టాటా ఆల్ట్రోజ్ కొత్త వేరియంట్స్‌లో బోలెడన్నీ ఫీచర్లు..
టాటా సంస్థ నుంచి జూన్ 7 వ తేదీన ఆల్ట్రోజ్ రేసర్ హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసింది. తాజాగా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ లైనప్‌లో రెండు సరికొత్త వేరియంట్లను కూడా విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన వేరియంట్లు ప్రత్యర్థి కార్లకు గట్టి పోటీని ఇవ్వనున్నాయి. టాటా ఆల్ట్రోజ్ XZ LUX మరియు XZ+S LUX పేరున ఈ రెండు వేరియంట్లను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది. దీంతో పాటు టాప్-స్పెక్ వేరియంట్ XZ+ OS మునుపటి కంటే ఎక్కువ ఫీచర్లను అందించనుంది.
టాటా ఆల్ట్రోజ్ XZ LUX వేరియంట్ ధర రూ.9 లక్షలుగా ఉంది. ఆల్ట్రోజ్ XZ+S LUX వేరియంట్ ధర రూ .9.65 లక్షలుగా.. ఆల్ట్రోజ్ XZ+ OS వేరియంట్ ధర రూ .9.99 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. పైన తెలిపిన ధరలన్నీ ఎక్స్-షోరూమ్‌కి సంబంధించినవి. టాప్ స్పెక్ XZ+ OS ధర ఇప్పుడున్న ధర కంటే రూ. 34,000కు పెంచింది. దీనిలో సరికొత్త ఫీచర్లు జోడించడంతో ధర పెంచినట్లు సంస్థ వెల్లడించింది.

టాటా ఆల్ట్రోజ్ కొత్త వేరియంట్స్: కొత్త టాటా ఆల్ట్రోజ్ XZ LUXలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 360-డిగ్రీ కెమెరా మరియు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి. ఇక ప్రీమియం ఆల్ట్రోజ్ XZ+S మరియు XZ+OSలో అదనంగా మరికొన్ని ఫీచర్లను జోడించారు. ఈ రెండింటిలో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను అందించింది. వీటికి అదనంగా రూ. 65,000 చెల్లించాల్సి ఉంటుంది.
టాటా ఆల్ట్రోజ్ XZ+ OS వేరియంట్ ICT (ఇన్‌కార్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ) మరియు ఎయిర్ ప్యూరిఫైయర్‌తో అందించబడుతుంది. దీంతో దీని ధర మునుపటి కంటే రూ .34,000 పెంచింది. తాజాగా విడుదల చేసిన వేరియంట్స్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ డీసీటీ, డీజిల్, సీఎన్జీ పవర్ట్రెయిన్లలో అందుబాటులో ఉండున్నాయి.

ఆల్ట్రోజ్ XZ+ OS కేవలం పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రమే అందించనున్నారు. కొత్తగా లాంచ్ చేసిన టాటా ఆల్ట్రోజ్ కొత్త రేసింగ్-కలర్ పెయింట్ థీమ్‌ని కలిగి ఉంది. ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ ఆరెంజ్ మరియు బ్లాక్ థీమ్స్‌తో వస్తుంది. బానెట్ మరియు పైకప్పుపై వైట్ రేసింగ్ స్ట్రిప్స్ కారుకు స్పోర్టీ లుక్ అందిస్తాయి. ఇది మరో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.
కొత్త ఆల్ట్రోజ్ వేరియంట్స్ అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్ మరియు ప్యూర్ గ్రే అనే మూడు రంగులలో లభించనున్నాయి. ఇంటీరియర్‌లో మాత్రం అదే ఆరెంజ్ బ్లాక్ థీమ్ ను ఉపయోగించారు. ఆరెంజ్ కలర్ థీమ్‌ని హైలెట్ చేస్తూ ఏసీ వెంట్స్, సెంటర్ కన్సోల్ లో చూడొచ్చు. సీట్లలో ఆరెంజ్ మరియు వైట్ కలర్ రేసింగ్ స్ట్రిప్స్‌ని గమనించవచ్చు. ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, లెదర్ స్టీరింగ్ వీల్ వంటివి స్పోర్టీగా కనిపిస్తాయి.
కొత్తగా విడుదల చేసిన వేరియంట్స్ హ్యుందాయ్ ఐ20, మారుతి బాలెనో, టయోటా గ్లాంజా వంటి మోడళ్లకు ఆల్ట్రోజ్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక ఆ కంపెనీ నుంచి కొత్తగా విడుదల చేసిన కొత్త ఆల్ట్రోజ్ రేసర్ ఐ20 ఎన్ లైన్ మరియు మారుతి ఫ్రాంక్స్‌కి గట్టి సవాల్‌ని విసురుతోంది. ఈ కారుని ఆకర్షణీయమైన ధరలో ఎక్కువ ఫీచర్లు అందిస్తూ ఆ సంస్థ విడుదల చేసింది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








