మీలాగే మీ కారు కూడా అందరీలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలంటే ఈ 'స్పెషల్ ఎడిషన్స్'ని ట్రై చేయండి!
మార్కెట్‌లో కొన్ని ఫేమస్ కార్లకు కొనసాగింపుగా ఆయా కంపెనీలు స్పెషల్ ఎడిషన్స్‌ని (Special Edition Cars) విడుదల చేస్తూ ఉంటాయి. అందుబాటులో ఉన్న ఈ కారు మోడళ్ల కంటే కొంచెం ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంతే కాకుండా ఇవి కేవలం కొద్ది రోజులు మాత్రమే కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి. ఈ స్పెషల్ ఎడిషన్లు అమ్మకాలు అదే స్థాయిలో జరుగుతాయి. ఎందుకంటే ఇవి ప్రత్యేక స్టైలింగ్‌తో రావడం వల్ల జనాలు తెగ కొనేస్తారు. పండుగ సీజన్‌ని పురస్కరించుకుని ఈ దీపావళికి కార్ల తయారీదారులు ఫేమస్ కార్ల స్పెషల్ ఎడిషన్స్‌ని విడుదల చేశాయి.
ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు అలాగే యూనిక్ లుక్ కోసం చూసే వారికి ఈ స్పెషల్ ఎడిషన్లను బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. ఈ పండగ సీజన్‌లో కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు కొన్ని టాప్ కంపెనీలు స్పెషల్ ఎడిషన్ కార్లను విడుదల చేశాయి. ఈ స్టోరీలో వీటికి ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్లు, ధర, మైలేజీ ఇతర ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం అందిస్తున్నాం..

మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్: మారుతి సుజుకి లైనప్స్‌లో ప్రస్తుతం బాలెనో హ్యాచ్‌బ్యాక్ ప్రీమియం లుక్‌ని కలిగి ఉంది. ఈ పండుగ సీజన్ కోసం బాలెనో రీగల్ స్పెషల్ ఎడిషన్ (Baleno Regal Special Edition)ని మారుతి సుజుకి లాంచ్ చేసింది. ఈ వెర్షన్ ముందు గ్రిల్ భాగాన్ని పాలిష్‌తో మరింత అందంగా అందించారు. ఫ్రంట్ అండ్ రియర్‌లో అండర్ బాడీ స్పాయిలర్, బ్యూటిఫైడ్ ఫాగ్‌ల్యాంప్స్ ఉన్నాయి.
రియర్ డోర్, డోర్, బాడీ సైడ్ మోల్డింగ్, ప్రత్యేకమైన సీట్ కవర్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, విండో కర్టెన్, 3 డి ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఉంటాయి. దీనికోసం వేరియంట్‌ని బట్టి రూ .45,820 నుంచి రూ .60,199 వరకు అదనపు ధర చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం బాలెనో ధర రూ.6.66 లక్షలు- రూ.9.84 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్: ఫ్లాగ్‌షిప్ మోడల్ స్విఫ్ట్‌ని పండగ సీజన్ కోసం ప్రత్యేక ఎడిషన్‌లో మారుతి సుజుకి విడుదల చేసింది. స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ (Swift Blitz Edition) LXi, VXi, VXi AMT, VXi (O), VXi (O) AMT వేరియంట్‌లో లభిస్తుంది. ఈ ఎడిషన్ కోసం రూ. 39,500 నుంచి రూ.49,848 విలువైన కాస్మొటిక్స్‌ని ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ ఎడిషన్‌ని పెట్రోల్, సీఎన్‌జీతో పాటు మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు. బాలెనో మాదిరిగానే స్విఫ్ట్ బ్లిట్జ్ కూడా అదనపు ఫీచర్లతో అలంకరించబడుతుంది. వెనుక భాగంలో అండర్ బాడీ స్పాయిలర్స్ ఉన్నాయి. వీటితో పాటు కారుకు ఇరువైపులా LED ఫాగ్ ల్యాంప్స్, డోర్ విషర్స్, మౌల్డింగ్స్ ను అందించనున్నారు. ప్రస్తుతం స్విఫ్ట్ ధరలు రూ. 6.49- 9.59 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

టయోటా గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్: మారుతి సుజుకి మాదిరిగానే, టయోటా భారతదేశంలో ప్రత్యేక దీపావళి స్పెషల్ ఎడిషన్‌ని విడుదల చేసింది. ఈ సంస్థ గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్‌ని (Toyota Glanza Festival Edition) లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో రూ.20,567 విలువ చేసే టయోటా జెన్యూన్ కారు యాక్సెసరీస్‌ని అందించనున్నారు. ఈ స్పెషల్ ఎడిషన్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ స్పెషల్ ఎడిషన్‌లో క్రోమ్ ఫినిష్డ్ రియర్ బకిల్ బంపర్, ఫెండర్, రియర్ రిఫ్లెక్టర్, వెల్‌కమ్ డోర్ ల్యాంప్స్, క్రోమ్, బ్లాక్ సైడ్ మౌల్డింగ్స్ ఉంటాయి. అందువల్ల ఈ ఫెస్టివల్ ఎడిషన్ రెగ్యూలర్ మోడల్ కంటే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీని ధరలు రూ. 6.86 నుంచి రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

టయోటా రూమియన్ ఫెస్టివల్ ఎడిషన్: ప్రస్తుతం అందుబాటులో ఉన్న మరో మంచి స్పెషల్ ఎడిషన్‌లలో ఇదొకటిగా ఉంది. ఇది కూడా మరికొన్ని రోజులు మాత్రమే అమ్మకానికి ఉంటుంది. ఈ వెర్షన్ లో కూడా రూ. రూ.20,608 విలువైన జెన్యూన్ యాక్ససరీలను అందించనుంది. గ్లాంజాలో వచ్చే పార్ట్స్ ఇందులోనూ రానున్నాయి. ఈ ఎంపీవీ ధరలు రూ. 10.44- 13.73 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో బాస్ ఎడిషన్: మహీంద్రా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో స్కార్పియో ఒకటి. మహీంద్రా ఇప్పుడు బాస్ అనే స్పెషల్ ఎడిషన్ (Mahindra Scorpio BOSS Special Edition) అధికారికంగా విడుదల చేసింది. పేరుకు తగ్గట్టుగానే ఈ ఎడిషన్ బాస్ ఆఫ్ ఆల్ స్కార్పియోస్ లా కనిపిస్తోంది. క్రోమ్ ఫినిష్ ఉన్న యాక్ససరీలను బాస్ వెర్షన్‌లో పొందవచ్చు.

గ్రిల్, హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, డోర్ హ్యాండిల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ బంపర్ ఎక్స్‌టెన్సర్, కార్బన్ ఫైబర్ ORVMs, బ్లాక్ రియర్ బంపర్, డోర్ ఫీచర్లు వంటివి ఉన్నాయి. ఈ ఎడిషన్ ఇంటీరియర్‌ని ఎక్స్‌టీరియర్ కంటే అందంగా అలంకరించారు. ఇంటీరియర్స్ నలుపు, లేత గోధుమ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ధరలు రూ. 13.63-రూ. 17.42 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.


Click it and Unblock the Notifications








