సెకండ్‌హ్యాండ్ కార్లపై లోన్లు.. ఈ సైట్లలో కొంటే డౌన్‌పేమెంట్, వడ్డీ రేట్లు చాలా తక్కువ!
దేశంలో కొవిడ్ అనంతరం కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రతీ ఇంట్లో కారు ఉంటే ఆ రాజసం వేరేలా ఉంటుంది. ఒకప్పుడు మోటార్‌సైకిల్స్ కొన్ని ఇళ్లలో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితంలో బైక్స్ భాగం అయ్యాయి. వీటి మాదిరిగానే కార్ల అమ్మకాలు సైతం జోరందుకున్నాయి. ప్రతీ ఇంట్లో (ఫ్యామిలీ) ఓ కారు అనే కాన్సెప్ట్ వచ్చేసింది. అయితే కార్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది కొత్త కారుని కొనలేకపోతున్నారు. దీంతో సెకండ్ హ్యాండ్ కార్లవైపు చూస్తున్నారు. మార్కెట్‌లో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు చేసే ముందు కస్టమర్లకు కొన్ని అపోహాలు ఉంటాయి. వాటిపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే ఇంటికి తెచ్చుకునేందుకు డిసైడ్ అవుతున్నారు.
ప్రస్తుతం కొత్త కార్ల వలె సెకండ్ హ్యాండ్ కార్లకు (Secondhand Cars) కూడా కొన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, NBFC ఫైనాన్స్ కార్పొరేన్స్ లోన్స్ ఇస్తున్నాయి. ఈ లోన్స్ అందిస్తున్న వాటిలో యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్స్, HDFC బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా క్యాపిటల్ కంపెనీలు లోన్స్ ఇస్తున్నాయి.

వీటితో పాటు ఇతర ఫైనాన్షియల్ కంపెనీలు సెకండ్ హ్యాండ్ కార్లకు లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్‌లతో పోటీపడి లోన్స్ ఆఫర్ చేస్తుండటంతో సెకండ్ హ్యాండ్ కార్లను కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. స్పిన్ని (Spinny Car), కార్స్ 24 (Cars 24), మారుతి ట్రూ వ్యాల్యూ (Maruti True Value), ఓఎల్‌ఎక్స్ (OLX), హ్యుందాయ్ హెచ్ ప్రామిస్ (Hyundai H Promise), మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ వంటివి ఉన్నాయి.
పైన తెలిపిన మహీంద్రా, హ్యుందాయ్, మారుతి కార్లలో చాలా వరకు కొత్త కార్లు లభిస్తాయి. వీటిలో కొంతమంది కస్టమర్లు లోన్‌పై కొత్త కారును కొనుగోలు చేసి తిరిగి చెల్లించకపోవడంతో వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఫైనాన్సియల్ సంస్థ ఆ కారును స్వాధీనం చేసుకుని వేలంలో లోన్ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఆ తర్వాత దీనిని సేల్‌కి అందుబాటులో తీసుకువస్తాయి.

పాత కార్ల విషయంలో ఇదే జరుగుతుంది. కొన్నిసార్లు పాత కార్లను అమ్మేసి ఎక్స్‌ఛేంజ్‌లో భాగంగా కొత్త కార్లను కొనుగులు చేస్తారు. వీటిని కూడా కంపెనీలు అమ్మకానికి తెస్తాయి. వీటిని కూడా చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లను కొనేముందు చాలా వరకు బ్యాంక్‌లు, ఫైనాన్సియల్ సంస్థలు ఎక్కువ లోన్‌ని ఆఫర్ చేయవు. కారు వ్యాల్యూపై కేవలం 70 శాతం వరకు మాత్రమే లోన్స్ ఇస్తారు.
ఈ లోన్స్‌కి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. దీనికి అన్ని నిర్దేశించిన డాక్యుమెంట్ల ప్రకారం చెక్ చేసిన తర్వాత లోన్ అవకాశం కల్పిస్తారు. ఈ సెకండ్ హ్యాండ్ కార్లలో హ్యుందాయ్ ఐ20, టాటా నెక్సాన్, మారుతి స్విఫ్ట్, మారుతి వ్యాగన్‌ఆర్ ఎక్కువగా అమ్ముడవుతున్నట్లు తేలింది. వీటిపై ఎక్కువ ఆఫర్లను, తక్కువ వడ్డీ రేట్ ఉంటుంది. పైన తెలిపిన సర్టిఫైడ్ కంపెనీలలో మాత్రమే కార్లను కొనుగోలు చేయడం ఉత్తమం.

గమనిక: పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. ఒక వేళ మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటే కారు డెంటింగ్, కంపెనీ బ్యాడ్జింగ్‌ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సంబంధింత డాక్యుమెంట్లు, ఇన్సూరెన్స్‌పై సైన్ చేయండి. కేవలం ఎక్స్‌పర్ట్ సూచనతో మాత్రమే సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయండి.


Click it and Unblock the Notifications








