ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బస్సుల్లో 5 కెమెరాలు, అధునాతన ఫీచర్లు.. బస్సు అంటే ఇలా ఉండాలి!

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య విరివిగా పెరుగుతోంది. అందులో భాగంగానే తాజాగా స్కూటర్లు, కార్లు, ఇతర వాణిజ్య వాహనాలు మార్కెట్‌లో పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే స్విచ్ మొబిలిటీ (Switch Mobility) ఎలక్ట్రిక్ బస్సులను విడుదల చేయడంలో ముందుంది. తాజాగా ఈ కంపెనీ ఐరోపా దేశాల్లోనూ తన మార్కెట్‌ని విస్తరించేందుకు కొత్త బస్సులను లాంచ్‌ చేసింది. ఈ సంస్థ తీసుకువచ్చిన కొత్త బస్సులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఇవే కాకుండా భారత్‌లో చాలా వరకు ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటితో పోలిస్తే కొత్త స్విచ్ ఎలక్ట్రిక్ బస్సులు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో వస్తాయి. తాజాగా విడుదలైన ఆ అధునాతన బస్సుల వివరాలు ఈ కథనంలో..

స్విచ్ మొబిలిటీ భారత్‌లో హిందూజా గ్రూప్‌లో భాగంగా ఉన్న అశోక్ లేలాండ్‌కి అనుబంధ సంస్థగా ఉంది. ఇప్పటికే మార్కెట్‌లో ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు పాపులారిటినీ సాధించాయి. తాజాగా స్విచ్ మొబిలిటీ మరో రెండు అధునాతం కొత్త ఎలక్ట్రిక్ బస్సులను విడుదల చేసింది. అయితే వీటి బస్సుల ధరలను మాత్రం ప్రకటించలేదు. ఈ బస్సుకి సంబంధించిన ఇతర అన్నీ అంశాలను వెల్లడించారు.

Switch Mobility Reveals EiV12 and E1 Electric Buses

ఈ బస్సులను స్విచ్ మొబిలిటీ ఈఐవీ12 (EiV 12), ఈ1 (E1) అనే పేరుతో బస్సులను విడుదల చేసింది. ఇందులో ఈఐవీ 12 పూర్తిగా భారతదేశానికి సంబంధించిన బస్సు కాగా.. ఈ1 బస్సు యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ముఖ్యంగా ఈ బస్సు విడుదల ద్వారా మధ్యప్రాచ్యంలో తన ఆధిపత్యాన్ని విస్తరించాలని స్విచ్ మొబిలిటీ భావిస్తోంది. అందుకు తగినట్లుగా రూట్‌ మ్యాప్‌ని ప్లాన్‌ చేస్తోంది.

ఈ రెండు ఎలక్ట్రిక్ బస్సులు లోలోయింగ్ సిటీ బస్సులు (కేవలం నగర వినియోగానికి మాత్రమే పనికి వస్తాయి). వీటినికి ఎక్కువగా రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపయోగించవచ్చు. ఇవి దూర ప్రయాణాలకు అనుకూలం కాదు. ఈ ఈఐవీ12 ఎలక్ట్రిక్ బస్సును భారతీయ రహదారులు, ఇతర రవాణాకు అనుగుణంగా రూపొందించారు. ఈ బస్సు ఛాసిస్‌లో 400 కిలోవాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలను అమర్చారు.

Switch Mobility Reveals E1 Electric Bus for Europe

కావున ఇవి భారీ రేంజ్‌ని అందిస్తాయి. ఎలక్ట్రిక్ బస్సుల ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ పి హిందూజా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా యూరప్ మార్కెట్‌ కోసం స్విచ్ ఈ1 లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బస్సులను ఈ కార్యక్రమంలో నేరుగా ప్రవేశపెట్టలేదు. కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటి డిజైన్‌, ఇతర అంశాలను వెల్లడించారు.

కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి. స్విచ్ EiV 12 ఎలక్ట్రిక్ బస్సు వరల్డ్‌ క్లాస్‌ ఫర్ఫామెన్స్‌, సేఫ్టీ, కంఫర్ట్‌ని అందిస్తుంది. ప్రస్తుతం దేశంలో ప్రయాణీకుల సౌకర్యం కోసం బస్సులను అందరికీ నచ్చే విధంగా రూపొందిస్తున్నారు. ఈ కొత్త బస్సులో గరిష్టంగా 39 మంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా బస్సులో దివ్యాంగులు వీల్ చైర్లతో లోపలికి ప్రవేశించే సౌకర్యం ఉంది.

Switch Mobility Reveals EiV12 Electric Buses

ఇందులో మహిళలకు ప్రత్యేకంగా ఐదు సీట్లను కేటాయించారు. ప్రయాణికుల భద్రత కోసం ఈ ఎలక్ట్రిక్ బస్సులో 5 సీసీ కెమెరాలతో కూడిన పనోరమిక్ గ్లాస్ ఏరియాను అందించారు. బస్సులో ఏర్పాటు చేసిన ION టెలిమాటిక్స్ సిస్టమ్ బస్సులో లోపాలను వెంటనే గుర్తిస్తుంది. స్విచ్ EiV 12 ఎలక్ట్రిక్ బస్సు క్విక్ ఛార్జింగ్ కోసం బస్సు వెనుక భాగంలో డ్యూయల్ పాయింట్ ఛార్జింగ్‌తో IP67 సర్టిఫికేట్ పొందింది.

More from DriveSpark

Article Published On: Thursday, December 12, 2024, 10:15 [IST]
English summary
Switch mobility unveils eiv12 and e1 electric buses for urban usages
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+