తక్కువ ధరలో స్కోడా కారు లాంచ్.. లగ్జరీ ఫీచర్లు, అదిరిపోయే డిజైన్.. కొత్తగా కారు కొనేవారు దీనిని ట్రై చేయండి!
భారత మార్కెట్‌లో స్కోడా ఎక్కువగా సెడాన్లకు ఉత్పత్తి చేస్తుంది. అయితే కొన్ని రోజులుగా దేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)లకు డిమాండ్ పెరుగుతుండటంతో స్కోడా ఎస్‌యూవీకి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. ఎట్టకేలకు స్కోడా కైలాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆ కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త స్కోడా కైలాక్ (Skoda Kylaq) కాంపాక్ట్ ఎస్‌యూవీని కేవలం ధర రూ .7.89 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) వద్ద విడుదల చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ స్కోడా కొత్త ఎస్‌యూవీ MQB-AO-IN ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కుషాక్, స్లావియా వంటి పాపులర్ మోడళ్లను కలిగి ఉంది.
కైలాక్ ట్రెండింగ్ స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్‌తో వస్తుంది. LED DRLs పొజీషనింగ్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ దిగువన ఉన్నాయి. స్కోడా గ్రిల్ కుషాక్‌లో ఉన్న దాని కంటే స్లిమ్‌గా ఉంటుంది. ఫ్రంట్ ఫేసియా, బానెట్, ఫ్రంట్ ఎండ్ డ్యూయల్-టోన్‌తో వస్తుంది. అల్యూమినియం-లుక్ స్పాయిలర్ లోయర్ డౌన్ కాస్త డిఫరెంట్ లుక్‌తో వస్తుంది.

దీనిలోని ఇంటీరియర్‌లో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, 8-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 అంగుళాల టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని అప్‌డేటెడ్ OS, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఫీచర్లున్నాయి. అంతే కాకుండా ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, లెథరెట్ అప్‌హోల్‌స్టరీ ఉన్నాయి.
కైలాక్ ఇతర కార్ల కంటే ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందుకేసి డ్రైవర్‌కి మాత్రమే కాకుండా ముందు ప్రయాణీకులకు కూడా పవర్డ్ సీట్ సర్దుబాటును అందిస్తుంది. మొత్తంమీద క్యాబిన్ ప్రతి విండో వద్ద బాటిల్ హోల్డర్లు, పెద్ద గ్లోవ్ బాక్స్ (కూల్), సులభంగా యాక్సెస్ చేయగల కప్ హోల్డర్లతో వస్తుంది. ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ డ్రైవర్లకు నచ్చుతుంది.

సేఫ్టీ పరంగా ఈ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. దీనిని ఇంకా క్రాష్ టెస్ట్‌కి పంపలేదు. ఇతర స్కోడా కార్ల వలె స్కోడా కైలాక్ కూడా 5 స్టార్ సేఫ్టీ రేంటింగ్‌ని సాధించే అవకాశం ఉంటుంది.
ఈ కాపాంక్ట్ ఎస్‌యూవీ కుషాక్, స్లావియాలో ఉపయోగించిన అదే 1.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115 bhp పవర్, 178 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ ససరికొత్త కైలాక్ ఎస్‌యూవీ 10.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కొత్త స్కోడా కైలాక్ భారత మార్కెట్‌లో ప్రస్తుతం కొనుగోలుకి అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO , మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








