ఆన్ పేపర్ కంటే ఎక్కువ మైలేజీ ఈ కారు త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాబోతుంది..
స్కోడా కుషాక్ భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన కార్లలో ఒకటిగా ఉంది. ఇది మంచి మైలేజీని కూడా అందిస్తుంది. సేఫ్టీ, బెస్ట్ ఫీచర్లు, మంచి డిజైన్‌తో కస్టమర్లను ఈ కారు సంస్థ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అధికంగా సేల్ అవుతున్న కార్లలో స్కొడా కార్లు కూడా ఉన్నాయి. స్కోడాలో కూషాక్ మంచి బ్రాండ్ వాల్యూని కలిగి ఉంది. ముఖ్యంగా మైలేజీలో ఈ కారు సూపర్‌హిట్ అని చెప్పవచ్చు. ఇటీవల ఓ కారు వినియోగదారుడు ఈ మోడల్‌కి సంబంధించి సంస్థ చెప్పిన ఆన్ పేపర్ సంఖ్య కంటే ఎక్కువ మైలేజీని అందిస్తోందని వెల్లడించాడు. దీంతో ఈ ట్వీట్ ఆటోమోబైల్ మార్కెట్‌లో వైరల్ అయ్యింది. ఈ కారులో అధునాత ఫీచర్లతో 5-స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది.

ARAI (Automotive Research Association of India) ప్రకారం స్కోడా కుషాక్ గరిష్టంగా లీటరుకు 15.78 కిలోమీటర్ల నుండి 19.76 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. స్కోడా కుషాక్ 1.0-లీటర్ TSI మోటార్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లీటరుకు గరిష్టంగా 20.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని పేర్కొంది.
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్: ఈ కారు మోడల్ అప్‌డేటెడ్ వెర్షన్‌పై ఇప్పుడు భారతీయ మార్కెట్‌లో అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారతీయ మార్కెట్‌ని తాకనుంది. దీనిపై ఆటోమోబైల్ రంగం వేయి కళ్లతో ఎదురుచూస్తుంది. ఈ స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ 2024 చివరి భాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విడుదలకు ముందే ఈ కారు రికార్డులను తిరగరాయనుంది.
స్కోడా కుషాక్ కారుని భారత్‌లో జూన్ 2021లో లాంచ్ చేశారు. సాధారణంగా ఏదైనా కారుని అప్డేటెడ్ వెర్షన్ అమ్మకానికి వచ్చిన తరువాత ఆ తర్వాతి మూడు సంవత్సరాలలో అమ్మకానికి వస్తుంది. ఈ లెక్కన స్కోడా కుషాక్ యొక్క అప్ డేటెడ్ వెర్షన్ కూడా 2024 చివరి నాటికి అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.
ఈ కారు పూర్తి అప్‌డేట్ చేయబడిన ఫీచర్లతో రానున్నాయి. గ్రిల్ మరియు బంపర్‌లలో మార్పులను చూడవచ్చు. అలాగే, అప్ డేట్ చేసిన కుషాక్‌లో అధునాతన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్‌తో ఈ కారు అందుబాటులోకి రానుంది.
ఇంకా స్కోడా పనోరమిక్ సన్ రూఫ్‌తో పాటు ఏడీఏఎస్, హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉండనుంది. అయితే దీనిపై స్కోడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి, స్కోడా కుషాక్‌లో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 10-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
ఇవే కాకుండా వెంటిలేటెడ్ సీట్లు, వైర్ లెస్ ఛార్జర్, ఆరు ఎయిర్ బ్యాగులు, ABS తో కూడిన EBD మరియు డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇంజిన్ విషయానికొస్తే ఇది కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే అందిస్తున్నారు. రెండూ పెట్రోల్ మోటార్లలో అందుబాటులో ఉన్నాయి. అవి 1.0-లీటర్, 3-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5-లీటర్, 4-సిలిండర్, టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌లుగా ఉన్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








