సేఫ్టీలో తగ్గేదేలే అంటున్న టాటా కర్వ్.. పెద్దలు, పిల్లల రక్షణలో 5-స్టార్ రేటింగ్

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్(tata motors) ప్రయాణికుల భద్రతకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం తెలిసిందే. దీన్ని రుజువు చేస్తూ, ఈ కంపెనీకి చెందిన టాటా కర్వ్(tata Curvv), కర్వ్ ఎలక్ట్రిక్(Curvv Ev) ప్రమాద సమయంలో పెద్దలు, పిల్లల సేఫ్టీలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) కింద ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో రెండు కార్లు భద్రతా ప్రమాణాలలో ఈ రేటింగ్‌ను పొందాయి. ఇప్పటికే టాటా మోటార్స్ నుంచి SUV Nexon, దాని EV వెర్షన్, పంచ్ EV, హారియర్, సఫారి 5-స్టార్ రేటింగ్‌ను సాధించగా, ఇప్పుడు కర్వ్, కర్వ్ ఈవీ కార్లు ఇదే జాబితాలో నిలిచాయి.

పెద్దల ప్రొటెక్షన్ టెస్ట్‌లో టాటా కర్వ్ ఈవీ(Tata Curvv Ev)32 పాయింట్లకు 30.81 స్కోర్‌‌ను సాధించింది. అదే పిల్లల ప్రొటెక్షన్ టెస్ట్‌లో 49 పాయింట్లకు 44.83 స్కోర్‌ను పొందింది. టాటా కర్వ్ పెద్దల ప్రొటెక్షన్ టెస్ట్‌లో 32కి 29.5, పిల్లల కేటగిరీలో 49కి 43.66 స్కోర్‌లను సాధించింది.

Tata Curvv 5star Safety Rating

క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌‌ను సాధించడంతో టాటా కర్వ్ ఇప్పుడు టాటా అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా మారింది. భారత్ ఎన్సీఏపీ ప్రకారం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో టాటా కర్వ్ (Tata Curvv) ప్రమాదం జరిగినప్పుడు ముందు భాగంలో ప్రయాణికుల రక్షణ ఎలా ఉంటుంది అని నిర్వహించిన టెస్ట్‌లో 16.00 కు 14.65 పాయింట్లను పొందింది

అదే సైడ్ రక్షణకు సంబంధించి 16.00 కు 14.85 పాయింట్లు సాధించింది. ఈ టెస్ట్‌లో ప్రమాద సమయంలో ముందు ప్రయాణీకులు ఎక్కువగా సురక్షితంగా ఉన్నప్పటికీ, డ్రైవర్ కుడి కాలుకు కొంత రక్షణ తగ్గిందని తేలింది. కాబట్టి కంపెనీ ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Tata Curvv Scored 5star Safety Rating Bncap

టాటా కర్వ్ ఈవీ (Tata Curvv Ev) ఫ్రంటల్ ఆఫ్ సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16.00కి 15.66, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16.00కు 15.15 రేటింగ్ సాధించింది. కర్వ్ కంటే ఈవీ కారులో ముందు ప్రయాణీకులందరికీ ప్రమాదం జరిగినప్పుడు తగినంత రక్షణ లభిస్తుందని టెస్ట్‌లో వెల్లడైంది.

రెండు కార్లు కూడా ప్రయాణికుల భద్రత పరంగా కఠినమైన భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయని క్రాష్ టెస్ట్‌లో తేలింది. పెద్దలు, పిల్లల రక్షణలో రాజీ పడకుండా సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి టాటా మోటార్స్ భద్రతలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించడంతో టాటా కర్వ్, ఈవీ మోడల్స్ ఇతర కంపెనీల కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

Tata Curvv Ev Scored 5star Safety Rating Bncap

టాటా కర్వ్‌‌లో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్ 2 ఏడీఏఎస్, 360 డిగ్రీల కెమెరా, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కర్వ్ ఈవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్-స్టార్ట్ అండ్ డిసెంట్ అసిస్ట్, ఈఎస్పీ, డ్రైవర్ స్లీప్ అలర్ట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లు ఉన్నాయి.

ముఖ్యంగా టాటా కర్వ్ ఈవీఏఎస్ (అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్)ను కలిగి ఉంది. దీంతో టాటా కర్వ్ ఈవీ గంటకు 20 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు సౌండ్ అలర్ట్స్‌ను ఇస్తుంది. దీని ద్వారా డ్రైవర్ అలర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది

టాటా కర్వ్ ధర రూ.9.99 లక్షల నుంచి రూ.17.69 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అయితే ఇది ప్రారంభ ధర, అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ ధరలో లభిస్తుంది. ఆ తరువాత మార్పులు చోటు చేసుకోవచ్చు. టాటా కర్వ్ ఈవీ ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 16, 2024, 12:00 [IST]
English summary
Tata curvv and curvv ev scored 5star safety rating in bharat ncap crash test
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+