పూర్తి డిజిటలైజేషన్ దిశగా స్కోడా ఆటో ఇండియా.. ఇక కస్టమర్లకు కార్ సెలెక్షన్ మరింత సులభం
డిజిటలైజేషన్ దిశగా ఆటోమోటివ్ రంగం దూసుకుపోతోంది. ఈ క్రమంలో భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా(Skoda Auto India) కస్టమర్లతో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు పూర్తి డిజిటలైజేషన్‌గా మారుతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కస్టమర్ల డిమాండ్లు, అవసరాలు మరింతగా నెరవేరడమే కాకుండా.. డిజిటల్ పరంగా మెరుగ్గా ఉండనుంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత్‌లోనే కూడా గ్లోబల్ మార్కెట్‌లో కూడా కార్ల తయారీలో స్కోడా ఆటో అగ్రగామిగా ఉందనడంలో సందేహం లేదు. చెక్ రిపబ్లిక్ ఆధారిత స్కోడా గత కొన్నేళ్లుగా.. భారతీయ మార్కెట్లో దూసుకుపోతుంది. స్కోడా, వోక్స్‌వ్యాగన్ సహకారంతో, సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన కుషాక్ SUVని సంస్థ 2021లో విడుదల చేసింది.

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో స్కోడా కుషాక్(Skoda Kushaq) ఒకటి. ఈ క్రమంలో స్కోడా ఆటో ఇండియా మరో కొత్త కాంపాక్ట్ SUVని త్వరలో విడుదల చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. స్కోడా తన కార్లను కొనుగోలు చేసే కస్టమర్లతో మరింతగా కనెక్ట్ అయ్యే ప్రయత్నంలో భాగంగా 360-డిగ్రీల డిజిటల్ కార్యకలాపాల(Skoda 360 Digital Activities)ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
దీని ప్రకారం, పాత మరియు కొత్త స్కోడా కస్టమర్లు డిజిటల్-క్వాలిటీ యజమాని అనుభవాన్ని పొందగలరు. ఈ మేరకు స్కోడా "నేమ్ యువర్ స్కోడా"(Name Your Skoda) అనే డిజిటల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా, స్కోడా కార్లను కలిగి ఉన్న కస్టమర్లు భారతదేశంలో ప్రారంభించబోయే స్కోడా యొక్క తదుపరి కాంపాక్ట్ SUV కోసం తమకు నచ్చిన పేర్లను సూచించవచ్చు.
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఇప్పటి వరకు దాదాపు 1.5 లక్షల పేరు సూచనలు వచ్చాయని స్కోడా సంతోషంగా వెల్లడించింది. ఇది కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్(Skoda Digital Platform)లను ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించడానికి స్కోడా మరికొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మార్చి 24న స్కోడా తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకునేలా వినియోగదారులను ప్రోత్సహించే ప్రయత్నంలో కార్ల కొనుగోలుదారులకు కొన్ని ఆఫర్లను ప్రకటించింది.
ఈ ఆఫర్లు మార్చి 24న మాత్రమే అందించబడ్డాయి. స్కోడా బ్రాండ్‌కు కస్టమర్లను చేరువ చేసే ప్రయత్నంగా ప్రకటించిన ఆఫర్‌ల ద్వారా స్కోడాకు ఒకే రోజు 709 బుకింగ్‌లు వచ్చాయి. అదే ఆనందంలో స్కోడా కూడా 'స్కోడా ఫర్ ఆల్'(Skoda For All) అనే పథకాన్ని అమలు చేసింది. ఇది సభ్యత్వ కార్యక్రమంగా సంస్థ పేర్కొంది.
ఆటోమొబైల్స్ పట్ల మక్కువ ఉన్న వ్యక్తులను ఒక సమూహంగా ఏకం చేసే ప్రయత్నంలో స్కోడా ఈ కార్యక్రమాన్ని అమలు తీసుకువచ్చింది. దీని ద్వారా ఈ గ్రూప్ సభ్యులు స్కోడా ఈవెంట్‌లలో VIP హోదా మరియు కార్ & సర్వీస్‌ను పొందుతున్నప్పుడు ప్రత్యేక ఆఫర్‌లను పొందాలని సంస్థ ప్లాన్ చేస్తోంది.
దీంతో పాటు 'స్కోడా ఫర్ ఆల్'(Skoda For All) మిషన్‌లో భాగమైన సభ్యులకు కొత్త కార్లు మరియు ఆవిష్కరణలపై ముందస్తు అప్‌డేట్లను అందించాలని స్కోడా నిర్ణయించింది. అదే విధంగా, కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో, స్కోడా ఆటో 2023లో భారతదేశంలో 'ది సర్వీస్ క్యామ్(The Service Cam)' అనే ఫోన్ ఆధారిత యాప్‌ను ప్రారంభించింది.
స్కోడా తీసుకువచ్చిన ఈ మొబిలిటీలో భాగంగా.. స్కోడా వెబ్‌సైట్ మాత్రమే కాకుండా షోరూమ్‌లు కూడా పూర్తిగా డిజిటల్‌గా మారుతాయి. కొత్త స్కోడా కారును కొనుగోలు చేసేందుకు వచ్చే కస్టమర్లు షోరూమ్‌లోని టేబుల్స్‌పై ఉన్న స్క్రీన్‌ల ద్వారా తమకు ఇష్టమైన కారును ఎంచుకోవచ్చు. భారత్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి కార్ల కంపెనీగా స్కోడా గుర్తింపు పొందింది.


Click it and Unblock the Notifications








