తక్కువ ధరలో స్కోడా కారు రాబోతుంది.. సన్‌రూఫ్‌, ఇతర డిజైన్‌లు చూశారా?

దేశంలో స్కోడా కార్లకు మంచి డిమాండ్‌ ఉంది. ఆ కంపెనీ నుంచి విడుదల అయ్యే కార్లు ఎక్కువగా సేఫ్టీని అందిస్తాయి. దీంతో వీటిని కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఆ కంపెనీ నుంచి స్కోడా స్లేవియా, కొడియాక్‌, కుషాక్‌ ఇంకా మరెన్నో కార్లు భారత్‌లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. జర్మనీకి చెందిన ఈ కార్లు టాప్‌ 10 లో ఉంటాయి. ఇన్నోవేటివ్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో కంపెనీ భారత మార్కెట్లో పలు కార్లను విక్రయిస్తోంది. వినియోగదారులు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కంపెనీ రాబోయే కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరును కూడా ప్రకటించింది. దీనికి కైలక్ (Kylaq) అని పేరు పెట్టింది. దీని టెస్ట్‌డ్రైవ్‌ చేస్తుండగా కనిపించింది. దీనికి సంబంధించిన వివరాలు మీ కోసం..

కొద్ది రోజుల క్రితం కొత్త స్కోడా కైలాక్ కారు టెస్ట్‌డ్రైవ్‌ చేశారు. దాని స్పై ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఆ చిత్రాల ప్రకారం ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన టీజర్ ఫోటోలలో కొత్త స్కోడా కైలాక్ స్ప్లిట్ హెడ్ లైట్లు, LED DRLs, ఎల్-ఆకారంలోని అల్లాయ్ వీల్స్ మాదిరిగానే LED టెయిల్లైట్లను కలిగి ఉంటుందని ధృవీకరించాయి.

Skoda Kylaq Car Spotted in Testing

ఈ కారు 1-లీటర్ TSi టర్బో పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 115ps గరిష్ట శక్తిని 178 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో 5 మంది వరకు ప్రయాణించవచ్చు. కొత్త స్కోడా కైలాక్ ఎస్‌యూవీ అత్యాధునిక ఫీచర్లతో రానుంది.

ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 360-డిగ్రీల కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు 2025 ఫిబ్రవరిలో షోరూమ్‌ల్లోకి రానుంది. ఈ కారుకు సంబంధించిన వివరాలు ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానున్నాయి.

Skoda Kylaq

2025 జనవరి రెండో వారంలో జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో అధికారిక ధరను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సరికొత్త స్కోడా కైలాక్ ఎస్‌యూవీ చాలా సరసమైన ధరలో (రూ. 8.50 లక్షలు) లభిస్తుందని భావిస్తున్నారు. ఈ కారు టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, మారుతి సుజుకి బ్రెజా, రెనాల్ట్‌ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి పోటీగా ఉంటుంది.

కొత్త స్కోడా కైలాక్‌పై కస్టమర్లు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అత్యాధునిక డిజైన్, ఫీచర్లతో కూడిన ఈ కారును చాలా మంది ఇష్టపడతారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కొత్త కైలాక్ ఎలా ఉంటుందనే దానిపై స్పష్టమైన సమాచారం ఇప్పుడు వచ్చింది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ట్విస్ట్‌లతో కంపెనీ ఆసక్తి రేపుతోంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 26, 2024, 19:52 [IST]
English summary
Skoda kylaq car spotted in testing check design and photos here
Read more on: #skoda #test drive #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+