రూ. 7 లక్షల లోపు లభించే బడ్జెట్ SUVలు.. ఇకపై చిన్న కార్లు కొనడం కచ్చితంగా ఆపేస్తారు
చాలామంది కార్లు కొనేవారు తక్కువగా ధరలో లభించే ఎస్‌యూవీ (Sport Utility Vehicles) వైపు చూస్తున్నారు. అందుకు తగినట్లుగానే కార్ల కంపెనీలు తక్కువ ధరలో ఎస్‌యూవీలను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో చిన్న కార్లు, సెడాన్లు శాసించిన భారత కార్ల మార్కెట్ ఇప్పుడు ఎస్‌యూవీలు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. భారతదేశంలో విక్రయించే కార్లలో ఎస్‌యూవీలు ఇప్పుడు 50 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. క్రమంగా మిడ్‌సైజ్ ఎస్‌యూవీలతో ఎస్‌యూవీల సంఖ్య పెరుగుతుంది. ఎంట్రీ లెవల్‌లో కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు మారుతి ఆల్టో లేదా హ్యుందాయ్ ఐ10 వంటి ఎంట్రీ లెవల్ కార్లను ఎంచుకునేవారు. అయితే ఇంకొంచె ఎక్కువ ధర వెచ్చిస్తే వచ్చే ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రజలు వాటినే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తక్కువ ధరలో ఫేమస్ కంపెనీలు ఎస్‌యూవీలను అందిస్తున్నాయి. అందులో ముఖ్యంగా టాటా, హ్యుందాయ్, నిస్సాన్, రెనాల్ట్ కంపెనీ కార్లు కేవలం రూ.7 లక్షల బడ్జెట్‌తో కస్టమర్లకు మరితం చేరువ అవుతున్నాయి. ఈ కంపెనీ కార్లు కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మేము ఇక్కడ తెలుపబోయే నాలుగు మిడ్‌సైజ్ ఎస్‌యూవీలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అనువుగా ఉండనున్నాయి. ఆ కార్ల ఫీచర్ల వివరాలు ధర మీ కోసం..

నిస్సాన్ మాగ్నైట్: ముందుగా ఈ జాబితాలో ఉన్న కారు ఇది. జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న ఏకైక మోడల్ మాగ్నైట్. ఇది సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. 2020లో లాంచ్ అయిన మాగ్నైట్ ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్న చౌకైన ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. దీని ధర కేవలం రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమౌతోంది.
ఈ మోడల్‌లోని టాప్ వేరియంట్ ధర రూ.11.11 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది రూ .10 లక్షల లోపు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లను కూడా అందిస్తుంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ నేచురల్ ఆస్పిరేటెడ్ మరియు టర్బో వెర్షన్లలో లభిస్తుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ అలారం, పవర్ విండోస్, సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రెనాల్ట్ కిగర్: సాంకేతికంగా, కిగర్ నిస్సాన్ మాగ్నైట్‌తో సమానంగా ఉంటుంది. కైగర్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ దిగ్గజం ఎస్‌యూవీ. మాగ్నైట్ మాదిరిగానే కైగర్ కూడా సరసమైన ధరలో లభిస్తుంది. అందువల్ల, హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీలకు అప్‌గ్రేడ్ కావాలనుకునేవారికి అలాగే మొదటిసారి కారు కొనుగోలుదారులకు ఇది బెస్ట్ మోడల్. కిగర్ బేస్ వేరియంట్ ధర రూ.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
టాప్ వేరియంట్ ధర రూ.11.23 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కిగర్ ఆటోమేటిక్ వేరియంట్లను కూడా రూ .10 లక్షల కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. కిగర్ కూడా మాగ్నైట్ ఎస్ యూవీ మాదిరిగానే ఇంజిన్-ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ అందిస్తుంది. ఈ రోజుల్లో ట్రెండింగ్ కార్ ఫీచర్లలో ఒకటైన సన్ రూఫ్ మాత్రం మాగ్నైట్ మరియు కిగర్‌లో అందుబాటులో లేదు.

టాటా పంచ్: టాటా పంచ్ అనేది దేశపు ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ నుంచి టాటా మైక్రో-ఎస్‌యూవీగా ఉంది. పెట్రోల్, సీఎన్‌జీ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఈ కారు అందుబాటులో ఉంది. ఇటీవల భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా ఈ కారుగా నిలిచింది. టాటా పంచ్ బేస్ వేరియంట్ ధర రూ .6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికీ ఈ కారు సేల్స్‌లో దూసుకెళ్తుంది.
ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 87bhp పవర్ మరియు 115nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎస్‌యూవీ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT గేర్ బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. పంచ్ బేస్ వేరియంట్‌లో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, సింగిల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్: గత ఏడాది విడుదలనై ఈ ఎక్స్‌టర్ కూడా సరసమైన ఆప్షన్‌గా ఉంది. ఈ మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది టాటా పంచ్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ఈ ఎక్స్‌స్టర్ ఇదే ధర రూ.6.13 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమౌతోంది. ఎక్స్‌స్టర్ ఆటోమేటిక్ వేరియంట్లను కూడా రూ .10 లక్షల కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు.
ఈ ఎస్‌యూవీలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది 81.80bhp పవర్ మరియు 113.8nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMTగేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. బేస్ వేరియంట్‌లో 6 ఎయిర్ బ్యాగులు, సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








