స్కోడా కైలాక్‌ వర్సెస్‌ టాటా నెక్సాన్‌లలో బెస్ట్ కారు ఏదో తెలుసా? రెండింటీ ధరలు రూ. 8 లక్షల నుంచే ప్రారంభం!

ప్రస్తుతం మార్కెట్‌లో స్కోడా కార్లు సత్తా చాటుతున్నాయి. ఆ కంపెనీ నుంచి వర్టస్‌, స్కోడా స్లేవియా, స్కోడా కుషాక్‌, స్కోడా సూపర్బ్ వంటివి మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి. ఇక సేఫ్టీలో టాటా మోటార్స్ నంబర్‌.1 గా ఉన్నాయి. టాటా కార్ల మాదిరిగానే.. స్కోడా కూడా సేఫ్టీలో మంచి ఆదరణను కలిగి ఉన్నాయి. ఇటీవలె స్కోడా కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ సంఖ్య రోజు రోజుకు మరింత ఎక్కువ అవుతుంది. అయితే స్కోడా కార్లు మార్కెట్‌లో ఇతర కార్లతో పోల్చితే కొంచెం ఖరీదైనవిగా ఉన్నాయి. అయితే ఈ సమస్యకు చెక్‌ పెడుతూ ఎవ్వరూ ఊహించిన ధరలో సరికొత్త కైలాక్‌ కారుని విడుదల చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది టాటా నెక్సాన్‌తో పోటీపడుతుంది. ఈ రెండింట్లో ఏది ఉత్తమమైనదో ఓసారి పరిశీలిద్దాం.

ఫీచర్లు: ఇక కొత్త స్కోడా కైలాక్ 2-స్పోక్ స్టీరింగ్ వీల్, 8-ఇంచెస్‌ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్‌తో వస్తుంది. ఇందులో అప్‌డేటెడ్ ఓఎస్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ మొబైల్‌ ఛార్జర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, లెథరెట్ అప్‌హోల్‌స్టరీతో కూడిన 10 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Skoda Kylaq Vs Tata Nexon

ఇక టాటా నెక్సాన్ డ్యూయల్ 10.25 ఇంచెస్‌ డిస్ ప్లే (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్), వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటో ఏసీ విత్ రియర్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఫోన్‌ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్‌, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సేఫ్టీ: టాటా నెక్సాన్‌ 6 ఎయిర్‌బ్యాగ్స్‌, రియర్ పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎబిఎస్ విత్ ఇబిడి, హిల్ హోల్డ్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్‌ ఉన్నాయి. హై-వేరియంట్లలో బ్లైండ్ వ్యూ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360 డిగ్రీస్‌ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Skoda Kylaq Rivals

ఇక తాజాగా విడుదలైన స్కోడా ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ బోర్డ్‌ ఉన్నాయి. ముందు భాగంలో ప్రయాణికుడికి పవర్డ్ సీట్ వంటివి ఉన్నాయి. ఈ కూడా క్రాష్‌ టెస్ట్‌లో మంచి రేటింగ్‌ని సాధించే అవకాశం ఉంటుంది.

ఇంజిన్: టాటా నెక్సాన్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది.1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో వస్తుంది. రెండవది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ AMT ఆప్షన్‌తో వస్తుంది. ఇక స్కోడా కైలాక్ 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ 6-స్పీడ్ CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Tata Nexon Rivals
ధర: టాటా నెక్సాన్ బేస్ మోడల్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ .8 లక్షల (ఎక్స్-షోరూమ్)లకే ప్రారంభమవుతుంది. ఇక టాప్-ఎండ్ డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ .15.80 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇక కొత్త స్కోడా కైలాక్‌ ధర కేవలం రూ .7.89 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరతో ఆరంభం అవుతుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 12, 2024, 18:21 [IST]
English summary
Skoda kylaq vs tata nexon features specifications and engine comparisons
Read more on: #auto news #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+