రేసుగుర్రంలా వస్తున్న Tata Racer.. టీజర్ చూసారా!

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్' (Tata Motor) త్వరలో లాంచ్ చేయనున్న కొత్త 'ఆల్ట్రోజ్ రేసర్' (Altroz Racer) యొక్క టీజర్ లాంచ్ చేసింది. టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క ఈ స్పోర్టియర్ వెర్షన్ స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కంటే మరింత శక్తివంతమైన ఇంజన్, ప్రత్యేకమైన డిజైన్ పొంది ఉంటుందని ఈ టీజర్ ద్వారా అవగతమవుతోంది. కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండవచ్చు? ఫీచర్స్ ఏంటి, ఇంజిన్ వివరాలు, అంచనా ధర వంటి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా మోటార్స్ తన కొత్త హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ రేసర్ కారును వచ్చే నెలలో లాంచ్ చేసేస్ అవకాశం ఉంది. అయితే ఏ రోజు లాంచ్ అవుతుందనే అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ కారు చూడగానే ఆకర్శించబడే డిజైన్ పొందుతుంది. కాబట్టి తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము. ఇది ఓ ప్రత్యేకమైన ఆరంజ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్‌ పొంది ఉండటం ఇక్కడ గమనించవచ్చు.

Tata Altroz Racer Teased

టాటా ఆల్ట్రోజ్ రేసర్ మోడల్ స్టాండర్డ్ డ్యూయల్ టోన్ ఆల్ట్రోజ్‌లో కనిపించే విధంగా బ్లాక్ ట్రిమ్ రూఫ్, వింగ్ మిర్రర్స్ మరియు విండో లైన్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇందులో పిల్లర్స్‌ను కూడా కవర్ చేస్తుంది. సైడ్ ప్రొఫైల్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అయితే 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన కారు బోనెట్‌పై తెల్లటి రేసింగ్ చారలు కనిపించాయి.

త్వరలో విడుదలకానున్న కొత్త ఆల్ట్రోజ్ రేసర్ మోడల్ ప్రత్యేకంగా కనిపించడానికి 'రేసర్' బ్యాడ్జ్‌లు మరియు కొద్దిగా రిఫ్రెష్ చేయబడిన గ్రిల్‌ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఇది స్పోర్టియర్‌గా కనిపించడానికి కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కూడా పొందుతుందని సమాచారం. మొత్తం మీద రాబోయే కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ తప్పకుండా చూపరులను ఆకట్టుకుంటుందని టీజర్ ద్వారా అవగతమవుతోంది.

Tata Altroz Racer

ఆల్ట్రోజ్ రేసర్ క్యాబిన్ దాని స్పోర్టియర్ ఎక్ట్సీరియర్‌ను ప్రతిబింబించే కాస్మెటిక్ మార్పులను పొందే అవకాశం ఉంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది డ్యాష్‌బోర్డ్ మరియు కొత్త అపోల్స్ట్రే. టాటా ఆల్ట్రోజ్ రేసర్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ పొందుతుందని సమాచారం. ఇందులో 10.25-ఇంచెస్ టచ్‌స్క్రీన్, సెగ్మెంట్ ఫస్ట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, హెడ్స్ అప్ డిస్‌ప్లే మరియు వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ ఉండవచ్చు.

ఇంజిన్ విషయానికి వస్తే.. టాటా ఆల్ట్రోజ్ 110 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే స్టాండర్డ్ ఆల్ట్రోజ్ ఐటర్బో మాదిరిగా కాకుండా.. నెక్సాన్ కారులో లభించే 1.2-లీటర్ యూనిట్ పొందుతుందని సమాచారం. ఇది 120 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లెక్కన ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే 10 హార్స్ పవర్, 30 Nm టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం.

Tata Altroz Racer Side Design

భారతీయ మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ రేసర్ లాంచ్ అయినా తరువాత.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. ఆల్ట్రోజ్ రేసర్ ధర రూ. 9.20 లక్షల నుంచి రూ. 10.10 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉండే అవకాశం ఉంటుందని అంచనా. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, లాంచ్ సమయంలో వెల్లడవుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 28, 2024, 18:17 [IST]
English summary
Tata altroz racer teased ahead of launch in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+