దేశంలోనే తక్కువ మెయింటైనెన్స్ కారు.. కిలోమీటర్‌కి కేవలం 24 పైసలు మాత్రమే ఖర్చు.. ఈ ధరకు పల్లీలు కూడా రావు!
మాస్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్ నుంచి కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మాతృ సంస్థ నుంచి వస్తున్న స్కోడా కార్లు ఇటీవల ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నాయి. తక్కువ ధరలో తొలిసారిగా కైలాక్ (Skoda Kylaq)ని తీసుకువచ్చి ఫోక్స్‌వ్యాగన్ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం దేశంలో సబ్-4 మీటర్ల ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు స్కోడా ఇటీవల కైలాక్‌ని విడుదల చేసింది.
సరిగ్గా రెండు రోజుల క్రితం ఈ కారుకి సంబంధించిన ధరలను కంపనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. తక్కువ ధరలో మంచి ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలని చూస్తున్నవారికి ఇది ఫర్‌ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. అయితే ఈ కంపెనీకి చెందిన స్కోడా దాని మాతృ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ కార్లను ప్రజలు కొనడానికి కాస్త విముఖత చూపిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వీటి మెయింటైనెన్స్.

విదేశీ బ్రాండ్ కావడంతో ఈ కారు పార్ట్స్, ఇతర మెయింటైనెన్స్ చాలా ఎక్కువ అని భావిస్తూ ఉంటారు. దీంతో ఈ కంపెనీ కార్లను కొనేముందు జనాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే ఎటువంటి అపోహలు లేకుండా స్కోడా కొత్త కారును కొనుగోలు చేయవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలోనే ఇదే అత్యంత తక్కువ మెయింటైనెన్స్ కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. అయితే దీనికి ఓ మెలిక ఉంది.
కంపెనీ ముందుగా ఈ కారుని కొనుగోలు చేసే 33,333 మంది కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా 5 సంవత్సరాల వరకు కిలోమీటరుకు రూ .0.24 మెయింటైనెన్స్ మాత్రమే ఖర్చు అవుతుంది. ఇందులో 3 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీ (ముందు ఏదైతే అది వర్తిస్తుంది) పాటు స్టాండర్డ్ మెయింటెనెన్స్ ప్యాకేజీ ఉచితంగా లభిస్తుంది. ఇది మెయింటైనెన్స్‌ని భారీగా తగ్గించడానికి సహాయపడుతుంది.
| Kylaq | Manual | Automatic |
| Classic | ₹7.89 Lakh | NA |
| Signature | ₹9.59 Lakh | ₹10.59 Lakh |
| Signature Plus | ₹11.40 Lakh | ₹12.40 Lakh |
| Prestige | ₹13.35 Lakh | ₹14.40 Lakh |
ఈ స్కోడా కైలాక్ వేరియంట్లు, ధరలను ఇటీవలే ప్రకటించారు. దీని బేస్ వేరియంట్ క్లాసిక్ ధర రూ .7.89 లక్షల నుంచి ప్రారంభ అవుతుండగా.. సిగ్నేచర్ మాన్యువల్ వేరియంట్ ధర రూ .9.59 లక్షలు, సిగ్నేచర్ ఆటోమేటిక్ ధర రూ.10.59 లక్షలుగా ఉంది. అలాగే సిగ్నేచర్ ప్లస్ మాన్యువల్ ధర రూ.11.40 లక్షలు, సిగ్నేచర్ ప్లస్ ఆటోమేటిక్ ధర రూ.12.40 లక్షలుగా ఉంది.
ఇక టాప్ వేరియంట్ ప్రెస్టీజ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.13.35 లక్షలు, ప్రెస్టీజ్ ఆటోమేటిక్ ధర రూ.14.40 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. ఈ కారుని టోర్నడో రెడ్, కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్, క్యాండీ వైట్, లావా బ్లూ, డీప్ బ్లాక్, ఆలివ్ గోల్డ్ అనే ఏడు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

మార్కెట్‌లో ఉన్న ఇతర ప్రత్యర్థి కార్లతో పోల్చితే క్రేజీ డిజైన్‌ని కలిగి ఉంటుంది. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, బాక్సీ డిజైన్, ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ థీమ్, లెథెరెట్ సీట్లతో వస్తుంది. ఇక ఇంటీరియర్‌లోనే 8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, 10-9 అంగుళాల టచ్‌స్క్రీన్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకి సపోర్ట్ చేస్తుంది. కీలెస్ ఎంట్రీ, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ మోబైల్ ఛార్జర్ వంటివి కలవు.
సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్, మల్టీ-కొలిషన్ బ్రేక్స్, రోల్-ఓవర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఈ కారు 1.0-లీటర్ TSi పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఓవరాల్‌గా మెయింటైనెన్స్ చాలా తక్కువ కాబట్టి కొత్తగా కారు కొనేవారు దీనిని ట్రై చేయవచ్చు.


Click it and Unblock the Notifications








