బంపర్ ఆఫర్.. ఈ 5 స్టార్ రేటింగ్ కారుపై 2.5 లక్షల వరకు డిస్కౌంట్
దేశంలో స్కోడా కార్ల వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే కార్లు సేఫ్టీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందువల్ల స్కోడా భారత్‌లో తన మార్కెట్‌ను వేగంగా విస్తరించుకుంటుంది. ఆ కంపెనీ నుంచి పేరొందిన కారుకి సంబంధించిన సేల్స్ వివరాలు మీకోసం..
స్కోడా నుంచి అందుబాటులో ఉన్న స్కోడా కుషాక్ మిడ్-ఎస్‌యూవీకి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. స్కోడా కుషాక్ కూడా భారతీయ మార్కెట్‌లో ప్రసిద్ధి చెందిన SUVలలో ఒకటిగా పేరొందింది. అయితే గత నెలలో ఈ కారు సేల్స్ తగ్గుముఖం పట్టాయి. ఈ కారు సేల్స్ క్షీణించిపోవడానికి గల కారణాలు పక్కన పెడితే ఆ కారులో ఉన్న ఫీచర్లు, సేఫ్టీ ఎక్కువే అని చెప్పవచ్చు.

గత నెల (ఏప్రిల్) 2024 నెలలో, స్కోడా కుషాక్ 1,159 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గతం ఏడాది ఏప్రిల్ 2023 నెలలో 2,162 కుషాక్ యూనిట్లు అమ్ముడయ్యాయి. గత నెల అమ్మకాలతో పోలిస్తే ఇది ఏడాది సేల్స్ భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఇక మార్చి 2024 నెలలో 1,293 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. గత నెల విక్రయాలతో పోలిస్తే నెలవారీ విక్రయాల్లో క్షీణత నమోదైంది.
డిస్కౌంట్: స్కోడా కుషాక్ కారుపై మే నెలలో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ కారులోని అన్ని వేరియంట్‌లపై రూ. 2.50 లక్షల వరకు తగ్గింపును సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఈ SUV ధర రూ. 14.12 నుండి రూ. 24.11 లక్షల మధ్య ఉంది (ముంబయిలో ఆన్-రోడ్ ధర). 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని కలిగి ఉంది.

మైలేజీ: స్కోడా కుషాక్ ARAI ప్రకారం 15.78km/l నుంచి 19.76km/l వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసిన 1.0-లీటర్ TSI ఇంజిన్ 20.7km/l మైలేజీని సాధించినట్లు ఓ వినియోగదారుడు తాజాగా వెల్లడించారు. ఈ 1.0-లీటర్, 3-సిలిండర్ ఇంజిన్, ఇది 115 bhp శక్తిని మరియు 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫీచర్లు: ఈ SUVలో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మిర్రర్ లింక్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక టెక్నాలజీ ఫీచర్లతో లభిస్తుంది. అదనపు ఫీచర్లలో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇంకా మరెన్నో అదనపు ఫీచర్లను ఈ కారులో పొందవచ్చు.

స్కోడా నుంచి వచ్చిన కార్లల్లో కుషాక్‌లో ప్రీమియం ఫీచర్లతో పాటు అధిక మైలేజీని అందించే మోడల్‌గా ఉంది. అలాగే ఈ కారులో అధునాతన భద్రతా ఫీచర్లు ప్రయాణికులకు మంచి బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని కలిగించనున్నాయి. ఈ కారులోని వేరియంట్‌లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి.
అలాగే భద్రత పరంగా, స్కోడా కుషాక్ ఉత్తమ SUV, ఇది ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), రియర్ వ్యూ కెమెరాలను పొందుతుంది. స్కోడా కుషాక్ మోడల్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUVలతో పోటీపడుతుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








