కొత్తగా కారు కొనేవారికి ఈ టాటా కారు బెస్ట్ ఆప్షన్.. కచ్చితంగా ఇంప్రెస్స్‌ అవుతారు!

టాటా మోటార్స్‌ నుంచి విడుదలయ్యే కార్లకు దేశంలో మంచి డిమాండ్‌ ఉంది. హై సేఫ్టీ, ఎక్కువ ఫీచర్లు, అధిక మైలేజీ మంచి సర్వీస్‌ అందిస్తుండటంతో ఈ కార్లను జనాలు విపరీతంగా కొంటున్నారు. అందువల్ల దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన వాహన తయారీదారులలో ఒకటి టాటా ఎదిగింది. ప్రజలకు అందుబాటు ధరలో మంచి కార్లను విడుదల చేస్తుంది. తాజాగా ఆ కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్ రేసర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కి మంచి డిమాండ్ పెరుగుతుంది. జూన్‌ 2024లో ఈ అప్‌డేటెడ్‌ కారుని ఈ కారును టాటా విడుదల చేసింది. ఈ కారు కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్‌ ఆప్షన్‌గా ఉండనుంది. ఈ కారు R1, R2, R3 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారుకి సంబంధించిన ధర మరియు స్పెసిఫికేషన్ల వివరాలు ఈ కథనంలో మీ కోసం..

ఇంజిన్‌ & ఫర్ఫామెన్స్: ఈ ఆల్ట్రోజ్ రేసర్ హ్యాచ్‌బ్యాక్ నెక్సాన్‌లో వినియోగించే 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 120 ps శక్తిని మరియు 170 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 11.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

Tata-Altroz-Racer-Price

ఫీచర్లు: ఈ కారులో కస్టమర్లను ఆకర్షించే అనేక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 7 ఇంచెస్‌ ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్‌ (R2,R3 Variants), ఆటో ఏసీ, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్: సాధారణంగా టాటా కార్లు సేఫ్టీకి అధిక ప్రాధాన్యతను ఇస్తాయి. ఇక ఈ టాటా ఆల్ట్రోజ్ రేసర్‌లోనూ ప్రయాణికులకు సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్‌ అందించారు. దీనితో పాటు ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), బ్లైండ్ వ్యూ మానిటర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీల కెమెరా వంటి ఇంకా మరెన్నో ప్రత్యేకతలున్నాయి.

Tata-Altroz-Racer-Mileage

ఈ కారు అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, ప్యూర్ గ్రే అనే మూడు డ్యూయల్ టోన్ కలర్‌ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ కారులో సులభంగా ఐదుగురు కూర్చుని హాయిగా వెల్లవచ్చు. ఇక లాంగ్‌ జర్నీ, టూరింగ్‌లకు వెళ్లే సమయంలో ఈ కారులో ఎక్కువ లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇందుకోసం 345 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్‌ ఉంది. ఈ కారు లీటర్‌కి 19.33 కి.మీ మైలేజీ ఇస్తుంది.

ఈ కారు హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌, రెనాల్ట్‌ కిగర్‌, నిస్నాన్‌ మాగ్నైట్‌లతో పాటు మారుతి ఫ్రాంక్స్‌, టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ వంటి వాటికి నేరుగా పోటీని ఇస్తుంది. అత్యాధునిక ఫీచర్లు కలిగిన టాటా ఆల్ట్రోజ్‌ ధర రూ .9.49 లక్షల నుంచి రూ .10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్తగా కారు కొనాలనుకునేవారికి టాటా ఆల్ట్రోజ్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Tata-Altroz-Racer-Interior

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 5, 2024, 10:46 [IST]
English summary
Tata altroz racer best option for new buyers check specifications and price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+