కొత్త కారును కొనుగోలు చేస్తున్నారా.. రూ.6 లక్షల ధర కలిగిన బెస్ట్ SUVల జాబితా చూశారా?
భారత్లో మార్కెట్లో SUVలకు భారీ డిమాండ్ ఉంటుంది. దేశంలోని ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండే ఎస్యూవీ లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ కార్లను కొనుగోలు చేసే సమయంలో మైలేజీతోపాటు నిర్వహణ ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారు.
రూ.6 లక్షల ప్రారంభ ధర కలిగిన బెస్ట్ ఎస్యూవీల జాబితాలో టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటి కార్లు ఉన్నాయి. ఈ వాహనాల ధర, ఇంజిన్, పనితీరు, స్పెసిఫికేషన్ల వివరాలతో కూడిన ప్రత్యేక కథనం మీకోసం.

టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ : అందుబాటులో ధరలో ఉన్న బెస్ట్ ఎస్యూవీల్లో టాటా పంచ్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ మైక్రో ఎస్యూవీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ను కలిగి ఉంది. టాటా పంచ్ బేస్ వేరియంట్ రూ.5.99 లక్షలు (ఎక్స్షోరూం)గా ఉంది. దీంతోపాటు ఆకట్టుకొనే డిజైన్, మెరుగైన ఫీచర్లు ఈ టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ సొంతం.
టాటా పంచ్ (Tata Punch) 1.2 లీటర్ పెట్రోల్, CNG వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్లో 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ను కలిగి ఉంది. సీఎన్జీ వేరియంట్లో 30km/kg మైలేజీని ఇస్తుంది. 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హెడ్ల్యాంప్స్, క్రూయిట్ కంట్రోల్ ఫీచర్లున్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ : నిస్సాన్ మాగ్మైట్ (Nissan Magnite) ఆకర్షణీయమైన డిజైన్ను కలిగి ఉంటుంది. దీంతోపాటు శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.
నిస్సాన్ మాగ్మైట్ ఎస్యూవీ రూ.5.99 లక్షల (ఎక్స్షోరూం) ప్రారంభ ధరను కలిగి ఉంది. ఈ ఎస్యూవీ రెండు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1,0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71bhp శక్తి, టర్బో ఇంజిన్ 99bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

రెనాల్ట్ కిగర్ : నిస్సాన్ మాగ్టైట్, రెనాల్డ్ కిగర్ (Renault Kiger) రెండు ఒకే ప్లాట్ఫాంపై నిర్మించారు. రెండింటి మధ్య డాలున్నాయి. ఎస్యూవీ 1,0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, CVT గేర్బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ధర రూ.6.49 లక్షలుగా ఉంది. మరియు 24 కి.మీ గరిష్ఠ మైలేజీని అందిస్తుంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








