Switch IeV3 and IeV4 Full Review Video స్విఛ్ ఎలక్ట్రిక్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ మెప్పించాయా?

2024 స్విచ్ IeV4 స్విచ్ IeV3 ఎలక్ట్రిక్ కమర్షియల్‌ హెహికిల్స్‌ని మా డ్రైవ్‌స్పార్క్ టీమ్‌ చెన్నైలోని అశోక్ లేలాండ్ టెక్నికల్ సెంటర్‌లో పరీక్షించింది. ఈ వెహికిల్స్‌ని హై-స్పీడ్ ట్రాక్‌, గ్రేడియంట్ హ్యాండ్లింగ్ మరియు ఓపెన్ గ్రౌండ్ సామర్థ్యాలలో రివ్యూ చేశాము. ఈ వెహికిల్స్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు, డ్రైవింగ్ ఇంప్రెషన్‌లకు సంబంధించిన పూర్తి రివ్యూ మీ కోసం..

స్విచ్ IeV3 40 kW మోటార్‌తో 190 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. IeV4 మరింత స్ట్రాంగ్‌ 60 kW మోటార్‌తో 230 Nm టార్క్‌ను అందిస్తుంది. పేలోడ్ కెపాసిటీలు IeV3కి 1200 కిలోలు మరియు IeV4కి 1700 కిలోలు కలిగి ఉన్నాయి. హై-స్పీడ్ ట్రాక్‌లో రెండు వాహనాలు బాగా పనిచేశాయి. IeV4 60km/h వేగంతో కూడా అద్భుతమైన స్థిరత్వాన్ని చూపింది. IeV3 కొంత బాడీ రోల్‌ని ప్రదర్శించింది.

ఓపెన్ గ్రౌండ్‌లో పరీక్షించినప్పుడు, రెండు మోడల్‌లు తమ పనితీరుతో ఆకట్టుకున్నాయి. IeV4 యొక్క టైట్ టర్నింగ్ రేడియస్ మరియు రెస్పాన్సివ్ స్టీరింగ్ ప్రత్యేకంగా నిలిచాయి. గ్రేడియంట్ టెస్ట్‌లోనూ రెండు మోడళ్లు బాగా పనిచేశాయి. రెండు మోడళ్లను పోల్చి చూస్తే, Switch IeV4 ఎలక్ట్రిక్ కమర్షియల్ స్థిరత్వం, కంఫర్ట్‌, ఫర్ఫామెన్స్‌లో అత్యుత్తమంగా ఉంటుంది. దీని ధర రూ. 15.3 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఇక స్విచ్ IeV3 ధర రూ. 12.33 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు IeV4తో పోలిస్తే కొంచెం తక్కువ ఫర్ఫామెన్స్‌ని కలిగి ఉన్నప్పటికీ అనేక అవసరాల కోసం ఇది సరైన ఆప్షన్‌గా ఉంది. ఈ రెండు స్విచ్ IeV3 మరియు IeV4 ఎలక్ట్రిక్ వాహనాలు రెండూ ఢిఫరెండ్‌ డిజైన్‌లు, ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లు, మెరుగైన పనితీరు సామర్థ్యాలతో కమర్షియల్‌ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి.

Switch IeV3 and IeV4 Full Review Video

More from DriveSpark

Article Published On: Thursday, August 22, 2024, 16:23 [IST]
English summary
Switch iev3 and iev4 review video driving impressions specs features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+