రతన్ టాటా బతికి ఉంటే అసలు ఇలా జరిగి ఉండేదా..? లేని లోటు కచ్చితంగా కనిపిస్తుందిగా!

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్(TATA MOTORS) ఈ పండగల సమయంలో మంచి అమ్మకాలను నమోదు చేసింది. దాని అన్ని మోడళ్లు కూడా అక్టోబర్ నెలలో ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఇతర కంపెనీలకు విక్రయాల పరంగా ఇది గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఒక మోడల్ మాత్రం అనుకున్నంత లక్ష్యాన్ని సాధించలేదు. ఇది ఇండియాలో మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న కారుగా ఉన్నప్పటికి వినియోగదారులు అక్టోబర్ నెలలో తక్కువగా కొనుగోలు చేశారు. ఆ మోడల్ పేరే 'టాటా ఆల్ట్రోజ్(tata altroz)'. ఇది ఒక హ్యాచ్‌బ్యాక్. చాలా మందికి ఒక ఫెవరేట్ కారు. అయినప్పటికీ కూడా విక్రయాలు ఆశించినంతగా లేవు. తాజాగా విడుదల అయిన డేటా ప్రకారం, టాటా ఆల్ట్రోజ్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో కేవలం 2,642 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. ఇది 2023 ఏడాది అక్టోబర్ నెలలో 5,984 యూనిట్లుగా ఉంది.

మొత్తంగా చూసినట్లయితే ఇది దాదాపు 56 శాతం తగ్గుదలను చూపిస్తుంది. మే నెల వరకు కూడా విక్రయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. గత ఆరు నెలల్లో ఇదే అత్యల్ప విక్రయాల సంఖ్య. ఈ ఏడాది మేలో టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు 4,983 యూనిట్లుగా ఉన్నాయి. ఈ నెల నుంచి వినియోగదారుల నంచి డిమాండ్ తగ్గుముఖం పడుతూ వచ్చింది.

Tata Altroz October 2024 Sales Down

డేటా ప్రకారం, జూన్ నెలలో 3,937 యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, ఆ తర్వాత జులైలో 3,444కు తగ్గిపోగా, ఆగస్టు నెలలో 3,031 యూనిట్లు, పండగల సీజన్ మొదలైన సెప్టెంబర్‌లో 2,758 టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు నమోదయ్యయాయి. ఈ డేటాను చూసినట్లయితే ప్రజల్లో ఈ మోడల్ పట్ల ఆదరణ తగ్గినట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఈ మోడల్‌కు గతంలో భారీ డిమాండ్ ఉండగా, ఇప్పుడు ఆదరణను కోల్పొతుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం కూడా ఉంది. మామూలుగా అయితే అక్టోబర్ నెల అంతా కూడా పండగలే ఉన్నాయి. ఫెస్టివల్ సమయంలో కార్లను కొనుగోలు చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ఈ టైంలోనే ఆల్ట్రోజ్ బాగా అమ్మకాలు పెరుగుతాయని టాటా మోటార్స్ అధికారులతో పాటు మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేశాయి. అయితే అవన్నీ కూడా తలకిందులు అయ్యాయి.

Tata Altroz Sales Units

ఆల్ట్రోజ్ అమ్మకాలు భారీగా తగ్గిపోవడంపై టాటా అధికారులు తొందరగా మేలుకోని చర్యలు తీసుకోకపోతే ఇది మరింత క్షీణతను ఎదుర్కొనే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే రతన్ టాటా మరణించిన తర్వాత ఆల్ట్రోజ్ అమ్మకాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా ఇతర కొన్ని టాటా మోడళ్లు కూడా అమ్మకాల పరంగా అక్టోబర్‌లో క్షీణతను ఎదుర్కొన్నాయి. రతన్ టాటా ఉండి ఉంటే ఇలా జరగకపోవచ్చు అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం ప్రారంభ ధర రూ. 6.65 లక్షలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని టాప్ వేరియంట్ ధర రూ.11.35 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రయాణికుల భద్రత పరంగా అత్యంత నమ్మకమైన టాటా నుంచి వచ్చిన ఆల్ట్రోజ్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.

ఈ హ్యాచ్‌బ్యాక్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. దీనిలో ప్రయాణికుల కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు అందించారు. అదనంగా మరిన్ని భద్రతా ఫీచర్లు, చుట్టు ప్రక్కల చూడటానికి 360 డిగ్రీల సరౌండ్ కెమెరా, ఇంకా రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. లోపల క్యాబిన్ చాలా అందంగా ఉంటుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ ఆప్షన్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 22, 2024, 11:34 [IST]
English summary
Tata altroz october 2024 sales down 2642 units here full details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+