ఈ 5-స్టార్ సేఫ్టీ కారుని ఒక్క నెలలోనే 5000 మంది కొనేశారు.. అస్సలు తగ్గేదెలే అంటున్న కస్టమర్లు!
సెప్టెంబర్ 2 న భారత్‌లో టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్ (Tata Curvv ICE Version) అధికారికంగా లాంచ్ అయ్యింది. ఈ కారుని తీసుకువస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచే ఈ కూపే స్టైల్ ఎస్‌యూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగినట్లుగానే అమ్మకాల్లోనూ ఈ కారు దుమ్మురేపుతోంది. విడుదలైన మొదటి నెలలోనే ఈ ఎస్‌యూవీని 4,763 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. మొదటి నెలలో పంచ్, నెక్సాన్ మోడళ్ల తర్వాత అత్యధిక సేల్స్ రాబట్టిన మూడవ టాటా కారుగా నిలిచింది. భారతీయ కస్టమర్లలో ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌కి దీని సేల్స్ అద్దం పడుతున్నాయి. ఈ కూపే స్టైల్ ఎస్‌యూవీలోని ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్ వివరాలు మీకోసం..
ఈ సరికొత్త టాటా కర్వ్ ఇంటీరియర్ మిమ్మల్నీ ఆధునిక ఫీచర్లతో స్వాగతం పలుకుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మెరుగైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.

ఈ టాటా కర్వ్ కస్టమర్ల అభిరుచిలకు తగినట్లుగా మూడు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులో 1.2-లీటర్ జిడిఐ పెట్రోల్ ఇంజిన్ 125 bhp పవర్, 225 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మరో 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 120 bhp వద్ద 170 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 118 bhp వద్ద 260 nm టార్క్‌ని విడుదల చేస్తుంది.
ఈ కారుని కస్టమర్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో ఎంచుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల డ్రైవర్లు వారి డ్రైవింగ్ శైలికి తగినట్లుగా సరైన గేర్ బాక్స్‌ని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇక ఇందులోని ఎయిర్ ప్యూరిఫైయర్ క్యాబిన్‌లోకి శుభ్రమైన గాలిని విడుదల చేస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, టాప్ మౌంటెడ్ లైట్స్ కారు ఇంటీరియర్ అందాన్ని మరింత పెంచుతాయి.

ఇక ఇందులోని సేఫ్టీ కోసం ఈ ఎస్‌యూవీలో 360 డిగ్రీల కెమెరా, లెవల్ -2 ఏడీఏఎస్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ ఫీచర్లు రోడ్ అసిస్టెన్స్, సురక్షిత ప్రయాణాన్ని ప్రయాణీకులకు అందిస్తాయి. ఇతర టాటా కార్ల మాదిరిగానే, ఈ కారు కూడా సురక్షిత ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఇటీవల BNCAP క్రాష్ టెస్ట్‌లోనూ ఈ కారు 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది.
టాటా కర్వ్ భారత మార్కెట్‌లో సరసమైన ధరకు అందుబాటులో ఉందనే చెప్పాలి. దీని బేస్ మోడల్ రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి టాప్ వేరియంట్ ధర రూ.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ ధర వద్ద మంచి కారుని కోరుకునే వారికి ఇది ఫర్‌ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది నేరుగా సిట్రోయిన్ బసాల్ట్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారాలకు గట్టి పోటీని ఇస్తుంది.

మొత్తం మీద ఈ టాటా కర్వ్ ఇంజిన్ పవర్, ఆధునిక ఫీచర్లు ఇతర కార్లతో పోల్చితే చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని ఓవరాల్ ఫర్ఫామెన్స్ కారణంగానే జనాలు ఈ కారుని భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కారు మొదటి నెలలోనే దాదాపు 5000 కార్లు అమ్ముడయ్యాయంటే రానున్న రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం లేకపోదు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








