ఈ 5 స్టార్ రేటింగ్ కారులో అదిరిపోయే ఫీచర్లు.. లాంగ్ జర్నీకి ది బెస్ట్ ఆప్షన్
స్కోడా కుషాక్ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. అందుకే కుషాక్ కారుని కొనేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారు మొదటిసారిగా జూన్ 2021లో భారతదేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి పాజిటీవ్ రెస్పాన్స్‌తో అమ్మకాల్లో దూసుకుపోతుంది. భారత మార్కెట్‌లో తమ మార్క్ బ్రాండ్‌ని బలోపేతం చేసేందుకు ఈ కారుని మార్కెట్‌లో విడుదల చేసింది. MQB-A0-IN అనే ప్లాట్‌ఫామ్‌పై రూపొందించబడింది. ఈ కుషాక్ కారు డిజైన్, కంఫర్ట్, అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వస్తుంది. జనాలు ఎక్కువగా కొనడానికి గల కారణాలు మరియు దాని ఫర్ఫామెన్స్ ఇతర టాప్ క్లాస్ ఫీచర్ల వివరాలు మీకోసం..
ముందుగా దీని ఇంజిన్ విషయానికి వస్తే కుషాక్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.0-లీటర్ TSI ఇంజిన్ 115PS శక్తిని మరియు 178NM టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.5-లీటర్ TSI ఇంజిన్ 150PS శక్తిని మరియు 250NM టార్క్‌ని విడుదల చేస్తుంది. రెండు ఇంజిన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

1.0-లీటర్ TSI ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. 1.5-లీటర్ TSI ఇంజిన్ 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఈ ఆప్షన్‌లు భారతదేశంలోని ఢిపరెంట్ డ్రైవింగ్ పరిస్థితులకు తగినట్లుగా రూపొందించబడింది. కంఫర్ట్‌తో పాటు ఈ కారులోని ఇంటీరియర్ ఫీచర్లు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయి. ఈ కారులోని టాప్‌క్లాస్ ఫీచర్లు ఉన్నాయి.
స్కోడా కుషాక్ కారు లోపల ఆధునిక డిజైన్‌ని కలిగి ఉంది. కారు క్యాబిన్‌లో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ద్వారా ఈ సిస్టమ్ ద్వారా సులభంగా స్మార్ట్ ఫోన్ కనెక్షన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్లతో ఈ కారు మరింత స్మార్ట్‌గా ఉంటుంది. కారు ఇంటీరియర్‌లో ముందు సీట్లను వెంటిలేటెడ్ సీట్లుగా అందించారు.
మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి, సుదూర ప్రయాణాలకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. స్కోడా కుషాక్‌లో వివిధ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి. ఈ కారులో హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ కూడా ఉన్నాయి.
ఈ కారు బాడీ పరంగా చూస్తే ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పటిష్టమైన బాడీ సిస్టమ్‌తో సంస్థ నిర్మించబడింది. వివిధ రకాల డ్రైవ్ మోడ్‌లలోనూ ప్రయాణీకుల భద్రతను మరింత పటిష్టం చేస్తుంది. అందుకే ఇది భారతదేశంలో సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. మంచి సేఫ్టీతో పాటు అధునాతన స్మార్ట్ ఫీచర్ల కోసం ఈ కారుని కొనుగోలు చేసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
కుషాక్‌లోని ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్‌ని ప్రయాణీకులు స్కోడా యొక్క 'మై స్కోడా కనెక్ట్' యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది లైవ్ వెహికల్ ట్రాకింగ్ మరియు ట్రిప్ అనాలిసిస్ వంటి ఫీచర్లను అందిస్తుంది. అంతేకాకుండా ఈ కారులో కంప్యూటర్ వైర్‌లెస్ ఛార్జింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఈ కారులో ప్రీమియం ఆడియో సిస్టమ్ కూడా ఉంది, ఇది మెరుగైన సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ కారు డ్రైవింగ్‌లో మంచి వినోదాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా లాంగ్ జర్నీలో మీ బోరింగ్ జర్నీని కాస్త ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌గా మారుస్తుంది. స్కోడా కుషాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పనితీరు, సేఫ్టీ మరియు కనెక్టివిటీ వంటి వివిధ అంశాలతో ఫుల్-ప్యాక్డ్ కారుగా వస్తుంది. ఈ కారు ఖచ్చితంగా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications








