త్వరపడండి.. ఈ కార్లపై రూ.2.50 లక్షల భారీ తగ్గింపు.. ఛాన్స్ మిస్ అయితే మళ్లీ రాదు..

దిగ్గజ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఇటీవల ముగిసిన పండుగ సమయంలో మెరుగైన అమ్మకాలను సాధించింది. స్కోడా కూడా మంచి గణంకాలను నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ముగిసిన తరువాత ఇయర్ ఎండ్‌లో స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కొన్ని ఎంపిక చేసిన కార్లపై భారీ మొత్తంలో తగ్గింపులను అందిస్తున్నాయి. అక్టోబర్‌లో అందుబాటులో ఉన్న తగ్గింపులను సద్వినియోగం చేసుకోలేని వారు నవంబర్ నెలలో ఈ ఆఫర్లను ఉపయోగించుకుని తక్కువ ధరలో కొత్త కార్లను తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇండియా మార్కెట్ ఆటోమొబైల్ విభాగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు వరుసగా కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ వాటిపై భారీ మొత్తంలో తగ్గింపులు అందిస్తున్నాయి. ఇప్పుడు స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు కూడా తమ మార్కెట్‌ను విస్తరించడానికి అలాగే, పాత స్టాక్‌లను విక్రయించడానికి నవంబర్ నెలలో ఈ ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నట్లు ప్రకటించాయి.

ఇప్పటికే ఈ కంపెనీలకు చెందిన పలు మోడళ్లపై ఆఫర్లు ఉండగా, కొత్త డిస్కౌంట్స్‌ ద్వారా వీటి అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. స్కోడా (Skoda) కుషాక్(Kushaq), స్లావియా(Slavia), ఫోక్స్‌వ్యాగన్(Volkswagen)వర్టస్(Virtus), టైగన్( Taigun), టిగువాన్(Tiguan) వంటి మోడళ్లపై దాదాపు 2.50 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి. కొన్నింటిపై మరింత తక్కువ తగ్గింపు ఉంది. ఏ కారుపై ఎంత తగ్గింపు అందుబాటులో ఉందో క్రింది కథనంలో చూద్దాం.

Skoda Volkswagen Offers Up To Rs 2 50 lakh Discounts

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్: వర్టస్ పాత మోడల్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. దీని ఆకట్టుకునే డిజైన్‌తో అమ్మకాల పరంగా మెరుగైన గణంకాలను నమోదు చేస్తుంది. ఈ మోడల్‌పై నవంబర్ నెలలో కంపెనీ ప్రత్యేకంగా రూ. 2.50 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. దీనిలో ఎక్స్‌ఛేంజ్ తగ్గింపులు, కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. వర్టస్‌ను దీపావళి ఆఫర్లలో కొనుగోలు చేయలేని వారికి ఇది మంచి అవకాశం.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్: దీని పాత మోడల్‌ 2 ఎయిర్‌బ్యాగ్స్‌తో లభిస్తుంది. ఇది రూ. 2.50 లక్షల వరకు తగ్గింపుతో లభిస్తుంది. దీనిలో కార్పొరేట్, ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనాలు ఉన్నాయి. 6-ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ మోడల్‌పై దాదాపు రూ.88,000 తగ్గింపు ఉంది. దీనిలో ప్రత్యేక తగ్గింపు రూ.35,000, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, రూ.15,000 కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి.

Skoda Volkswagen To Rs 2 50 lakh Discounts On Cars

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్: ఈ మోడల్‌పై కంపెనీ ఎన్నడు లేని విధంగా భారీ తగ్గింపులను ప్రకటించింది. దీని ప్రారంభ ధర రూ. 35.17 లక్షల (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కారుపై రూ. 1 లక్ష భారీ నగదు తగ్గింపుతో పాటు, రూ. 50,000 కార్పొరేట్ ప్రయోజనాలు, రూ. 75,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తుంది. కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ నెలలో టిగువాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

స్కోడా కుషాక్: ఇది ఒక ఎస్‌యూవీ. దీని పాత మోడల్‌‌పై కంపెనీ ఏకంగా రూ.2.50 లక్షల వరకు తగ్గింపులను అందిస్తుంది. దీనిలో కార్పొరేట్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనాలు మరిన్ని డీలర్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కుషాక్ పాత మోడల్‌లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వచ్చింది. ఇండియాలో స్కోడా కంపెనీ అమ్మకాల్లో కుషాక్ మోడల్ చాలా ముఖ్యమైనది.

Skoda Offers Up To Rs 2 50 lakh Discounts On Cars

స్కోడా స్లావియా: ఇది కూడా వినియోగదారుల నుంచి అత్యధికంగా డిమాండ్ ఉన్న మోడల్. దీనిపై కూడా 2.50 లక్షల వరకు తగ్గింపు ఉంది. కార్పొరేట్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ వంటివి కూడా దీనికి వర్తిస్తాయి. 6-ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌ స్లావియా మోడల్‌పై రూ. 1 లక్ష వరకు మొత్తం ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో రూ. 40,000 కార్పొరేట్ తగ్గింపులు, రూ. 40,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అదనంగా రూ.20,000 డీలర్ తగ్గింపులు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, November 18, 2024, 17:50 [IST]
English summary
Skoda volkswagen is offering discounts up to rs 2 50 lakh on cars in this november
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+