కొత్త కారు కోసం వేచి చూస్తున్నారా?.. ఇదిగో టాటా రేసర్ - బుక్ చేసుకోండి

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) ఎప్పుడు లాంచ్ చేస్తుందా అని ఎదురు చూస్తున్న 'ఆల్ట్రోజ్ రేసర్' (Altroz Racer) ఈ నెల 7న అధికారికంగా మార్కెట్లో విడుదలకానుంది. అయితే కంపెనీ అంతకంటే ముందు ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో భారతీయ విఫణలో లాంచ్ కానున్న ఈ కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్.. ఇప్పటీకే పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించింది. కాబట్టి ఇప్పటికే ఈ కారు యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు లీక్ అయ్యాయి. ఈ కారు మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అవి ఆర్1, ఆర్2 మరియు ఆర్3. రేసర్ ఆర్1 వేరియంట్ స్టాండర్డ్ ఆల్ట్రోజ్ టాప్ స్పెక్ XZ+ కంటే మెరుగ్గా ఉంటుందని సమాచారం.

Tata Altroz Racer Teased

టాటా ఆల్ట్రోజ్ బేస్ మోడల్ ఆర్1 నాలుగు నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ మరియు స్పోర్టియర్ ఎగ్జాస్ట్ వంటి కిట్ పొందుతుంది. ఇందులో 4 ఇంచెస్ సెమీ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. సన్‌రూఫ్ ఉండదు. డిజైన్ పరంగా మూడు వేరియంట్లు దాదాపు ఒకేవిధంగా ఉంటాయి. కాబట్టి చూడగానే వేరియంట్లను గుర్తించడం కష్టమైన విషయమనే చెప్పాలి.

ఆర్2 వేరియంట్ 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీ కెమెరా మరియు బ్లైండ్ స్పాట్ మానిటర్‌ వంటివి పొందుతుంది. ఆర్3 వేరియంట్ టాటా యొక్క కార్ కనెక్ట్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి వాటితో పాటు కూల్డ్ సీట్లు, బ్లైండ్ సృస్ట్ మానిటరింగ్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా వంటి సెగ్మెంట్ ఫస్ట్ కిట్ పొందుతుంది.

Tata Altroz Racer Badge

టాటా ఆల్ట్రోజ్ రేసర్ నెక్సాన్ యొక్క 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ పొందుతుంది. ఇంజిన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. అయితే ఇంజిన్‌కు సంబంధించిన అధికారిక వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. మొత్తం మీద ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ 2024 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన కారు మాదిరిగానే ఉంటుంది. ఇది 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇది గతంలో చూసిన విధంగా అటామిక్ ఆరెంజ్, ఎవెన్యూ వైట్ మరియు ప్యూర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం. ఇవన్నీ బోనెట్ మరియు రూఫ్‌పై కాంట్రాస్ట్ బ్లాక్ ఫినిషింగ్ అండ్ వైట్ రేసింగ్ స్ట్రిప్స్‌తో వస్తాయి.

Tata Altroz Racer

టాటా ఆల్ట్రోజ్ రేసర్ యొక్క ఇంటీరియర్ కూడా దాదాపు బయట పెయింట్ స్కీమ్ మాదిరిగానే ఉంటుంది. ఈ కలర్ ఏసీ వెంట్స్ చుట్టూ, సెంటర్ కన్సోల్, గేర్‌బాక్స్ మరియు సీట్ అపోల్స్ట్రే వంటి వాటి చుట్టూ కూడా ఉండటం చూడవచ్చు. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు ధర రూ. 9.20 లక్షల నుంచి రూ. 10.10 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నాము. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 4, 2024, 9:52 [IST]
English summary
Tata altroz racer bookings open in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+