సేఫ్టీలో మొనగాడి కార్లు.. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌ల్లో అన్నింటికీ 5స్టార్స్
కార్ల కొనుగోలులో ప్రజల అభిరుచులు మారిపోతున్నాయి. కొన్ని నెలల క్రితం వరకు కూడా కేవలం మైలేజీ, ఫీచర్లు, ఎక్స్‌టీరియర్ లుక్‌పై ఆసక్తి చూపించే జనాలు ఇప్పుడు కేవలం సేఫ్టీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం జనాలు ఎక్కువగా SUV (Sport Utility Vehicles)లను కొనుగోలు చేస్తున్నారు. అత్యంత సేఫెస్ట్ ఎస్‌యూవీలను అందిస్తున్న జాబితాలో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థకు చెందిన కార్లు అన్ని సేఫ్టీ టెస్ట్‌ల్లో అదరగొడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో కార్ల సేఫ్టీకి సంబంధించిన భారత్ ఎన్‌సీఏపీ (Bharat New Car Assessment Programme) సేఫ్టీ టెస్ట్‌ని నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు భారత్‌లో 8 ఎస్‌యూవీలకు క్రాష్ టెస్ట్ నిర్వహించగా.. మూడు టాటా మోడళ్లు, సిట్రోయిన్ నుంచి ఒక ఎస్‌యూవీకి సేఫ్టీ రేంటింగ్స్‌ని వెల్లడించింది. ఈ టెస్టుల్లో అడల్ట్స్, పిల్లల సేఫ్టీపై క్రాష్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి వివిధ రకాల టెస్ట్‌లను నిర్వహించి అనంతరం ఓవరాల్ సేఫ్టీ రేటింగ్‌ని అందిస్తారు. ఇక్కడ సేఫ్టీలో దుమ్మురేపిన టాప్ ఎస్‌యూవీలకు టెస్ట్ రిజల్ట్స్ మీకోసం..

టాటా పంచ్ (Tata Punch EV): టాటా పంచ్ ఈవీ భారతదేశంలో సురక్షితమైన ఎస్‌యూవీగా ఉంది. సేఫ్టీ టెస్ట్‌లో పంచ్ ఈవీ ఎస్‌యూవీ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని సాధించింది. పెద్దల సేఫ్టీలో 32 పాయింట్లకు గానూ 31.46 స్కోర్ చేసింది. అలాగే పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 45 మార్కులు సాధించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి మరెన్నో ఫీచర్లున్నాయి.
టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV): ఈ ఎస్‌యూవీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని సాధించింది. పెద్దల సేఫ్టీలో 30.81, పిల్లల సేఫ్టీలో 44.83 స్కోర్ చేసింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, కెమెరా, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఆటో-హోల్డ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ADAS టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది.

టాటా హారియర్ (Tata Harrier): ఇది పెద్దల సేఫ్టీలో 30.08, పిల్లల సేఫ్టీలో 44.54 స్కోర్‌ని సాధించింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ESC, సీట్ బెల్ట్ రిమైండర్స్, ADAS టెక్నాలజీ, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, కెమెరా ఉన్నాయి. ఈ భారీ ఎస్‌యూవీ ఎంజీ హెక్టార్, హ్యుందాయ్ క్రెటా వాటికి గట్టి పోటీని ఇస్తుంది.
టాటా సఫారీ (Tata Safari): టాటా సఫారీ హారియర్ మాదిరిగానే ఇది పెద్దల, పిల్లల సేఫ్టీలో అంతే స్కోర్‌తో 5-స్టార్ రేటింగ్‌ని సాధించింది. ఇందులో మహీంద్రా XUV700, జీప్ మెరిడియన్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇస్తుంది. ఇందులోనూ హారియర్‌లో ఉండే సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. హారియర్‌కి ప్రత్యామ్నాయంగా కస్టమర్లు దీనిని కూడా కొనుగోలు చేయవచ్చు.

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV): టాటా నెక్సాన్ ఈవీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని సాధించింది. ఇది పెద్దల సేఫ్టీలో 29.86, పిల్లల సేఫ్టీలో 44.95 స్కోర్లను సాధించింది. నెక్సా ఈవీలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ESC, రియర్ పార్కింగ్ కెమెరా, సెన్సార్లు, 360 డిగ్రీల కెమెరా, TPMS, హిల్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక సిట్రోయిన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ 4 స్టార్ రేటింగ్‌తో అదరగొట్టింది.
డ్రైవ్స్‌పార్క్ వ్యాఖ్య: భారత్ NCAP రేటింగ్స్‌లో అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీల ఉత్పత్తిలో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్, సఫారీ, నెక్సాన్ ఈవీ వంటి మోడళ్లు భారీ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇవి పిల్లలు, పెద్దల సేఫ్టీలో భారీ స్కోర్లతో నమ్మదగినవిగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








