రూ. 8 లక్షలు కూడా లేని కారు బుకింగ్స్ స్టార్ట్.. వెంటనే డీలర్ల వద్దకు పరుగెత్తండి.. ఇంకా లేట్ చేయకండి!

దిగ్గజ వాహనాల తయారీ కంపెనీ స్కోడా(skoda) ఇండియాలో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తూ తన మార్కెట్‌ను వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కైలాక్(kylaq) అనే కారును తీసుకొచ్చింది. ఇది ఒక సబ్-కాంపాక్ట్ SUV. తాజాగా దీనికి సంబంధించిన అనధికార బుకింగ్‌లు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. కంపెనీ అధికార బుకింగ్‌లను డిసెంబర్ 2వ తేదీని శుభదినంగా ఎంచుకుని ఆ రోజున కారును వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులోకి తీసుకు వస్తుందని సమాచారం. అయితే ఈ మోడల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొంత మంది డీలర్లు ముందుగానే బుకింగ్‌లను తెరిచినట్లు కొన్ని కథనాల ద్వారా తెలుస్తుంది. దీని ధరను స్కోడా విడుదలకు ముందే వెల్లడించింది. ఇది వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ఉంది.

స్కోడా పేర్కొన్న దాని ప్రకారం, కైలాక్ సబ్-కాంపాక్ట్ SUV ప్రారంభ ధర అతి తక్కువగా రూ.7.89 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి అమ్మకానికి ఉంది. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ కారును తీసుకొచ్చారు. రేట్ తక్కువగా ఉండటంతో చాలా మంది దీన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో డీలర్లు ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించినట్లు తెలుస్తుంది. అధికారిక బుకింగ్‌లు మొదలైన తర్వాత కంపెనీ పూర్తి ధరను వెల్లడించే అవకాశం ఉంది.

Skoda Kylaq Unofficial Bookings Now Open In India

అధికారిక బుకింగ్‌ను స్కోడా ప్రారంభించిన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో కస్టమర్లకు డెలివరీలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తుంది. ఇండియాలో కాంపాక్ట్ SUVలకు మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ విభాగంపై స్కోడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కైలాక్ కారును రంగంలోకి దింపింది. తక్కువ ధరలో కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశం. ఈ రేంజ్‌లో హైఎండ్ ఫీచర్స్ ఉన్న కారు ఇదే కావడం గమనార్హం.

స్కోడా కైలాక్ ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. ఎక్స్‌టీరియర్ డిజైన్ వినియోగదారులను కట్టిపడేసేలా ఉంటుంది. రూ.8 లక్షల లోపు ఈ కారును అందించడానికి ప్రధాన కారణం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే లక్ష్యంలో భాగమే. కారు లోపల క్యాబిన్ కూడా చాలా అందంగా ఉంటుంది. తోలుతో ఉన్నటువంటి సీట్లు, స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సింగిల్-పేన్ సన్‌రూఫ్ వంటి వాటిని కలిగి ఉంది.

Skoda Kylaq Launch Details

క్యాబిన్ ఫీచర్లు కూడా అధునాతనంగా ఉన్నాయి. లోపల 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డ్రైవర్ల కోసం 8-అంగుళాల డిస్‌ప్లే, , యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ ,యాంబియంట్ లైట్,పుష్ బటన్ స్టార్ట్/స్టాప్‌ ఆప్షన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు గ్రిల్ కూడా కారు అందాన్ని పెంచుతుంది. అలాగే, 7 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

చీకట్లో ప్రకాశవంతమైన వెలుతురు కోసం స్ప్లిట్ టైప్ LED హెడ్‌లైట్లు, వెనుక టెయిల్ లైట్ వంటి అనేక ఫీచర్లను స్కోడా తన కైలాక్‌లో అందించింది. ఇక ఇంజిన్ గురించి పరిశీలిస్తే, ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మోటార్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115 PS పవర్, 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందించినట్టు తెలుస్తుంది.

Skoda Kylaq Unofficial Bookings

చివరగా డ్రైవ్‌స్పార్క్ ఎం చెబుతుందంటే, ఇండియాలో వినియోగదారులు ఇటీవల కాలంలో సబ్-కాంపాక్ట్ SUV కార్లను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్కోడా ఈ మార్కెట్‌పై కన్నేసి తక్కువ ధరలోనే ఈ కారును తీసుకొచ్చింది. ఇది , మహీంద్రా XUV 3XO,టాటా నెక్సాన్ వంటి వాటికి ప్రధాన పోటీదారుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 27, 2024, 12:07 [IST]
English summary
Skoda kylaq unofficial bookings now open here the full details
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+