సేఫ్టీలో తేలిపోయిన స్విఫ్ట్‌.. 1 స్టార్‌తో నిరాశ పరిచిన 4th జనరేషన్ కారు.. జనాలకు పట్టుకున్న పరేషాన్‌!

ఇటీవలె గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో మారుతి సుజుకి డిజైర్‌ 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది. అయితే దీనిపై సంబురం ఎక్కువ రోజుల నిలువలేదు. ఈలోపే మారుతి సుజుకికి మరో ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి సుజుకి స్విఫ్ట్‌ అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి పాపులారిటీని కలిగి ఉంది. దీనికి సౌత్‌ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో డిమాండ్‌ ఎక్కువే ఉంది. ప్రస్తుతం దీనిని సుజుకి మార్కెటింగ్‌ చేస్తుంది. ప్రస్తుతం స్విఫ్ట్ 4th జనరేషన్‌ దేశంలో అందుబాటులో ఉంది. దీనిని క్రాష్ టెస్ట్ నిర్వహించలేదు. అయితే ఈ 4th జనరేషన్‌ స్విఫ్ట్‌ పలు దేశాల్లో క్రాష్‌ టెస్ట్‌ని ఎదుర్కోంది.

యూరో NCAP క్రాష్‌ టెస్ట్‌లో స్విఫ్ట్‌ కేవలం 3 స్టార్ రేటింగ్ సాధించింది. అయితే తాజాగా ఆస్ట్రేలియా NCAP (Car Crash testing of Australia and New Zealand)లో సుజుకి స్విఫ్ట్‌ కేవలం 1 స్టార్ మాత్రమే అందుకుంది. ఈ రేటింగ్‌ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వివిధ దేశాలకు తగినట్లుగా కారు నిర్మాణ నాణ్యతను బట్టి ఈ రేంటింగ్స్‌ వస్తున్నాయి.

Suzuki Swift Secured 1 Star Rating

వివిధ దేశాలు ధరను బట్టి తయారీ సంస్థలు క్వాలిటీ కార్లను తయారు చేసి విక్రయిస్తుంటాయి. జపాన్‌లో ప్రారంభ ధర 19,22,800 యెన్స్‌ (దాదాపు రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షలు) కలిగిన ఇదే కారును క్రాష్ టెస్ట్‌ నిర్వహించగా.. 4 స్టార్ రేటింగ్‌ని సాధించింది. అంటే కారు ధర పెరిగే కొద్దీ నిర్మాణ నాణ్యతతో పాటు క్వాలిటీ కూడా పెరుగుతుంది.

అయితే ఆస్ట్రేలియాలో స్విఫ్ట్‌ 4th జనరేషన్‌ ధర భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 13. 50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయినా కానీ ఇది కేవలం 1 స్టార్ మాత్రమే రావడం వల్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కనీసం యూరోపియన్ స్విఫ్ట్‌ వెర్షన్‌తో సమానంగా 3-స్టార్ రేటింగ్ వస్తుందని భావించారు. కానీ కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే వచ్చింది.

Suzuki Swift Secured 1 Star Rating

ఆస్ట్రేలియాలో విక్రయించే కారు పెద్దల సేఫ్టీ టెస్ట్‌లో 40 స్కోర్‌కి 18.88 మార్కులు, పిల్లల రక్షణలో 49 మార్కులకు గాను 29.24 మార్కులు సాధించింది. ఇక పాదచారుల సేఫ్టీలో 63 మార్కులకు గాను 48.40 స్కోర్‌ని, సేఫ్టీ అసిస్టెన్స్ టెస్ట్‌లో 18కి 9.78 మార్కులు మాత్రమే స్కోర్‌ చేసింది. ఈ స్కోర్లపై ఆస్ట్రేలియన్ NCAP సీఈవో ఆందోళన వ్యక్తం చేశారు.

వివిధ దేశాలలో విక్రయించే సుజుకి కార్లు అన్నీ ఒకేలా కనిపించినప్పటికీ.. దేశాన్ని బట్టి సేఫ్టీ ఫీచర్లలో మార్పులు కచ్చితంగా ఉంటాయని ఆయన అన్నారు. ఇది చాలామంది కొనుగోలుదారులు గమనించరని ఆయన పేర్కొన్నారు. అందుకే ఢిఫరెంట్‌ రేటింగ్‌ని పొందుతాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే భారత్‌లో ఎంతో పాపులారిటీని కలిగి ఉన్న కారు విదేశాల్లో సేఫ్టీ టెస్ట్‌లో తేలిపోవడం చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ వ్యాఖ్య: భారత్‌లో కొనుగోలుకి అందుబాటులో ఉన్న స్విఫ్ట్ 4th జనరేషన్‌ స్విఫ్ట్ ఇంకా క్రాష్‌ టెస్ట్‌ని ఎదుర్కొలేదు. కానీ డిజైర్ మాదిరిగానే స్విఫ్ట్‌ కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందుతుందని మారుతి సుజుకి ధీమాగా ఉంది. భారత్‌ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌ తర్వాత ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించనుంది. అప్పటి వరకు విదేశీ సేఫ్టీ రేటింగ్‌ని చూసి జనాలు లేనిపోని అపోహలు పెట్టుకోవద్దు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, December 13, 2024, 19:06 [IST]
English summary
Suzuki swift secured 1 star rating in australian ncap crash test
Read more on: #suzuki #crash test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+