ఎగిరి గంతేసే న్యూస్.. కేవలం రూ.7లక్షలకే స్కోడా కారు.. ఫీచర్లు తెలిస్తే మాత్రం కొనకుండా ఉండలేరు..
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం కొంచెం ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికి భారత్‌లో మాత్రం అలాంటి ధోరణి కనిపించడం లేదు. ఇక్కడి మార్కెట్‌లో వాహనాల వినియోగం భారీగా పెరుగుతుంది. దీంతో పలు కార్ల తయారీ కంపెనీలు పోటా పోటీగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. పండుగల సమయంలో చాలా కొత్త మోడళ్లు మార్కెట్‌లోకి రాగా అవన్ని సేల్స్ పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ఉన్న స్కోడా(Skoda) దేశీయ మార్కెట్‌పై ప్రధాన దృష్టిని సారించి స్కోడా కైలాక్ (Skoda Kylaq)అనే కారును లాంచ్ చేసింది. ఇది ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ(SUV).
ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ మోడల్ కూడా మెరుగైన అమ్మకాలను సాధిస్తుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. స్కోడా కైలాక్ ప్రస్తుతం సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, క్లాసిక్, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. స్కోడా కైలాక్ ధర కేవలం రూ.7.89 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది.

వేరియంట్‌ను బట్టి ధరల్లో కొన్ని మార్పులు ఉంటాయి. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన బుకింగ్‌లు డిసెంబర్ 2, 2024 నుంచి మొదలవుతాయి. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు జనవరి 27, 2025 నుండి డెలివరీ చేస్తారు. స్కోడా లవర్స్‌కు ఇది ఒక గుడ్‌న్యూస్ లాంటిది. సరికొత్త డిజైన్‌తో ఉన్న ఈ కారులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వాటి గురించి క్రింది కథనంలో వివరంగా తెలుసుకుందాం..
డిజైన్-ఫీచర్లు: దీని ఇంటీరియర్-ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా అద్బుతంగా ఉంటుంది. క్యాబిన్‌లో సిల్వర్, క్రోమ్ యాస్‌లతో ఉన్న బ్లాక్ అండ్ బుడిద రంగు గల లోపల థీమ్ అందంగా కనిపిస్తుంది. ఇంకా, 2-స్పోక్ స్టీరింగ్ వీల్, సెమీ-లెదర్ సీట్ అప్హోల్స్టరీలను అందించారు. ముందు భాగంలో ఉన్నటువంటి సీతాకోకచిలుక ఆకారపు గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

లోపల 10.1-ఇంచుల టచ్ స్క్రీన్, 8 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సింగిల్-పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైవర్‌కు మాత్రమే కాకుండా ఫ్రంట్ కూర్చున్న ప్రయాణికులకు కూడా పవర్డ్ సీట్ సర్దుబాటును అందించారు. దీనిలో ఉన్న కొన్ని ఫీచర్లు కుషాక్ మోడల్‌లో ఉన్న మాదిరిగా ఉన్నాయి.
ముందు డిజైన్‌లో స్కోడా కుషాక్‌కు ఉన్నట్లుగానే స్ప్లిట్-LED హెడ్‌లైట్, బోనెట్ లైన్ క్రింద LED DRLలు, బంపర్ పైన LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. కారు బాడీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇది ఫ్రంట్ ఫేసియా, బానెట్, ఫ్రంట్ ఎండ్ డ్యూయల్-టోన్‌ను కలిగి ఉంది. ప్రధానంగా 17-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఆకర్షణగా ఉన్నాయి.

ప్రయాణికుల భద్రత కోసం కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ అందించారు. అలాగే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఏబీఎస్ విత్ ఈబీడీ, అదనంగా పిల్లల భద్రత కోసం కూడా ప్రత్యేక ఫీచర్లను కారులో పొందుపరిచారు. బ్రేకింగ్ సిస్టమ్ కూడా అధునాతనంగా ఉంటుంది.
ఇంజిన్: దీని విషయానికి వస్తే, కుషాక్, స్లావియా వంటి కార్లలో కనిపించే 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కారులో అమర్చారు. ఇది 115 PS పవర్, 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు.
ఈ ఎస్‌యూవీ స్టార్ట్ చేసిన 10.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బుకింగ్ ప్రారంభించిన తరువాత ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని కంపెనీ అంచనా వేస్తుంది. ఇది హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








