ఏడాదిన్నర నిరీక్షణకు తెర.. టాటా ఆల్ట్రోజ్ రేసర్ లాంచ్.. ప్రారంభ ధర రూ. 9.49 లక్షలు మాత్రమే
టాటా ఆల్ట్రోజ్ రేసర్ హ్యాచ్‌బ్యాక్ కారుని ఆ సంస్థ నేడు (జూన్-7)న అధికారికంగా విడుదల చేసింది. 2023 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ఈ కారుని టాటా మోటార్స్ ప్రదర్శించింది. ఇదే కారుని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో సైతం కంపెనీ షో చేసింది. ఆవిష్కరణ నుంచి ఈ కారుపై టాటా కస్టమర్లు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఆవిష్కరణ తర్వాత ఎక్కువ రోజులు ఈ కారు కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ సరికొత్త కారుపై మార్కెట్‌లోనూ భారీ అంచనాలు పెరిగాయి. తాజా టాటా లైనప్‌లోని ఆల్ట్రోజ్ రేసర్ కారులో కొత్తగా ఏముంది.? దాని ప్రత్యేకతలు, ఫీచర్లు, ఇంజిన్ ఫర్ఫామెన్స్ వివరాలు మీకోసం..
స్టాండర్డ్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ కారు పూర్తిగా ప్రీమియం అప్‌గ్రేడ్స్‌తో పాటు మరింత శక్తివంతమైన ఇంజిన్‌ని కలిగి ఉంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో తీసుకువచ్చింది. ఈ కారు మూడు కలర్ ఆప్షన్‌లలో లభించనుంది. అవి ఆరెంజ్, ప్యూర్ గ్రే, అవెన్యూ వైట్ కలర్స్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది.

ఇంజిన్: టాటా ఆల్ట్రోజ్ రేసర్ టాటా నెక్సాన్‌లో వినియోగించిన 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 118 bhp వద్ద 170nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ ఆప్షన్‌తో వస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్‌లో అందుబాటులో లేదు. ఈ మోడల్ స్టాండర్డ్ వేరియంట్ల కంటే స్పోర్టీ ప్యాక్‌తో బెస్ట్ ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది.
ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లు, రెడ్ మరియు వైట్ స్ట్రిప్‌తో కూడిన లెదర్ సీట్లు, వెనుక ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 10.25 ఇంచెస్‌ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ TFT ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా, వాయిస్ యాక్టివేటెడ్ సన్‌రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ ప్రధానంగా ఈ సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ i20 N Line తో పోటీపడుతుంది N Line కారు మోడల్ ఎంట్రీ లెవల్ ట్రిమ్‌లో కంటే టాటా ఆల్ట్రోజ్ ధర రూ .50,000 తక్కువతో లాంచ్ అయ్యింది. I20 ఎన్ లైన్ ధరలు రూ .10 లక్షలు నుంచి రూ .12.52 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
కొత్త టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 9.49 లక్షల నుంచి 10.99 లక్షల మధ్య ఉండనున్నాయి. రోజువారీ డ్రైవ్‌లో ప్రయాణికులకు మంచి ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశ్యంతో ఆల్ట్రోజ్ రేసర్‌ని తీసుకువచ్చినట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాత్స తెలిపారు. లీడింగ్ ఫీచర్లు మరియు టెక్-ఫస్ట్ విధానంతో ఫ్యాషన్-ఫార్వర్డ్‌తో కూడిన కారును నడపాలనుకునే వారికి రేసర్ మంచి ఆప్షన్ అని ఆయన చెప్పారు.

ఈ కారుకి సంబంధించిన బుకింగ్స్‌ని సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారుని బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా హ్యుందాయ్ లైనప్‌లోని కార్లకు ఈ సరికొత్త కారు సవాల్ విసురుతోంది. దాదాపు ఏడాదిన్నర పాటు ఈ కారు కోసం టాటా కార్ల ప్రియులు వెయిట్ చేయాల్సి వచ్చింది. తాజాగా ఈ కారు మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








