Afeela EV సోనీ-హోండా మొబిలిటీ నుంచి AFEELA ఎలక్ట్రిక్ కారు.. ప్లే స్టేషన్5 ద్వారా కూడా నియంత్రించవచ్చు..!
ప్రముఖ టెక్ దిగ్గడం సోనీ, మరో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా జాయింట్ వెంచర్‌లో ఎలక్ట్రిక్ వాహనం Afeela EVను ఆవిష్కరించారు. CES 2024 (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో) కార్యక్రమంలో ఈ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించారు. ఈ ఈవీ డిజైన్ సహా ఇతర ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
సీఈఎస్ 2024లో అనేక టెక్ సంస్థలు తమ ఉత్పత్తులు, ఆవిష్కరణలను ప్రదర్శనకు ఉంచుతాయి. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం సహా ఇతర రంగాల్లో దీని ప్రభావం మరియు టెక్నాలజీ అభివృద్ధి సహా ఇతర గ్యాడ్జెట్లను ఇక్కడ ప్రదర్శిస్తారు. హోండా- సోనీల ఎలక్ట్రిక్ కారు Afeela EV.. 2026 నుంచి విక్రయాలు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు.

హోండా సోనీ మొబిలిటీ ఎలక్ట్రిక్ కారు Afeela ఎలక్ట్రిక్ సెడాన్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 91kWh లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. 150kW DC ఫాస్ట్ ఛార్జర్, 11kW లెవల్ 2 ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్ఠంగా 241 bhp శక్తి చొప్పున శక్తిని ఉత్పత్తి చేయగలవు. అంటే మొత్తం 482bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
గతంలో ప్రదర్శించిన ఈవీతో పోలిస్తే డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ బంపర్, డిజిటల్ డిస్‌ప్లే ఆకర్షణీయ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. దీంతోపాటు వెనుక బంపర్, టెయిల్ లైట్లు కూడా అప్‌గ్రేడ్ చేశారు. అయితే ఇంటీరియర్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.

డిజైన్ మార్పులతోపాటు సెడాన్ కొలతలను కూడా మార్పులు చేశారు. ప్రస్తుతం అప్‌గ్రేడ్ చేయబడిన వివరాల ప్రకారం కారు పొడవు 4915mm గా ఉంది. 1900mm వెడల్పు, 3000mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. గత మోడల్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్ చేసిన ప్రోటోటైప్ మోడల్‌లో పొడవు మినహా.. వెడల్పు, ఎత్తు, వీల్‌బేస్ ఒకే మాదిరిగా ఉన్నాయి.
గతంతో పోలిస్తే ఎటువంటి మార్పులున్నాయ్ : డ్యూయల్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌తో కూడిన రివైజ్డ్ సెంటర్ కన్సోల్ మాత్రం పాత డిజైన్‌కు అదనంగా రానుంది. అలాగే క్యాబిన్ లోపల అప్‌గ్రేడ్ అయితే స్టీరింగ్ వీల్, కొత్త రియర్ వ్యూ మిర్రర్ ఉన్నాయి.

అఫీలా ఎలక్ట్రిక్ సెడాన్‌ను PS5 కంట్రోలర్ ద్వారా నియంత్రించవచ్చని CES 2024 వేదికగా సోనీ హోండా మొబిలిటీ సీఈవో యసుహిడ్ మిజునో తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఆధారిత కంట్రోలర్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ కారును ఎలా నడపవచ్చో వేదికపై ప్రదర్శించారు. అయితే ఈ కారు రేంజ్, ధర సహా ఇతర వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








