రూ.7.89 లక్షలకే స్కోడా కొత్త కారు.. 3 ఏళ్లు ఉచిత మెయింటనెన్స్.. మిడిల్ క్లాస్ వారికి మంచి అవకాశం..
దిగ్గజ కంపెనీ స్కోడా ఇండియా(Skoda India) భారత వినియోగదారుల కోసం కొత్తగా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కైలాక్( Kylaq) కారును తాజాగా తీసుకొచ్చింది. ఈ మోడల్ రాకతో ఆటోమొబైల్ రంగంలో స్కోడాకు ఇతర కంపెనీల మధ్య గట్టి పోటీ నడవనుంది. గతంలో కైలాక్‌ను తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించి, దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా, దీని డీజైన్‌కు చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. ఈ కారు ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఎదురు చూసిన వారికి ఇప్పుడు స్కోడా శుభవార్త చెప్పింది. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌లను ప్రారంభించింది. ఇదే సమయంలో కంపెనీ ధరలను కూడా వెల్లడించింది. వేరియంట్లను బట్టి ధరలు వేరు వేరుగా ఉన్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన వేరియంట్‌ను డిసెంబర్ 2న సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు.
స్కోడా కైలాక్ ప్రారంభ ధర రూ. 7.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ ధర రూ. 14.40 లక్షల వరకు ఉంది. కైలాక్ ముఖ్యంగా క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్+, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభిస్తున్నాయి. ఈ కారులో అన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వేరియంట్ల వారీగా ధరలను ఒకసారి పరిశీలిద్దాం.

స్కోడా కైలాక్ ప్రారంభ వేరియంట్ క్లాసిక్ ధర రూ.7.89 లక్షలుగా ఉంది. సిగ్నేచర్ మాన్యువల్ గేర్‌బాక్స్ ధర రూ.9.59 లక్షలు, అదే ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.10.59 లక్షలు, సిగ్నేచర్+ మాన్యువల్ ధర రూ.11.40 లక్షలు, సిగ్నేచర్+ ఆటోమేటిక్ ధర రూ.12.40 లక్షలు, టాప్ వేరియంట్ ప్రెస్టీజ్ మాన్యువల్ ధర రూ.13.35 లక్షలు, ప్రెస్టీజ్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.14.40 లక్షలుగా ఉంది.
వీటి బుకింగ్‌లు సోమవారం నుంచి మొదలు కాగా, కస్టమర్లకు డెలివరీలు మాత్రం కొత్త ఏడాది(2025) జనవరి నుంచి ప్రారంభమవుతాయి. కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా స్కోడా బడ్జెట్ ధరలోనే ఈ కారును తీసుకొచ్చింది. అలాగే కంపెనీ వినియోగదారుల కోసం ఒక ఆఫర్‌ను సైతం అందిస్తుంది. కారును బుక్ చేసుకున్న మొదటి 33,333 కస్టమర్లకు 3 సంవత్సరాల మెయింటెనెన్స్ ప్యాకేజీని ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది.

తాజాగా వచ్చిన అనధికార సమాచారం ప్రకారం స్కోడా కైలాక్‌పై దాదాపు 1.60 లక్షల మందికి పైగా ఆసక్తి చూపించినట్లు తెలుస్తుంది. ఈ కారు బ్రిలియంట్ సిల్వర్, టోర్నాడో రెడ్, క్యాండీ వైట్, లావా బ్లూ, కార్బన్ స్టీల్, డీప్ బ్లాక్, ఆలివ్ గోల్డ్ అనే ఏడు కలర్స్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. కైలాక్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది 115hp పవర్, 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. కారు డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ముందు స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు వంటివి ఉన్నాయి. కారు లోపల అధునాతన ఫీచర్లను స్కోడా అందించింది. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ వీల్, మెరుగైన AC వెంటిలేషన్ సీట్లు వంటివి ఉన్నాయి.

ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇంకా చుట్టు ప్రక్కల చూడటానికి 360 డిగ్రీల కెమెరా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఆటోమేటిక్ స్పీడ్ సెన్సిటివ్ సెంట్రల్ లాకింగ్ , డ్రైవర్ కోసం డెడ్ పెడల్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ వంటి మరిన్ని భద్రతా ఫీచర్లు స్కోడా కైలాక్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








