కొత్త స్కోడా కైలాక్ వర్సెస్ మారుతి బ్రెజా రెండు కార్లలో 'రారాజు' ఏదో తెలుసా?.. కొత్తగా కారు కొనేవారు చూడండి!
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో మారుతి బ్రెజా (Maruti Brezza), టాటా నెక్సాన్ (Tata Nexon), మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO (Mahindra XUV 3XO) వంటి మోడళ్లు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. తాజాగా వీటికి గట్టి పోటీని ఇచ్చేందుకు స్కోడా కైలాక్ (Skoda Kylaq) విడుదలైంది. దీనిని ఎవ్వరూ ఊహించిన ధరలో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ విభాగంలో మారుతి బ్రెజా, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, టాటా నెక్సాన్ టాప్ 10లో కొనసాగుతున్నాయి. అమ్మకాలలో మారుతి బ్రెజా ముందంజలో ఉంది. మార్కెట్‌లో ప్రస్తుతం సరికొత్త స్కోడా కైలాక్, మారుతి బ్రెజాలు కీలకంగా ఉన్నాయి. ఈ రెండు కార్ల మధ్య కీలక తేడాలు, స్పెసిఫికేషన్స్‌పై ఓ లుక్కేయండి.
స్కోడా కారుని ఆధునిక ఫీచర్లతో మార్కెట్‌లో ఆ సంస్థ విడుదల చేసింది. ఇందులోని స్మార్ట్ ఫీచర్లు కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు సరిపోతాయి. ప్రస్తుతం అమ్మకాల్లో టాప్‌లో ఉన్న బ్రెజాతో పోల్చితే ఇందులో స్మార్ట్ ఫీచర్లను అందించారు. బ్రెజాను కొనుగులో చేయాలని ఫిక్స్ అయ్యేవారు ఓ సారి తక్కువ ధరలో లభిస్తున్న ఈ బ్రెజాపై లుక్ వేయవచ్చు.

పవర్డ్ ఫ్రంట్ వరుస సీట్లు: స్కోడా కైలాక్‌లో 6 స్టెప్స్ ఎలక్ట్రానిక్ సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్స్‌తో వస్తుంది. అయితే బ్రెజాలో మాన్యువల్ అడ్జస్ట్‌మెంట్‌కి మాత్రమే అవకాశం ఉంది. అది కూడా డ్రైవర్ సీట్ మాత్రమే అని గమనించాలి. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్‌మెంట్ వల్ల మంచి కంఫర్ట్ లభిస్తుంది. కైలాక్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీటింగ్ ఆప్షన్ కలదు. అయితే ఈ ఫీచర్ కూడా బ్రెజాలో లేదు.
ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్: కైలాక్‌లో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇంటీరియర్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. అయితే మారుతి బ్రెజాలో 9.0-ఇంచెస్ యూనిట్ మాత్రమే కలదు. ఈ రెండింట్లో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తాయి. వీటితో పాటు ఈ రెండు కంపెనీలు కనెక్టెడ్ కార్ టెక్నాలజీని పొందుతాయి. ఇది మీ ప్రయాణంలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తాయి.

ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్: కైలాక్ 8.0 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో వస్తుంది. మారుతి బ్రెజా చిన్న మల్టీ-ఇన్ఫో డిస్ప్లేలో అనలాగ్ డయల్స్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ మాత్రమే వస్తుంది. ఇక స్కోడా కైలాక్‌లో కార్నరింగ్ హెడ్‌లైట్లు కలవు. హెడ్‌లైట్ క్లస్టర్‌పై కార్నరింగ్ యూనిట్లు కలవు. ఇది విజిబిలిటీని అందిస్తుంది. బ్రెజా ముందు భాగంలో సింపుల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, LED ఫాగ్‌ల్యాంప్స్ మాత్రమే ఉన్నాయి.
ఎయిర్‌బ్యాగ్స్: సేఫ్టీ పరంగా స్కోడా కైలాక్ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ని స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది. అయితే మారుతి బ్రెజాలో కేవలం టాప్-స్పెక్ ZXi ప్లస్ వేరియంట్‌లో మాత్రమే ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ని అందిస్తుంది. బ్రెజాలోని లో వేరియంట్లలో కేవలం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. రెండు మోడళ్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్: స్కోడా కాలాక్‌లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) కలదు. అయితే ఈ ఫీచర్ టాప్-స్పెక్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ కారుని ఆపినా, డ్రైవింగ్‌లో టైర్‌ప్రెజర్‌ని అంచనా వేస్తూ డ్రైవర్‌కి కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. స్కోడా కైలాక్ ధరలు రూ .7.89 లక్షలు, మారుతి బ్రెజా ధరలు రూ. 8.34 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతాయి.


Click it and Unblock the Notifications








