JNCAP క్రాష్ టెస్ట్‌లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
న్యూ జనరేషన్ 'మారుతి స్విఫ్ట్' ఇటీవల 'జపాన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్'(JNCAP) క్రాష్ టెస్ట్‌లో అద్భుతమైన స్కోరింగ్ సాధించిన సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. మారుతి స్విఫ్ట్ స్కోరింగ్, రేటింగ్ వంటి మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.
JNCAPను నిర్వహించే 'నేషనల్ ఎంజెన్సీ ఫార్ ఆటోమోటివ్ సేఫ్టీ అండ్ విక్టిమ్స్ ఎయిడ్' (NASVA) నివేదికల ప్రకారం కొత్త మారుతి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ట్ రేటింగ్ సాధించినట్లు తెలిసింది. ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ భారతీయ విఫణిలో వచ్చే నెల మొదటి వారంలో (2024 మే) లాంచ్ అవుతుంది. ఆ తరువాత మనదేశంలో కూడా ఇది భారత్ NCAP క్రాష్ టెస్ట్ నిర్వహిస్తారు.

జపాన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (JNCAP) క్రాష్ టెస్ట్‌లో మారుతి స్విఫ్ట్ మొత్తం 197 పాయింట్లకు 177.8 పాయింట్లు స్కోర్ చేసింది. కంపెనీ ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ అందించడంలో భాగంగా 'అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం' (ఏడీఏఎస్) ఫీచర్స్ కూడా అందిస్తోంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు మంచి రక్షణ అందిస్తుంది. తద్వారా ప్రమాదాల సంఖ్య బాగా తగ్గే అవకాశం ఉంది.
కొత్త మారుతి స్విఫ్ట్ ADAS కలిగి ఉండటం వల్ల అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ వంటి మరెన్నో ఫీచర్స్ కలిగి ఉంటాయి. స్విఫ్ట్ ప్రివెంటింగ్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ విషయంలో 89 పాయింట్లకు 88.7 పాయింట్లు స్కోర్ చేసింది. అయితే కంపెనీ ఇండియాలో లాంచ్ చేయనున్న ఈ కారులో ADAS అందిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

కొలిజన్ లేదా ఘర్షణలతో కూడిన టెస్ట్‌లో మారుతి స్విఫ్ట్ మొత్తం 100 పాయింట్లకు 81.1 పాయింట్స్ స్కోర్ చేసింది. ఫుల్ ఫ్రంటల్ క్రాష్ టెస్ట్ 55 కిమీ/గం వేగం వద్ద, ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్ 64 కిమీ/గం వేగం వద్ద, సైడ్ ఇంపాక్ట్ క్రాష్ టెస్ట్ 55 కిమీ/గం వేగం వద్ద నిర్వహించారు. ఫ్రంటల్ క్రాష్ టెస్ట్‌లో 12 పాయింట్లకు 9.82 పాయింట్లు సాధించింది.
ఫ్రంట్ ప్యాసింజర్ సేఫ్టీలో 12 పాయింట్లకు 11.22 పాయింట్లు, ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్‌లో 12 పాయింట్లకు 10.4 స్కోర్ చేసింది. వెనుక ప్రయాణికులకు మంచి రక్షణ లేదని (12 పాయింట్లకు 7.66 పాయింట్స్ సాధించింది) తెలిసింది. సైడ్ కొలిజన్ టెస్టులో 12 పాయింట్లకు 11.07 పాయింట్లను స్కోర్ చేసింది. వెనుక ఉన్న ప్రయాణికుల మెడకు సరైన రక్షణ లేదని నిర్దారించబడింది.

జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి స్విఫ్ట్ సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ సాధించింది. కాబట్టి భారతీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త స్విఫ్ట్ కూడా మంచి స్కోరింగ్ సాధిస్తుందని తెలుస్తోంది. గతంలో నిర్వహించిన NCAP టెస్టులో భారతీయ మార్కెట్లో ఉన్న మారుతి స్విఫ్ట్ చాలా తక్కువ స్కోరింగ్ సాధించింది. 2018లో GNCAP టెస్టులో స్విఫ్ట్ 2 స్టార్ రేటింగ్ సాధించింది.
మొదలైన మారుతి స్విఫ్ట్ బుకింగ్స్: 2024 మే మెదటి వారంలో లాంచ్ కానున్న కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ అనధికారికంగా మొదలయ్యాయి. కాబట్టి ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 11000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన మారుతి స్విఫ్ట్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. ఈ కారు ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








