రూ. 10 లక్షల ఆన్‌రోడ్‌ ధరతో పవర్‌ఫుల్‌ కారు.. దీనిని మిస్‌ చేసుకుంటే ఎప్పటికీ 'లక్కీ భాస్కర్‌' కాలేరు!

భారత్‌లో మంచి మార్కెట్‌ని సాధించేందుకు స్కోడా ఇండియా సరికొత్త పంథాతో కొత్త సబ్‌ 4 మీటర్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్‌ని (Skoda Kylaq) విడుదల చేసింది. ఈ విభాగంలో టాప్‌లో కొనసాగుతున్న మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. స్కోడా కార్ల ధరలుఎక్కువగా ఉండటంతో ఈ చెక్ రిపబ్లికన్ బ్రాండ్ కొత్త వ్యూహాంతో వచ్చింది. మాస్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ కేవలం రూ. 10 లక్షల లోపు పవర్‌ఫుల్‌ ఎస్‌యూని భారత్‌లో దించింది. అది కూడా ఎటువంటి నాణ్యత, సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా కైలాక్‌ని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన ఆన్‌రోడ్‌ ధరల వివరాలు ఈ కథనంలో..

ఇటీవలె ఈ కారుకి సంబంధించిన వేరియంట్లు, ధరలను పూర్తిగా స్కోడా వెల్లడించింది. ఇది క్లాసిక్‌, సిగ్నేచర్‌, సిగ్నేచర్‌ ప్లస్‌, ప్రెస్టీజ్‌ అనే వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్లను బట్టి ధరలు రూ. 7.89 నుంచి రూ.14.40 (ఎక్స్‌షోరూమ్‌) మధ్య ఉన్నాయి. దీని బేస్‌ వేరియంట్‌ని కేవలం రూ. 10 లక్షల ఆన్‌రోడ్‌ ధరతో ఇంటికి తెచ్చుకోవచ్చు. కొత్తగా కారు కొనేవారు దీనిని నిరభ్యంతరంగా ట్రై చేయవచ్చు.

Skoda Kylaq On Road Price in Hyderabad

వేరియంట్లకు తగినట్లుగానే ఫీచర్లు, కాస్మోటిక్‌ మార్పులను కంపనీ చేసింది. అయితే ఇందులోని బేస్‌ వేరియంట్‌ సైతం ఫుల్‌ ప్యాక్డ్‌ ఫీచర్లతో వస్తుంది. పైన చెప్పిన విధంగా రూ.7.89 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) ప్రారంభ ధరతో వచ్చే కారుని ఏమాత్రం ఆలోచించకుండా కొనేందుకు షోరూంకు వెళ్లవచ్చు. స్కోడా నుంచి అందుబాటులో ఉన్న ఈ చిన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆన్‌రోడ్‌ ధర హైదరాబాద్‌లో రూ.9.45 లక్షలుగా ఉంది.

ఇందులో రూ.7.89 లక్షలు ఎక్స్ షోరూమ్ ధర కాగా.. రూ.1.10 లక్షలు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కోసం సుమారు రూ.35,552, సర్వీస్ ఛార్జీలు, యాక్ససరీస్ కలిపి రూ .10,000 వరకు అవుతుంది. మొత్తం మీద ఈ కైలాక్‌ బేస్ మోడల్ ఆన్‌ రోడు ధర సుమారు రూ.9.45 లక్షల వరకు ఉంటుంది.

Kylaq Manual (On Road Price) Automatic (On Road Price)
Classic ₹9.35 Lakh NA
Signature ₹11.35 Lakh ₹12.95 Lakh
Signature Plus ₹13.93 Lakh ₹15.15 Lakh
Prestige ₹16.30 Lakh ₹17.58 Lakh

దీనిని ఈఎంఐ ఆప్షన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. మీరు లక్ష రూపాయలు డౌన్‌ పేమెంట్‌ చెల్లించి 9.60 శాతం బ్యాంక్‌ వడ్డీతో 5 సంవంత్సరాల పాటు నెలకు రూ. 17,578 ఈఎంఐ చెలిస్తే సరిపోతుంది. బ్యాంక్స్‌, ఫైనాన్సియల్‌ కంపెనీలను బట్టి వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం ఉంటుంది. వడ్డీతో కలిపి అదనంగా మీరు ఎంచుకున్న సంవత్సరాల ఆధారంగా వడ్డీ రేట్లు ఉంటాయి.

ఇక ఇందులోనే కైలాక్‌ క్లాసిక్ బేస్ మోడల్‌ని ఆలివ్ గోల్డెన్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయాలని భావిస్తే రూ .9.55 లక్షల వరకు అవుతుంది. టాప్‌ వేరియంట్‌ ప్రెస్టీజ్‌ ఆటోమేటిక్‌ మోడల్‌ ధర రూ.17.58 లక్షలుగా ఉంది. ఈ ధరలను బట్టి చూస్తే స్కోడా కైలాక్‌ ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో స్కోడా సక్సెస్‌ సాధించిందనే చెప్పవచ్చు.

Skoda Kylaq Price

ఈ కైలక్ దేశంలోనే తక్కువ మెయింటెనెన్స్‌ని కలిగి ఉంది. దీనిని కొనుగోలు చేసే మొదటి 33,333 మంది కస్టమర్లకు 5 సంవత్సరాల వరకు కిలోమీటరుకు 24 పైసలు మాత్రమే ఖర్చు కానుంది. వీరికి 3 సంవత్సరాల పాటు స్టాండర్డ్ మెయింటెనెన్స్ ప్యాకేజీ ఉచితంగా లభిస్తుంది. ఇది మెయింటైనన్స్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. కావున కారు కొనాలని భావిస్తున్న వారు దీనిని ఒకసారి దీనిని ట్రై చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, December 9, 2024, 11:39 [IST]
English summary
Skoda kylaq on road price hyderabad check all variants price list here
Read more on: #skoda #prices #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+