ప్రత్యేక వాహనంపై జర్నీ చేసిన శిల్పా శెట్టి.. ఈ వెహికల్‌ను చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.!!

బాలీవుడ్‌ ప్రముఖ నటి శిల్పాశెట్టి(Shilpa Shetty) ఎయిర్‌పోర్టులో తన బిడ్డతో పాటు లగేజీ క్యారియర్‌పైన కూర్చుని ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఆ లగేజీ క్యారియర్‌ ఎలక్ట్రిక్‌ది కావడం ప్రత్యేకత ఇక్కడ. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో..

బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి(Shilpa Shetty at Mumbai Airport) గురించి తెలియని వారు ఉండరు. దాదాపు 20 ఏళ్లు పైగానే తరగని అందంతో సినీ ఇండస్ట్రీలో ఫేమస్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో నటించింది. వివాహ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న శిల్పా శెట్టికి లగ్జరీ కార్లు కూడా చాలానే ఉన్నాయి.

Actress-Shilpa-Shetty-Ride-On-Electric-Luggage-Carrier

కాగా శిల్పాశెట్టి తాజాగా ముంబయి ఎయిర్‌పోర్టుకు ఫ్యామిలీతో కలిసి రావడంతో అక్కడే ఉన్న కెమెరాలు వారిని క్లిక్‌ మనిపించాయి. కాగా విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులు వస్తువులను తీసుకెళ్లడానికి లగేజీ క్యారియర్‌లను ఉపయోగిస్తారనే సంగతి మీకు తెలిసిందే.. అయితే ఇక్కడ ఈ ఎయిర్‌పోర్టులో ముంబై విమానాశ్రయం కొంత అడ్వాన్స్‌డ్‌గా ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపెల్డ్ లగేజ్ క్యారియర్‌ను అందుబాటులో ఉంచింది.

అయితే ఆ ఎలక్ట్రిక్ లగేజ్‌ క్యారియర్‌ను చూసి నటి శిల్పాశెట్టి(Shilpa Shetty On Electric Luggage Carrier) ఏమనుకుందో తెలియక వెంటనే తన బిడ్డతో కలిసి అందులో ప్రయాణించింది. ఇది గమనించిన అక్కడే ఉన్న అక్కడున్న జర్నలిస్టులు ఫొటోలు, వీడియోలు తీయడం ప్రారంభించారు. ఆ కాసేపటికి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా కూడా తన కుమార్తెతో కలిసి దానిపై కాసేపు ప్రయాణించారు.

Actress-Shilpa-Shetty-Ride-On-Electric-Luggage-Carrier

ఆ ఎలక్ట్రిక్‌ లగేజ్‌ క్యారియర్‌(Electric Luggage Carrier) పైనే వారు తమ కారు పార్క్‌ చేసి ఉన్న ప్రదేశం వరకూ ప్రయాణించారు. లగేజీ క్యారియర్ ప్రయాణం విమానాశ్రయం పార్కింగ్ స్థలంలోని వారి Mercedes-Maybach GLS 600 SUV వరకు కొనసాగింది. కారు వద్దకు చేరుకోగానే లగేజీ క్యారియర్‌ను సిబ్బందికి అప్పగించి కారులో బయలుదేరారు.

ఈ ఎలక్ట్రిక్ లగేజ్ క్యారియర్‌ను ఆపరేట్ చేయడం చాలా సులభం. ఎందుకంటే అటువంటి ఆధునిక లగేజీ క్యారియర్లు కేవలం బటన్లతో పనిచేస్తాయి. స్టీరింగ్‌ను గట్టిగా తిప్పాల్సిన అవసరం లేకుండా.. బటన్ల సాయంతో ముందుకు సాగిపోవచ్చు. అయితే సాధారణంగా ఎయిర్‌పోర్టులు కానీ రైల్వే స్టేషన్లలో కానీ వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌ ఛైర్లు అందుబాటులో ఉంటాయి.

Actress-Shilpa-Shetty-Ride-On-Electric-Luggage-Carrier

కానీ ఇలా లగేజీని క్యారీ చేయడానికి కూడా ఎలక్ట్రిక్‌ క్యారియర్‌లు అందుబాటులోకి రావడంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై కూర్చున్న శిల్పాశెట్టి దంపతులు క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. శిల్పాశెట్టి ఎలక్ట్రిక్‌ లగేజీ క్యారియర్‌పై కూర్చుని ప్రయాణించినంత సేపు చాలా జాలీగా ఉండటాన్ని చూడవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, February 12, 2024, 13:36 [IST]
English summary
Shilpa shetty ride on electric luggage carrier at mumbai airport funny video is here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+