ఈ కారు కొనుగోలుపై రూ.2 లక్షలు తగ్గింపు - వివరాలు ఇక్కడ చూడండి
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ 'స్కోడా' తన కొడియాక్ కారు మీద భారీ తగ్గింపు ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఎంత డిస్కౌంట్, ఏ వేరియంట్ మీద ప్రకటించిందనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
స్కోడా యొక్క 7 సీటర్ కొడియాక్ SUVని స్టైల్, స్పోర్ట్‌లైన్ మరియు ఎల్&కే అనే మూడు ట్రిమ్‌లలో అందించేది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ కారును కేవలం టాప్ స్పెక్ వేరియంట్లో మాత్రమే అందిస్తోంది. ఈ వేరియంట్ ధరలను కూడా భారీగా తగ్గించింది. దీంతో స్కోడా కొడియాక్ ఎల్&కే వేరియంట్‌ను ఇప్పుడు ఏకంగా రూ. 2 లక్షల తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.

స్కోడా కొడియాక్ ఎల్&కే వేరియంట్ ధర రూ. 41.99 లక్షలు. కానీ కంపెనీ అందిస్తున్న రూ. 2 లక్షల తగ్గింపు వల్ల ఈ ధర రూ. 39.99 లక్షలకు చేరింది. కంపెనీ ఈ కారు యొక్క ధరలను మాత్రమే తగ్గించింది. అయితే కారు డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి ఇది మునుపటి అదే డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.
స్కోడా కొడియాక్ అదే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 190 హార్స్ పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడుతుంది. పవర్ డెలివరీ నాలుగు చక్రాలకు జరుగుతుంది. కొడియాక్ SUV ఇప్పుడు భారతదేశంలో ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా ఉంది.

దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్, హ్యుందాయ్ టక్సన్ మరియు ఎంజీ గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) మంచి డిజైన్ కలిగి.. వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ అందిస్తోంది. ఇంజిన్ పర్ఫామెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంగా కొడియాక్ కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతోంది.
స్కోడా కంపెనీ ఎప్పటికప్పుడు తన పరిధిని విస్తరించడంతో భాగంగా.. కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూ ఉంది. కంపెనీ ప్రస్తుతం హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మరియు టాటా నెక్సాన్ కార్లతో పాటు కొత్త కాంపాక్ట్ SUVలను పరిచయం చేసేపనిలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల సబ్-4 మీటర్ కూడా టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలిసింది. ఈ కారుకు సంబంధించి కంపెనీ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.

రాబోయే స్కోడా సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV 1.0 లీటర్ త్రి సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా కుషాక్ మాదిరిగానే MQB-A0-IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారవుతోంది. దీని ధర రూ. 9 లక్షల నుంచి రూ. 14 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని సమాచారం.
స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేయనున్న కొత్త సబ్ 4 కాంపాక్ట్ SUV పేరును వెల్లడించలేదు. అయితే ఇది 2025 నాటికి మార్కెట్లో విక్రయానికి రానున్నట్లు సమాచారం. ఈ SUV కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా సౌత్ అమెరిక, సౌత్ ఈస్ట్ ఆసియా మరియు ఆఫ్రికా మార్కెట్లకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








