కరించింది. ఇప్పుడు భారత మార్కెట్లో రూ. 7.5 కోట్ల ధరతో (ఎక్స్-షోరూమ్) ఈ కారును సంస్థ లాంచ్ చేసింది.
కాగా భారత మార్కెట్లో రోల్స్ రాయిస్ విడుదల చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్ EV. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం స్పెక్టర్ EV అనేది టూ-డోర్ కూపే మోడల్.. ఈ కొత్త కారు ప్రస్తుత తరం రోల్స్ రాయిస్ ఫాంటమ్, కల్లినన్ SUVల మాదిరిగా స్థిరమైన 'ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ'(Architecture Of Luxury) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా నిర్మించింది.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ విషయానికొస్తే ఇందులో శక్తివంతమైన 102 kWh లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఇందులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ 430 kW 577 hp శక్తిని మరియు 900 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని సంస్థ తెలిపింది. పూర్తి ఛార్జింగ్‌పై 530 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. స్పెక్టర్ ఈవీ 4.4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఇక రోల్స్ రాయిస్ స్పెక్టర్ EV డిజైన్ విషయానికొస్తే ఇందులో స్పెక్టర్ స్టాండర్డ్ మోడల్‌లో మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంటుంది. కాగా ఇతర రోల్స్ రాయిస్ కార్ల కంటే పెద్దదిగా కనిపించేలా ఇందులో పెద్ద ఫ్రంట్ గిల్‌ను చూడవచ్చు. అయితే ఈ గ్రిల్ LED ఇల్యూమినేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.
కొత్త రోల్స్ రాయిస్ Spectre EV లో 23-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో కారుకు అదనపు లుక్‌ను జోడిస్తుంది. ఇందులోని వర్టికల్ టెయిల్ లైట్ ఎలిమెంట్స్ కస్టమర్లను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. ఇంకా స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, LED లైటింగ్‌తో కూడిన సిగ్నేచర్ పాంథియోన్ గ్రిల్ ఆకట్టుకుంటుంది. స్లోపింగ్ రూఫ్, వర్టికల్ LED టెయిల్ లైట్లతో ఎక్స్‌టీరియర్ ఎలిగెంట్ లుక్‌ను కలిగి ఉంది.
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే స్పెక్టర్ EV క్యాబిన్‌ను విశాలంగా అధునాతన ఫీచర్లతో రూపొందించారు. లోపలి భాగంలో డోర్ ప్యాడ్‌లపై స్టార్‌లైట్ లైనర్ ద్వారా క్యాబిన్ లగ్జరీ లుక్‌ను కలిగి ఉంది. ప్యాసింజర్ సైడ్ డ్యాష్‌బోర్డ్ ప్యానెల్‌లో ప్రకాశవంతమైన 'స్పెక్టర్' నేమ్ ప్యానెల్‌ను చూడవచ్చు. అయితే ఇది కారు ఆన్ అయినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి సూపర్ ఫీచర్లు ఇంకా చాలా ఉన్నాయి.
ఇక రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీలో 'స్పిరిట్' సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడంతో.. దీనిని పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో నిర్మించారు. ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణీకుల కోసం ప్రత్యేక డిస్‌ప్లే స్క్రీన్‌ని పొందుపరిచారు. కారు ఎక్కేటప్పుడు డిజిటల్ డిస్‌ప్లే కస్టమర్లకు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.
ఈ డిజిటల్ డిస్‌ప్లే మీరు కారు ఎక్కగానే పర్సనల్‌గా వెల్‌కమ్ యానిమేషన్‌ను ప్రదర్శిస్తుంది. ఈ ఫీచర్ ద్వారానే ఈ కారు క్యాబిన్ ఎంత విలాసంగా, హై టెక్నాలజీతో రూపొందించారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా మీకు ఇష్టమైన కలర్ థీమ్‌ను ఎంచుకుని కారు క్యాబిన్‌ను మీరు కలర్‌ఫుల్‌గా మార్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications








