మహీంద్రా థార్‌ కొనేవారు 'జిమ్నీ ఆఫ్‌రోడ్‌ ఎడిషన్‌'ని ట్రై చేయవచ్చు.. విడుదల ఎప్పుడంటే?

మార్కెట్‌లో ప్రస్తుతం బెస్ట్ ఆఫ్‌రోడర్‌ ఎస్‌యూవీగా మహీంద్రా థార్‌ రాక్స్ ఉంది. దీనికి గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి నుంచి జిమ్నీ (Jimny) అందుబాటులో ఉంది. అయితే మహీంద్రా థార్‌ క్రేజ్‌తో పోలిస్తే ఇది అంత పాపులారిటీని సాధించలేదు. అయినా కానీ దీనికి కూడా భారీ సంఖ్యంలోనే ఫ్యాన్స్ ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం మారుతి జిప్సీ ఆఫ్‌రోడర్‌ సెగ్మెంట్‌ని శాసించింది. ఈ స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఇప్పుడు ఆ బాధ్యతను జిమ్నీ తీసుకుంది. జిప్సీ వాహనాలు ఆర్మీలోనూ విరివిగా కనిపిస్తాయి. అయితే జిమ్నీ మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేక పోతుంది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నుంచి ఇది రావడంతో మార్కెట్‌ని స్థిరంగా కొనసాగుతుంది.

తాజాగా జిమ్నీ కొత్త ఆఫ్-రోడ్ వెర్షన్‌ని (Jimny Offroad) సుజుకి ప్రవేశపెట్టింది. 2024 థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో జిమ్నీ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ని సుజుకి లాంచ్ చేసింది. సుజుకి ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ లిమిటెడ్ ఎడిషన్స్‌ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా సుజుకి రినో ఎడిషన్ (Rhino Edition), జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్‌ (Heritage Edition)ని విడుదల చేసింది.

Suzuki Jimny Offroad Editon Unveiled

ఈ సుజుకి జిమ్నీ ఆఫ్-రోడ్ ఎడిషన్ కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే విక్రయించబడుతుంది. ఇది మోనోటోన్, డ్యూయల్ టోన్ కలర్‌ ఆప్షన్స్‌లో రానుంది. వీటి ధరలు ఎంచుకున్న కలర్‌ ఆప్షన్‌ బట్టి మారుతుంటాయి. ఇక ఇందులో కొన్ని కాస్మెటిక్ మార్పులు మాత్రమే సుజుకి చేసింది. అయితే ఈ ఆఫ్-రోడ్ ఎడిషన్ స్టాండర్డ్ జిమ్నీ నుంచి కాస్త భిన్నగా కనిపించడానికి కొత్త గ్రిల్‌ని కలిగి ఉంది.

ఇక సుజుకి ఫ్రంట్ బంపర్, సైడ్‌లలో ప్రత్యేక అలంకరణను కలిగి ఉంటుంది. డోర్ హ్యాండిల్ ప్రొటెక్టర్, ఫ్యూయల్ మూత కవర్ స్టిక్కర్, స్పేర్ టైర్ కవర్ కోసం 'డెకాల్ 'జిమ్నీ' అని రాసి ఉంటుంది, ఆఫ్-రోడ్ వెర్షన్ లోగో కూడా ప్రత్యేకంగా ఉంటాయి. దీంతో మిగతా వెర్షన్స్‌ కంటే మారుతి జిమ్నీ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Suzuki Jimny

ఈ జిమ్నీ ఆఫ్‌రోడర్‌ వెర్షన్‌లో ఎటువంటి పవర్‌ట్రైన్‌ మార్పులను చేయలేదు. ఈ ఎస్‌యూవీలో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 101 bhp వద్ద 130 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. పైన పేర్కొన్న విధంగా ఈ ఆఫ్-రోడ్ ఎడిషన్ 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అయితే 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కావాలనుకునే వారు జిమ్నీ స్టాండర్డ్ వెర్షన్‌ని ఎంచుకోవచ్చు.

అయితే భారతీయ మార్కెట్‌కి సంబంధించినంత వరకు ఈ జిమ్నీ ఎడిషన్స్ ప్రత్యేకంగా విడుదల కాలేదు. దీంతో ఈ సుజుకి ఆఫ్-రోడ్ ఎడిషన్‌ కూడా భారత మార్కెట్లో విడుదల అవుతుందని ఎవరూ భావించడం లేదు. అంతేకాకుండా భారత్‌లో జిమ్నీ ఆశించిన స్థాయిలో అమ్మకాలను తీసుకురాలేకపోయింది. అక్టోబర్ 2024 లో కేవలం 1,211 యూనిట్ల జిమ్నీ ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడుపోయాయి.

భారతదేశంలో అమ్మకాలను పెంచుకోవడానికి మారుతి సుజుకి ఆఫ్-రోడ్ ఎడిషన్ వంటి ప్రత్యేక ఎడిషన్లను తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. ఇక జూన్ 2023 లో లాంచ్ అయిన ఈ 5-డోర్ జిమ్నీ ధర ప్రస్తుతం రూ .12.74 లక్షల నుంచి రూ .14.95 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంది. దీని కొనుగోలుపై కొన్ని షోరూముల్లో రూ.3.30 లక్షల వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, December 5, 2024, 10:17 [IST]
English summary
Suzuki jimny offroad edition unveiled check cosmetic changes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+