ఆ కార్లలో సమస్య, మీకు తెలియకుండానే కంట్రోల్ తప్పే అవకాశం.. రీకాల్ చేసిన కంపెనీ!
భారత్‌లో ఈ మధ్య 'రీకాల్' అనే పదం తరచుగా వినిపిస్తోంది. వాహన తయారీ సంస్థలు ఇప్పటికే అందుబాటులో ఉన్న కార్లు, బెైకుల్లో ఏదైనా అడ్జస్ట్‌మెంట్ లేదా సమస్య తలెత్తినట్లు గుర్తిస్తే వాటిని వెంటనే రీకాల్ చేస్తుంది. సమస్యను మరింత జఠిలం చేయకుండా ఉండేందుకు ఆయా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటాయి. కారులో లేదా బైక్‌పై ప్రయాణించే వారి భద్రతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు రీకాల్ చేసి సమస్యను సరిచేస్తూ ఉంటాయి. మారుతి సుజుకి ఇతర కార్ల కంపెనీలు చాలా సందర్భాల్లో కార్లను రీకాలు చేశాయి. ఇప్పుడు మరో రెండు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ మోడళ్లను రీకాల్ చేశాయి. ఆ వివరాలు మీకోసం..
భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ పరిధిలోకి వచ్చే స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కార్లను ఆ సంస్థ రీకాల్ చేసింది. ఈ కార్లను రీకాల్ చేయడానికి గల కారణాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెబ్‌సైట్‌లో వెల్లడయ్యాయి. ఎంపిక చేసిన మోడళ్లను స్కోడా-ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కొన్ని కార్లను రీకాల్ చేసింది. మోడళ్ల పేర్లను సైతం సియామ్ ప్రకటించింది.

మాన్‌ఫ్యాక్చరింగ్ సమయంలో అవకతవకల కారణంగా కుషాక్, స్లావియా, టైగూన్, వర్టస్‌లోని కొన్ని కార్లను వెనక్కి పిలిచినట్లు తెలుస్తోంది. వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేసిన వివరాల ప్రకారం వెల్డింగ్ ప్రక్రియలో 'ట్రాక్ కంట్రోల్ ఆర్మ్'పై వెల్డింగ్ సీమ్ తొలగిపోయే అవకాశం ఉండొచ్చని కంపెనీ అనుమానిస్తోంది. ఏ కార్లలోనైనా సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వాటిని రీకాల్ చేసింది. పైన పేర్కొన్న భాగాలలో ఏదైనా లోపం ఉంటే కారు నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 52 కార్లు ఈ సమస్య కారణంగా ప్రమాదానికి గురైనట్లు సియామ్ పేర్కొంది. ఇందులో 38 టైగూన్ యూనిట్లు కాగా మిగతావి వర్టస్, కుషాక్, స్లావియా 14 యూనిట్లుగా ఉన్నాయి. నవంబర్ 29, 2023 నుంచి జనవరి 20, 2024 మధ్య తయారైన మోడళ్లలో ఈ సమస్య తలెత్తినట్లు ఫోక్స్‌వ్యాగన్ గుర్తించింది. వీటిని 2024 అక్టోబర్ 28 నుంచి అధికారికంగా రీకాల్ చేస్తున్నారు.

అయితే దీనిపై స్కోడా-ఫోక్స్‌వ్యాగన్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రెండు కార్ల కంపెనీలు ఇప్పటికే వాహనాల యజమానులను సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. ఇతర రీకాల్స్ మాదిరిగానే, ఏదైనా సమస్య ఉంటే, కంపెనీ దానిని ఉచితంగా రిపేర్ చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో యజమానుల ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. ఈ రీకాల్ అనేది అన్ని కంపెనీలు చేసే పని కాబట్టి యజమానులు ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదు.
స్కోడా ఇటీవలె మార్కెట్‌లో తక్కువ ధరతో కైలాక్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ సబ్-4 ఎస్‌యూవీని కేవలం రూ .7.89 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో తీసుకువచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పటివరకు కేవలం బేస్ వేరియంట్ ధరను మాత్రమే ప్రకటించారు. మిగతా వేరియంట్ల ధరలను వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ కారుని డెలివరీలకు ముందే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు.

ఈ కారులో 8 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, 9-ఇంచెస్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, సింగిల్-పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ మోబైల్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీ పరంగా ఇది అదరగొట్టనుంది. ఎందుకంటే ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, మల్టీ-కొలిషన్ బ్రేక్స్, రోల్-ఓవర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
స్కోడా నెక్ట్స్ జనరేషన్ కొడియాక్‌ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ కారు భారత్‌లో మే 2025 నాటికి కొనుగోలుకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఇక భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో స్కోడా ఓక్టావియా ఆర్‌ఎస్ (Octavia RS)ను ప్రదర్శించనున్నారు. దీనిని భారతీయ మార్కెట్లోకి తీసుకురావాలా వద్దా అనే దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ వచ్చినా ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) గా అడుగుపెట్టనుంది. దీని ధరలు ఎక్కువగా ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








