డిస్కౌంట్స్ జాతర.. స్కోడా కార్లపై భారీ తగ్గింపు - పూర్తి వివరాలు

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందులో కుషాక్ మరియు స్లావియా ఉన్నాయి. ఈ కార్లపై లభించే డిస్కౌంట్స్ గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

స్కోడా కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్లలో క్యాష్ డిస్కౌంట్స్ మాత్రమే కాకుండా.. కాంప్లిమెంటరీ 3 ఇయర్స్ లేదా 45000 కిమీ మెయింటెనెన్స్ ప్యాకేజీ మరియు ఎక్స్‌టెండెడ్ వారంటీ (5 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్లు) లభిస్తుంది. అయితే స్కోడా సూపర్బ్ మరియు కొడియాక్ 7 సీటర్ వంటి కార్ల మీద ఎటువంటి డిస్కౌంట్స్ అందుబాటులో లేదు. కస్టమర్లకు ఈ విషయాన్ని గుర్తించాలి.

Skoda Kushaq Elegance Edition

స్కోడా కుషాక్

భారతదేశంలో స్కోడా కంపెనీ యొక్క అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ కుషాక్. ఈ కారు కొనుగోలుపైన ఈ నెలలో రూ. 2.5 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ SUV ధర మార్కెట్లో రూ. 11.99 లక్షల నుంచి రూ. 20.49 లక్షల మధ్య ఉంటుంది. దేశీయ విఫణిలో అందుబాటులో ఉన్న కుషాక్ నాలుగు పవర్‌ట్రైన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి మాన్యువల్, ఆటోమాటిక్ ఎంపికలు ఉన్నాయి.

ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న స్కోడా కుషాక్ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది మంచి పనితీరును అందించడానికి ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇవి రెండూ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తాయి. కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్ ఈ నెల చివరి వరకు మాత్రమే లభిస్తుంది.

Skoda Slavia Style Edition

స్కోడా స్లావియా

స్లావియా సెడాన్ కొనుగోలుపైనా కూడా స్కోడా భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ కారు కొనుగోలుపైన ఈ నెలలో రూ. 1.5 లక్షల వరకు తగ్గింపులను అందిస్తుంది. దీని ధర మార్కెట్లో రూ. 11.63 లక్షల నుంచి రూ. 19.12 లక్షల మధ్య ఉంది. మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ సెడాన్ కుషాక్ మాదిరిగానే నాలుగు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది.

విడుదలకు సిద్దమవుతున్న స్లావియా & కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లు

ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందుతున్న స్లావియా & కుషాక్ రెండూ కూడా ఫేస్‌లిఫ్ట్‌ల రూపంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ ఈ రెండు కార్లను మ్యాట్ మరియు ఎలిగాన్స్ అనే ఎడిషన్ల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంచింది. అంతే కాకుండా స్లావియా స్టైల్ ఎడిషన్ కూడా ఇటీవలే లాంచ్ చేసింది. కాగా ఫేస్‌లిఫ్ట్‌లు కూడా త్వరలోనే లాంచ్ కావడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

దేశీయ మార్కెట్లో స్కోడా స్లావియా మరియు కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లు ఎప్పుడు లాంచ్ అవుతాయని అనేదానికికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ రెండు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతాయని భావిస్తున్నాము. అంతే కాకుండా స్కోడా ఆక్టావియా కూడా తిరిగి మార్కెట్లో లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

గమనిక: స్కోడా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లభిస్తాయి. కాబట్టి స్కోడా కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఖచ్చితమైన తగ్గింపులు గురించి తెలుసుకోవడానికి సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించండి. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 14, 2024, 15:17 [IST]
English summary
Skoda discounts on slavia and kushaq in 2024 may
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+