హైబ్రిడ్ ఇంజిన్, అదరిపోయే ఫీచర్లతో ప్రముఖ స్కోడా ఆక్టావియా రివీల్.. ప్రత్యేకతలెన్నో.!!
భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తన ప్రముఖ సెడాన్.. ఆక్టోవియా(Skoda Octavia Facelift) ను సరికొత్త అప్‌డేట్లతో త్వరలో తీసుకురానుంది. ఈ మేరకు Octavia Sedan ను తాజాగా ఆవిష్కరించింది. హైటెక్ ఫీచర్లతో పాటు స్టెబిలిటీ, ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ పరంగా ఇందులో భారీ అప్‌డేట్లను చేసింది.
దేశంలో స్కోడా ఆక్టావియాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సెడాన్ అందుబాటులో ఉన్నప్పుడు దాదాపు లక్ష యూనిట్లకు పైగా కార్లను విక్రయించింది. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన కర్బన ఉద్గార నిబంధనల కారణంగా.. కొన్నేళ్ల క్రితం స్కోడా ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ఆక్టావియాను పరిచయం చేసింది.

2024 ఫేస్‌లిఫ్టెడ్ ఆక్టావియా స్కోడా.. తన లైనప్‌లో ప్రత్యేకించి రీఫ్రెష్డ్ డిజైన్‌తో వస్తోంది. రీ డిజైన్ చేయబడిన సిగ్నేచర్ రేడియేటర్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ LED DRLలతో పాటు మ్యాట్రిక్స్ టెక్నాలజీతో కూడిన కొత్త జత LED హెడ్‌ల్యాంప్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక వైపున, కొత్త బంపర్‌తో పూర్తిగా కొత్త LED టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. షార్ప్ కట్‌లు మరియు క్రీజ్‌లను కలిగి ఉండటంతో పాటు.. 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
ఇంటీరియర్ పరంగా 2024 స్కోడా ఆక్టావియాలో మొబైల్ కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, USB టైప్-సి ఛార్జర్ మరియు కీలెస్ ఎంట్రీ/ఎగ్జిట్‌తో కూడిన 13-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. క్యాబిన్‌ను ఆకర్షణీయంగా రూపొందించింది. డ్యూయల్-టోన్ బ్లాక్-బ్రౌన్ ఇంటీరియర్ థీమ్, రియర్ విండో బ్లైండ్‌లు, ఎర్గోనామిక్ సీట్లు మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లతో వస్తుంది.

కొత్త స్కోడా ఆక్టావియా సెడాన్ పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. ఇది 6 పెట్రోల్ మరియు 2 డీజిల్ పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులోకి రానుంది. ఇందులో 1.5-లీటర్ NA పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 2.0-లీటర్ NA పెట్రోల్, 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. వీటితో పాటు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ మిల్లు ఉన్నాయి.
అంతే కాకుండా స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్.. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది రెండు కాన్ఫిగరేషన్‌లలో లభ్యం కానుంది. కానీ ఇది భారత మార్కెట్లోకి విడుదల కాదని సమాచారం. ఈ కొత్త సెడాన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ ద్వారా జతచేయబడి ఉంటాయి.

కాగా భారత మార్కెట్లో ప్రస్తుతం స్కోడా 3 మోడళ్లను విక్రయిస్తోంది. స్కోడా స్లావియా(Skoda Slavia) సెడాన్, కుషాక్(Kushaq) మిడ్ సైజ్ SUV, మూడవది కోడియాక్(Kodiaq) SUV. కాగా స్కోడా నుంచి ఈ ఏడాది చివరి నాటికి ఎన్యాక్ iV(Enyaq iV) ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసే యోచనలో ఉంది. త్వరలో మరో కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా విడుదల చేసేందుకు స్కోడా ఆటో ఇండియా సిద్ధంగా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








