120 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యం!.. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ప్రిజం - వివరాలు

గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను లాంచ్ చేసే 'రోల్స్ రాయిస్' కంపెనీ ఎట్టకేలకు మరో కొత్త కారును ఆవిష్కరించింది. రోల్స్ రాయిస్ కొత్త కారు 'ఘోస్ట్ ప్రిజం'. ఇది పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలు మీ కోసం..

ప్రపంచ మార్కెట్లో ఖరీదైన కారు అనగానే గుర్తొచ్చే రోల్స్ రాయిస్ (Rolls Royce) ఆవిష్కరించిన కొత్త కారు ఘోస్ట్ ప్రిజం (Ghost Prism) కేవలం 120 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే కంపెనీ ఈ కారును కేవలం 120 మంది కస్టమర్లకు మాత్రమే విక్రయిస్తుంది. కంపెనీ ఈ ఏడాది బ్రాండ్ యొక్క 120వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కారును ప్రవేశపెట్టింది.

Rolls-Royce Ghost Prism

120 సంవత్సరాల రోల్స్ రాయిస్ చరిత్రకు సాక్ష్యంగా కంపెనీ ఈ ఘోస్ట్ ప్రిజం కారును లాంచ్ చేసింది. ఈ కొత్త కారు దాని మునుపటి మోడళ్ల కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బంపర్ కింది భాగంలో, బ్రేక్ కాలిపర్స్ మరియు కోచ్ లైన్ దగ్గర కూడా ప్రత్యేకమైన కలర్ గమనించవచ్చు. దీనిని హ్యాండ్ పాలిష్ ప్రక్రియ ద్వారా ఫినిష్ చేయడానికి ఏకంగా 16 గంటల సమయం పట్టిందని సమాచారం.

ఘోస్ట్ ప్రిజం వెలుపల భాగం గన్‌మెటల్ మెటల్ గ్రే పెయింట్ స్కీమ్ పొందుతుంది. అయితే కొనుగోలుదారులు ఫీనిక్స్ రెడ్, మాండరిన్ లేదా ఎల్లో మరియు టర్చెస్ అనే మూడు కలర్ ఆప్షన్స్ పొందవచ్చు. వింగ్ మిర్రర్స్, గ్రిల్ మరియు బూట్ లిడ్ వంటివి స్టాండర్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫీచర్ 'బర్నౌట్' అని పిలువబడే స్మోక్డ్ బ్లక్ గ్రే కలర్ ట్విస్ట్ పొందుతుంది.

Rolls-Royce Ghost Prism Front Design

ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ వివరాలు అధికారికంగా అందుబాటులో లేనప్పటికీ.. ఇది బెస్పోక్ కలర్ ఆప్షన్స్ పొందుతుందని తెలుస్తోంది. క్యాబిన్ మొత్తం కూడా గన్ మెటల్ అండ్ వైట్ థీమ్ కలిగి ఉంటుంది. డ్యాష్‌బోర్డు, స్టీరింగ్ వీల్ మరియు సీట్ల మీద రెడ్ యాక్సెంట్స్ చూడవచ్చు. రోల్స్ రాయిస్ లోగో కూడా అదే షేడ్‌లో ఎంబోస్ చేయబడింది. క్యాబిన్ సిగ్నేచర్ స్టార్‌లైట్ హెడ్‌లైనర్‌ పొందుతుంది. ఇందులో 1040 కలర్ స్టార్స్ ఉన్నాయి.

ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ప్రిజం కారు 6.75 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 555 బీహెచ్‌పీ పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఈ కారు ధరను కంపెనీ వెల్లడించలేదు. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ధర కొంత ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.

Rolls-Royce Ghost Prism Interior

ఇదిలా ఉండగా రోల్స్ రోయ్స్ ఇటీవల 'ఆర్కాడియా డ్రాప్‌టైల్' అనే కొత్త కారును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర రూ. 209 కోట్లు. ఈ కారును సంస్థ చాలా ప్రత్యేకంగా తయారు చేసింది. రెండు డోర్స్ మరియు రెండు సీట్లు కలిగిన ఈ కారును కంపెనీ తయారు చేయడానికి ఏకంగా 8000 గంటల కంటే ఎక్కువ సమయం పట్టినట్లు సమాచారం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 14, 2024, 9:45 [IST]
English summary
Rolls royce unveiled new limited edition ghost prism
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+