స్కోడా నుంచి త్వరలో రానున్న కారు ఇదే.. మారుతి బ్రెజా, కియా సోనెట్, టాటా నెక్సాన్లకు గట్టి పోటీ!!
దేశంలో స్కోడా సంస్థ మార్కెట్‌ని విస్తరిస్తోంది. అందులో భాగంగానే సరికొత్త మోడలతో ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఆ సంస్థ దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా కాంపాక్ట్ SUV పోర్ట్‌పోలియోను విస్తరించే పనిలో ఉంది. తాజాగా ఆ కంపెనీ నుంచి సరికొత్త కారు రానుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన స్పై విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
త్వరలోనే ఆ సంస్థ నుంచి రాబోతున్న కొత్త కాంపాక్ట్ SUV పేరును సంస్థ ఇంకా ఖరారు చేయలేదు. ఈ కాంపాక్ట్ SUV భారతీయ రోడ్లపై తాజాగా దర్శనమిచ్చింది. టెయిల్ ల్యాంప్ డిజైన్ అచ్చం కుషాక్ తరహాలోనే ఉండనుంది. స్పై విజువల్స్ ప్రకారం హెడ్‌ల్యాంప్ సెటప్ LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ స్ట్రిప్ పైన ఉంటుంది. ప్రధాన హెడ్‌ల్యాంప్ స్ప్లిట్ క్రింద రానుంది. స్కోడా సిగ్నేచర్ గ్రిల్ ఎప్పటిలాగానే ఉండనుంది.

ఇక SUVలో రూఫ్ రెయిల్స్ మరియు అల్లాయ్ వీల్స్ కూడా గమనించవచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే ఇది పాత ఇంజిన్ మాదిరిగానే 1.0-లీటర్ TSI పెట్రోల్ యూనిట్‌తో రానుంది. ఇది 113 bhp గరిష్ట శక్తిని మరియు 178 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మోషన్‌తో వస్తుంది.
కొత్త కాంపాక్ట్ SUV మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV300 మరియు టాటా నెక్సాన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం, స్కోడా భారతదేశంలో కొడియాక్, కుషాక్, స్లావియా మరియు సూపర్బ్‌ను విక్రయిస్తోంది. త్వరలో విడుదల కాబోయో SUV లైనప్ ఐదవ మోడల్‌గా రానుంది. ఇది కుషాక్ మరియు స్లావియాతో తన ప్లాట్‌ఫామ్‌ని పంచుకుంటుంది.

కంపెనీ ప్రస్తుతం స్థానిక నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు సన్నాహకాలు చేస్తోంది. అందులో భాగంగానే త్వరలో లాంచ్ కాబోయే కొత్త కాంపాక్ట్ SUV 2025 అర్థ భాగంలో విడుదల చేయనుంది. ఈ కొత్త కాంపాక్ట్ SUV కోసం ప్రత్యేకంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచేందుకు సంస్థ ప్రణాళికలు చేస్తుంది. భారతీయ మార్కెట్‌కి అనుగుణంగా భారతదేశంలో తయారు చేయబడుతుంది.
స్కోడా ఆటో ఇండియా ఒకే సంవత్సరంలో ఈ కొత్త SUVని 1,00,000 యూనిట్లకు పైగా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రెండు సంవత్సరాల వ్యవధిలో కుషాక్ మరియు స్లావియా మోడళ్ల సేల్స్ కంటే రెండింతలు అధికం. త్వరలోనే వోక్స్‌వ్యాగన్ సబ్-కాంపాక్ట్ SUV సరికొత్త వెర్షన్‌ని పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ రెండు కార్లను జనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సేఫ్టీలో స్కోడా కార్లు కస్టమర్ల నమ్మకాలను నిలబెట్టుకుంటుంది. ఈ సంస్థ నుంచి విడుదలైన స్కోడా స్లేవియా, స్కోడా కూషాక్‌లు 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉన్నాయి. మార్కెట్‌లో ఉన్న సేఫ్టీ కార్ల కొనుగోళ్లలో ఎక్కువగా స్కోడా కార్ల వైపు జనాలు చూస్తున్నారు. అందుకు తగినట్లుగానే సంస్థ సరికొత్త ఉత్పత్తులను భారతీయ మార్కెట్‌లో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు చేస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








